శ్యాం గారు నమస్తే
అబ్బో ,అబ్బో అని అబ్బుర పరచే అబ్బూరి వారి గాన మాధుర్యాన్ని గ్రోలే అరుదైన అదృష్టాన్ని కల్గించారు .ధన్య వాదాలు .మీరు నెట్ లో పరిచయం అయిన తొలి రోజుల్లో నే మిమ్మల్ని మొట్ట మొదటిగా అడిగింది అబ్బూరి వారి రికార్డులు సంపాదించి నెట్ లో పెట్టమని .ఇన్ని నెలలకు యెంత తపన ,శ్రమా పడి సంపాదించి అందించి నందుకు విని తరించే భాగ్యం కల్గించారు .1950 -56 మధ్యలో మా వుయ్యురుకు అయిదు కిలోమీటర్ల దూరం లో వున్న తొట్లవల్లూరు లో అబ్బూరి కురుక్షేత్ర నాటకం చూశాను .రాత్రి పడి గంటలకు ప్రారంభమై తెల్ల వారు ఝామున మూడింటి దాకా సాగిన నాటకం .అబ్బూరి ని మొదటి సారి ,చివరి సారి చూసింది అప్పుడే .అప్పటి నుంచే ఒక రక మైన ఆరాధనా భావం ఏర్పడింది .అప్పటి నావయస్సు పదిహేను మాత్రమే .ఒన్స్ మోర్ అని అడిగితె మళ్ళీ అదే పద్యాన్ని రాగాన్ని అదే స్త్హయిలో పాడే అరుదైన గాయకుడు వర ప్రసాద్ నిజంగా తెలుగు పద్య నాటకానికి అబ్బూరి వర ప్రసాడుడే .చెడు అలవాట్లతో అతి చిన్న తనం లోనే పోయాడు .వుయ్యూరు కు దగ్గర పెనమ కూరు అతని జన్మ స్థలం అక్కడే భోజరాజీవం కావ్యం రాసిన అనంతా మాత్యుడు కూడా జన్మించాడు .అబ్బూరి విజయవాడ లో మా దూరపు బంధువు చెరుకు పల్లి పట్టాభి రామయ్య గారు అనే గొప్ప వకీలు గారింటికి తరచూ వస్తు వుండే వాడని ఆయన నాతొ చెప్పారు వారింటికి చలం ,మునిమాణిక్యం ,విశ్వనాధ జొన్నలగడ్డ ,గూడూరి నమశ్శివాయ మొదలైన ప్రముఖులు వస్తుందే వారు .ఆయన కు సాహిత్యం మీద మంచి పట్టు వుండేది ఎన్నో సార్లు ఆబ్బురిని వ్యసనాలను వదిలిన్చుకోమని చిలక్కి చెప్పినట్లు చెప్పారట అలాగే అనే వాడట కాని మళ్ళీ మామూలేనట. గొప్ప గాయకుడు అలా చెడి పోయినందుకు బాధ గా ఉండేదని పట్టాభి రామయ్య గారు బాధ పడ్డారు .విధి లిఖితం అని సర్దుకు పోవాలేమో . నేను 1982 – 86 మధ్య కాలం లో పెనమ కూరు హై స్కూల్ లో physical సైన్సు టీచర్ గా పనిచేసినపుడు వర ప్రసాద్ అనే ఒక దళిత విద్యార్ధి ఎనిమిదో తరగతి చదువు తూందే వాడు అతను పద్యం పాడితే అపర అబ్బూరి లాగా పాడేవాడు .అందుకు నేను అతన్ని అనేక సందర్భాలలో ప్రోత్స్చాహించి పాదిన్చేవాడిని highdchool లోనే కాక వుయ్యూరు కాలేజీ లో కుడా పాడి అనేక బహుమతులు పొందాడు వాళ్ల నాన్న కూడా నా శిష్యుడే వుయ్యూరు స్కూల్ లో .అచట పుట్టిన చివురు కొమ్మైన చేవ ఆన్న దానికి ఇది సాక్షం . .
కొల్లూరి వారి నిధి నుండి రాగ నిధిని అందరికి అందజేసి ”రాగ నిధి చాల సుఖము .అబ్బూరి రాగ సన్నిధి చాల సుఖము ”అనిపించారు ధన్యోస్ములం .తరగని స్వర రాగ నిధి ,కొల్లేటి సరస్సంత వుందని పిస్తోంది భాస్కర రావు గారి దగ్గర .మీ జంటకు రాగ నమస్సులు మీ దుర్గా ప్రసాద్

