ఆలోచనా లోచనం
రహస్యం దాగదు
సాధారణంగా కొన్నిపనులు బహిరంగం గా అంతే అందరు చూసేట్లు ,కొన్ని రహస్యం గా అంతే ఎవరు లేని సమయం లో,చూడని సమయం లో చేస్తుంటాము .రహస్యం గా చేసే పనిని ఎవ్వరు చూడలేదని ,అది మనకూ మాత్రమే తెలుసునని గర్వ పడటం .తృప్తి చెందుతాం .అది పాపపు పని అయితె మరీ గుంభన గా చేస్తాం .అయితె మన అంతరాత్మ మనకూ సాక్షి అని మర్చి పోతాం .జగస్సాక్షి ఒకడున్నాడని మరిచి పోతాము కూడా .మనం చేసే పని ఎవరికి తెలియదనుకోవటం అవివేకం అని తెలియ జెప్పే ”విపులుడు ”అన్న వాని కధ మహాభారతం లో వుంది .ఆ కధ లోకి ప్రవేసిద్దాం .
పూర్వకాలం లో దేవసర్మ అనే నిష్టా గరిష్ఠుడైన మహర్షి వుండే వాడు .ఆయన భార్య రుచి .అన్యోన్య దంపతులుగా చిరకాలం జీవించారు .ఆయనకు ఆమె పై తగని ప్రేమ దానివల్ల ఆశ్రమం విడిచి ఎక్కడకు వెళ్ళే వాడు కాదు .ఒకసారి ఆయన వేరొక ప్రదేస్సం లో యజ్ఞం చేయాల్సి వచ్చింది .సందిగ్ధం లో పడ్డాడు .”విపులుడు” అనే నమ్మక మైన శిష్యుడిని పిలిచి ,తాను యాగం చేయించ టానికి పొరుగు వూరు వెళ్తున్నాననీ ,పర్ణ శాలలో ఒంటరిగా వుండే గురుపత్నికి ఏ కష్టం రాకుండా చూసుకోమని చెప్పి ,ఇంద్రుడు చాలా మాయావి అనీ ,అతడు ఆశ్రమం లోకి అడుగు పెట్టకుండా జాగ్రత్త వహించమని చెప్పి వెళ్ళాడు .గురువుకు అభయం ఇచ్చి ,కర్తవ్య దీక్షలో వున్నాడు శిష్యుడు విపులుడు .ఇంద్రుడి మాయనుంచి గురు పత్నిని ఎలా తప్పించాలా అని తీవ్రం గా ఆలోచించాడు .ఒక ఉపాయం తట్టింది ఆమె నిద్రపోయే సమయం లో దగ్గరకు వెళ్లి ”అమ్మా !మంచి కధలు చెబుతాను ఊ కొడుతూ నిద్రపోండి ”అని వేడుకున్నాడు .కధలు వరుసగా చెబుతూనే వున్నాడు ..ఆమె ఊ కొడుతూ నిద్ర లోకి జారుకొంది .
విపులుడు తన యోగ మాయ తో ఆమె శరీరం లోకి తన ఆత్మను ప్రవేశ పెట్టాడు .ఆమె చైతన్య రహిత యెట్లు చేసాడు .ఇంద్రుడు రానే వచ్చాడు .విపులుడు నిద్ర పోతున్నాడని భావించి రుచీ దేవికి తన ప్రేమ విషయం చెప్పాడు .ఆమెలో చలనం లేదు కదా !ఆమె శరీరం లోని విపులుడు ”నా దగ్గరకు వస్తే నశిస్తావు ”అని బిగ్గరగా అన్నాడు .భయపడి ,భంగ పడి ఇంద్రుడు పారిపోయాడు .నెమ్మదిగా గురుపత్ని శరీరం లోంచి తన ఆత్మను వుపసంహరించాడు .ఆమె లేచి కూర్చుంది .గురువుదేవశర్మ అప్పుడే తిరిగి వచ్చాడు ..శిష్య్డుదు జరిగిన సంగతంతా గురువుకు నివేదించాడు గురువు చాలా సంతోషించాడు .కాని ఆశ్రమం వెలుపల తనను గురించి చెడు గా మాట్లాడు కుంటున్న వారి మాటలు విన్నాడు . దుక్ఖం ముంచుకొచ్చింది .కస్టపడి దీక్ష తో గురుపత్నిని రక్షిస్తే తనపై నీలాపనిన్దలా ?అనుకున్నాడు .అంతర్మధనం ప్రారంభమైంది .తాను చేసిన తప్పు ఏమిటి అని వితర్కిన్చుకున్నాడు .అప్పుడు తెలిసింది తాను గురుపత్ని శరీరం లో ప్రవేశించిన సంగతి గురువుకు చెప్పలేదని .పశ్చాత్తాప హృదయం తో ఆశ్రమం ముందు వాకిట్లో తలవంచు కొని నిల బడ్డాడు తప్పు చేసిన వాడి లాగ .
శిష్యుడు అలా ఎందుకున్నాడో గురువు ఆలోచించాడు .దివ్య ద్రుష్టి తో జరిగిందంతా తెలుసుకున్నాడు వాత్స్చాల్యం గా శిష్య్ని పిల్చి ”లోకులు ఆడిన మాటలకు నొచ్చు కున్నావా?రుచి శరీరం లో నువ్వు ప్రవేశించిన సంగతి వాళ్లకు తప్పు గా అనిపించా వచ్చు .నాకు మాత్రం నువ్వు ధర్మ బద్ధం గానే ప్రవర్తిమ్చావనిపించింది .నేను అనుమాన పడితే నిన్ను ఆరోజే శపించే వాడిని కదా !.నీకు ఏ పాపం అంటదు .ఏ దుర్గతి రాదు .నమ్ము .ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకో .నిన్ను గురించి చెడు గా మాట్లాడిన స్త్ర్ర్ పురుషులు ఎవరో కాదు రాత్రి పగలు .దారిలో కనిపించిన జూడ గాళ్ళు ఆరుగురూ ఆరు ఋతువులు .అంటే మనం చేసే ప్రతి పనినీ రాత్రిమ్బగల్లు ,ఋతువులూ ఎప్పుడూ చూస్తూనే వుంటాయి .అవి నిఘా నేత్రాలు .అని మర్చి పోరాడు .అనుక్షణం అవి మనల్ని గమనిస్తూనే వుంటాయి అంటే కాదు అతి రహస్యం బట్టబయలు అవుతుందన్న సామెత కూడా వుంది ”అన్నాడు .మనం చేసే ఎంతటి రహస్య కార్య మైనా ఎవరికీ తెలియదను కోవటం అవివేకం మాత్రమే .చివరికి ముని దంపతులు ,శిష్యుడు విపులుడు కుడా పుణ్యలోకాలకు చేరారు .విధి నిర్వహణ అందులో స్త్రీ సంరక్షణ చాల కష్ట తరం .దాన్ని సక్రమంగా నిర్వర్తించి విపులుడు చరితార్దు డైనాడు
గబ్బిట దుర్గా ప్రసాద్
ఆలోచనా లోచనం శీర్షికన ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి 10 – 05 11 న అంటే ఈ రోజ్జే ప్రసార mainadi i

