రవి కవి కి అక్షర అర్ఘ్యం

          రవి కవి కి అక్షర అర్ఘ్యం 
రవీంద్ర నాథ్ ఠాకూర్ అంతే ముందుగా గుర్తుకొచ్చేది ”జనగణ మన ”అనే మన జాతీయ గీతం తర్వాత ఆయనకు నోబెల్ పురస్కారాన్ని అందించిన ”గీతాంజలి ”గుర్తుకొస్తుంది .ఆయన ”కాబూలి వాలా ”కదా ,నౌకా భంగం నవల చండాలిక నాటిక గుర్తుకొస్తాయి .సంగీతం నృత్యం ,సాహిత్యం ,చిత్రకళా లను ప్రకృతి ఒడిలో నేర్పే ”శాంతి నికేతన్ ”జ్ఞాపకం వస్తుంది .ఆయన ఏర్చి కూర్చిన రవీంద్ర సంగీతం మనసులో మెదుల్తుంది .ఆయన బవిరి గడ్డము ,శాంతం తో కాంతి మయమైన నేత్రద్వయం కన్పిస్తాయి .సాహిత్యం మీద ఆయనకు వున్న పట్టు ,సాహిత్య శిల్పం పై ఆయన అభిప్రాయాలు గుర్తుకొస్తాయి .ప్రేమ చంద్
కు గురువు అని తెలుస్తుంది .గాంధీజీ కి మహాత్మా అని బిరుడునిచ్చాడని , మహాత్ముడే ఆయన్ను తన గురువు గా చెప్పుకున్నాడనీ గుర్తుకొస్తుంది ఇన్ని విశేషాలు కలిగి వున్న కవి మహాకవి విశ్వ కవి రవీంద్రుడు ఆయన 150  వ జయంతి నేడు ఆంటే 07 -05 -11  న .ఆ మహానుభావుని గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాము
                    రావీన్ద్రులు ప్రముఖ వినిక విద్వాంసులు శ్రీ తూములూరి సంగమేస్వర శాస్త్రి గారి వీణా గానాన్ని గంటల కొద్దీ వినేవారట .ఆ నాటి pitha పురం ఆస్థాన విద్వాంసులు శ్రీ శాస్త్రి గారు .శాస్త్రి గారిని తమ గురువు గా చెప్పుకున్న సంస్కారి రవీంద్రుడు .”నా హృదయాన్ని కరిగించారు ”అని ఆయన వీణా నాదాన్ని ప్రశంసించిన సంగీత మర్మజ్ఞుడు రవీంద్రుడు అలాగే శాస్త్రి గారు కూడా రవీంద్రుని పాట విని ”అది సాక్షాత్తు దేవలోకం పాటీ ”అని మెచ్చుకున్నారు .ఇద్దరు మహా మహుల సంస్కారం అది .అది అందరికి ఆదర్శం కావాలి .
                  రవీంద్రు గొప్ప చిత్ర కలా నిపుణుడు ఆయన చిత్రాలు ”అదో చేతనలోనా లో ఆనగివున్న ఆదిమ స్వరూపాలు .ఆయన చిత్ర రచన కల్పనా వాదం నుంచి వాస్తవ వాదానికి సాగింది .ఆయన దృష్టిలో ప్రతి చిన్న వస్తువు గొప్ప కల్పనా సాగరమే  ” అన్నాడు ప్రఖ్యాత చిత్రకారుడు రాచయిత,విశ్లేషకుడు సంజీవ దేవ్ .రేఖల్లో నృత్యాన్ని రంగుల్లో సంగీతాన్ని దర్శించి తిరిగి ప్రదర్సించటం ద్వారా విశ్వ చిత్ర కలా రంగం లో రవీంద్రుడు ఒక ఆరని జ్వాలా తోరణాన్ని వెలిగించాడని రవీంద్రుని చిత్ర కలా సాధన విశ్వ సౌందర్య సాధనమే నని సంజీవ దేవ్ ధృఢ విశ్వాసం .
                      విశ్వ మానవుని హృదయాన్ని అతని  ఆరాటాన్ని అక్షర రమ్యం గా తీర్చి దిద్దే కవితా గానం చేయ బట్టే రవీంద్రుడు విశ్వ కవి అయాడు విశ్వ ప్రేమామృత సందేశాన్ని అందించిన కాలా తీటా మహాకవి అని ఆచార్య బొడ్డు పల్లి పురుషోత్తం శ్లాఘించారు .విశ్వమానవ సంస్కృతీ చరిత్రలో నూతన అధ్యయ నానికే నాందీ ప్రస్తావన గావించిన గురుదేవుని ఆత్మీయత అగాధమయిందని,సత్య శివ సుందర మైనదని ఆచార్యుల వారి అభిప్రాయం .రావీన్ద్రునిది సమ ద్రుష్టి అనీ అందుకే ”విశ్వ భారతి ”కి ఆదర్శం గా ”యత్ర విశ్వం భవతి ఏక నీడం ”అన్న సూత్రాన్ని గ్రహించాడు .ఆయనది ఎల్లలు లేని చూపు అని మనకూ అర్ధం అవుతుంది .
                       ఇప్పుడు రవీంద్ర సంగీతం గురించి కొంత తెలుసుకుందాం .స్వదేశీ ,విదేశీ సంగీత సాధనా మిస్రమమే రవీంద్ర సంగీతం .ఇందులోని పాట ,ఫణితి దేసీయమైనవే వాటికి జవం జీవం తెచ్చి నునుపు దేర్చి నుడికారం తో లలిత మైన దేసీ ఫనితులతో గేయాల్ని చెవులకు ఇంపు గొలిపే టట్లు చేసానని రావీన్ద్రుడే చెప్పాడు అదొక అద్భుత ప్రక్రియ గా వంగ భూమిలో వర్ధిల్లింది ఆయన రూపకాలను ఆడకుండా పాడినా ,పాడకుండా ఆడినా సరస్సు లోంచి లాగి గట్టున పడేసిన కమలం లాగా కందిపోతుంది అని శాంతి నికేతన్ విద్యార్ధి రవీంద్రుని ప్రత్యక్ష శిష్యుడు ఆచార్య రాయ ప్రోలు సుబ్బా రావు స్పష్టం చేసారున్ .
            రవి కవిని గురించి కృష్ణా పత్రిక సంపాదకులు ముట్నూరి కృష్ణా రావు ”రవీంద్రుడు విశ్వ మోహనుడు .ఆయన సౌందర్య జ్యోతిని దర్సిమ్చాలంటే పసి పిల్లల చూపు లాంటి చూపు కావాలి .అప్పుడే ఆయన దివ్య దర్సనం అవుతుంది .ఆయన లోని కవి ,కధకుడు వేదాంతి సౌందర్య మూర్తి మనకూ కనిపిస్తారు .అతని  రూపులో ,చూపులో ,పలుకు లో పాటలో అంతా సౌందర్యమే .అదొక రస విహారం .స్త్రీ మార్దవం ,మాధుర్యం మేలవిన్చుకున్న పురుష విగ్రహం అది .శాంతం ,గాంభీర్యం వర్చస్సు madhura మంజుల రూప సంపదా ఓజస్సు ,ఠీవి రమ్య లోకాలను చూపే చిరునవ్వు మన హృదయాలకు పండుగ చేస్తాయి ”అని అనిర్వచనీయ ఆనందం తో రవీంద్ర ప్రశంస చేసారు
         రవీంద్రుని ఆరాధనా దైవం నిఖిలరసామృత  మూర్తి .అయిన ”విశ్వ మానవుడు ”.,సకల కళ్యాణ గుణ సంపన్నుడైన విశ్వ మోహన మూర్తి .ఆ విస్వమోహనుని ప్రతి రూపమే రవీంద్రుడు అని పొంగిపోయారు ముట్నూరి మహాను భావుడు .
  ఇప్పుడు రవీంద్రుని దృష్తి లో సౌందర్య ఆంటే ఏమిటో ఆయన మాటల్లోనే తెలుసు కుందాం ”లోకం ఆంటే భయంకర సంక్షోభాలను కల్గించే తుఫానులకు పుట్టినిల్లు .ఈ తుఫానుల తీవ్రతను నాశనం చేసి పరమ శాంతిని నెలకొల్పుతుంది ”విశ్వ సౌందర్యం ”అనే విశ్వ నాదం ”
            ప్రముఖ కవులు రవి కవి ప్రశంసను ఎలా చేసారో చూద్దాంo
             ”  వో  కవితా రసాల పుమ్స్కోకిలమా -వ్యాకులమౌ -మా జాతికి నీ గీతికా మధుమాస మహోదయమ్ము” నారాయణ రెడ్డి
              ”నీవు ప్రభుని చరణమ్ముల నివేదించు గీతాంజలి -నిత్యమూ బీటేత్తిన  గుండెల పండించు రసామ్జలి ”         ”””
                     ” ఈ లోకంమొక నాకమౌనటుల నీవే చేయగా జాలె  డీ
                        హాలాహాల మాయ ప్రపంచము సుధా వ్యాప్తంము గావింతు వీ
                        వ్యాళాభీల వనమ్ము నందన వణ ప్రాయంబు గావించి ,క్రోం
                       బూలన్ నిండిన పారి జాతములతో పోమ్గింతువో సత్కవీ ”                 దాశరధి
            ”దైవము నీకు మిత్రుని విధంముగాన్ ప్రియువోలె ప్రేయసీ
             భావమునన్ ,స్వసోదరుని భాతి ,కుమారుని వోలె నవ్య రా
           జీవము రీతి ,పాన్దుదాటు ,చిత్ర విచిత్రముగా వెలింగె రా
          నీవే సమస్త విశ్వమాయి నిల్చి తి వాతాడు నీకు ఊత గా ”                          దాశరధి
                                ”జయతి రవీన్ద్రో నూతన
                                కవి లోక శిఖామనీ (sikhamanee )
                                అధునాతన బహు కవి
                                రాత్కిరనోద్గమ భూమి మార్తాన్దః ”
           ”వ్యాఖార్ధైక నిబంధనా ఖలు త్రయీ శబ్దార్ధ తాత్పర్య భాన్మూర్తి ర్లౌకిక భారతీ ,పునరియం యాతా త్రయి వర్త్మని ఏశాధ్యాత్మిక భావనా కృతి మతి ర్వాజ్మాత్ర మూర్తి ,స్వయం స్పష్టాస్పస్త త ను స్థానోతి ,నితరాం మోదా మనచ్చేతసాం ”   ఇది కవితా విశ్వనాధుడు కవి సామ్రాట్ జ్ఞాన peetha  , పురస్కార  గ్రహీత విశ్వ నాద సత్యనారాయణ గారు విశ్వ కవి రవీంద్రుని కవితా వైభవాన్ని అమర భాషలో
శ్లాఘించిన విధానం  జయంతితో సుకృతినో రస సిద్ధాః కవీశ్వరాః ”అని రవి కవి కి అక్షర అర్ఘ్యం సమర్పిస్తున్నాను
                                                                      గబ్బిట దుర్గా ప్రసాద్
                                                                      07 – 05 -11  న రవీంద్రుని 150  వ జయంతి సందర్భం గా సమర్పించిన అక్షర అర్ఘ్యం
Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సమయం - సందర్భం. Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.