డుంబు -బుజ్జాయి
— శ్యాం నారాయణ్ గారు నమస్తే
బుజ్జాయి గారి డుంబు ను చాలఏళ్ళకు మీ ద్వారా చూసాను .ముళ్ళ పూడి వారి బుడుగు కు సైదోడు డుంబు .contemporaties కూడా బుడుగు మాటల పిడుగు ,పోకిరి వేషాల కిలాడీ డుంబు చిలిపి చేష్టల చిన్నోడు .ఒకరకం గా వీడు సిలెంట్ కిల్లర్ .ఇద్దరి సృష్టి కర్తలు మద్రాసు నివాసులే అవటం తమాషా. డుంబు తండ్రి ,తండ్ర్రి చాటు ఆంటే కృష్ణ శాస్త్రి గారి చాటునే చాల కాలం వుంటున్నా ,తన ప్రతిభను చిత్రాల ద్వారా ,పరంపరగా వెలువరించి ,బాలలల మనసు దోచేవాడు .బుడుగు తండ్రి రమణ అప్పటికే ఆరిందా రచయిత .తన వ్యంగ్య హాస్య రచనల తో దేశాన్ని మున్చేసాడు పిల్లల తో పాటు పెద్ద వాళ్ల మనసుల్నీ దోచేసాడు .బుడుక్కి రాత తండ్రి రమణ ,గీత తండ్రి బాపు .కాని డుమ్బుకు రాత ,గీతా అంతా బుజ్జాయే అవటం ప్రత్యేకత .బుజ్జాయి చాలా భిడియస్తుడు.రమణ మాత్రం అప్పటికే ముదురు .బాపు దోస్తీ రమణకు పెద్ద సాహిత్య సాంస్కృతిక ఆస్తి .బుజ్జాయి తండ్రి గారితో రాష్ట్ర మంతటా తిరిగి ,తండ్రి తో సభల్లో పాల్గొని ఎందరో ప్రముఖులతో పరిచయాలు పొందాడు ఇప్పుడు బుజ్జాయి వయసు ఎనభై పైనే .ఈ మధ్యనే హైదరాబాద్ వచ్చి ఇంటర్ వ్యూ ఇచ్చి తన అభి ప్రాయాలన్నీ చెప్పాడు .ఏదో ఒక గొప్ప ప్రాజెక్ట్ మనసులో వుందని దాన్ని త్వరలో పూర్తి చేస్తానని ఆన్నారు .
భావ కవి గా కృష్ణ శాస్త్రి గారు ప్రసిద్ధులు .ఆయన మద్రాస్ లో త్యాగరాజ నగర్ లో స్వంత ఇంట్లో వుండే వారు రెండస్తుల భవనం .మా పెద్దక్కయ్య లోపాముద్ర మావ గారు గాడే పల్లి పండిట్ రావు గారికి కృష్ణ శాస్త్రి దగ్గర బంధువు .అక్కయ్య వ,బావ కృపానిధి మద్రాస్ షెనొయ్ నగర్ లో వుండే వారు .నేను మద్రాస్ వెళ్ళినప్పుడు నన్ను మా అక్కయ్య కానీ ,మామేనకోడలు కళ కాని మేనల్లుడు శ్రీనివాస్ కాని నన్ను శాస్త్రి గారింటికి తీసుకొని వెళ్తుండే వాళ్ళు .ఆయన ,ఆయన భార్య రాజ హంస గారు .బుజ్జాయి ,ఆయన భార్య మమ్మల్ని చక్కగా ఆహ్వానించి మర్యాదలు చేసే వారు .వారింటిలో కాఫీ అద్భుతం గా వుండేది బుజ్జాయి తో పెద్దగా మాట్లాడిన గుర్తు లేదు .ఆయన కొంచెం దూరం గానే వుండే వారు .కృష్ణ శాస్త్రి గారి దగ్గరే కుర్చుని ఆయన స్క్రిబ్బ్లింగ్ పాడ్ మీద రాసి ప్రస్నిస్తుంటే సమాధానం రాసే వాణ్ని .నేను ప్రశ్నిస్తే ఆయన సంమధానం రాసే వారు .అలా కనీసం గంట పై గా గడిచేది చాల చిన్న పిల్లాడి స్వభావం .అరమరికలు ఉండేవి కావు మా గబ్బిట వారి వంశం లోని పండితుల ,గాయకుల పేర్లు అన్నీ జ్ఞాపకం చేసే వారు .తన పుస్తకాలను సంతకం పెట్టి ఇచ్చే వారు .
ఒక సారి నన్ను నా మేన కోడల్ని తన కారు లో ఎక్కించుకొని tnagar అంతా తిప్పారు .ఎంతో ప్రేమ ,ఆత్మీయత చూపించే వారు వాటిలో మనం కరిగి పోవాల్సిందే .భార్య రాజహంస కూడా అంత ఆప్యాయతను చూపేవారు .టిఫిన్ చేసి తిని పించే వారు .కృష్ణ సాస్త్త్రి గారితో ఇంతటి అనుబంధం నాకు వుందంటే ఒళ్ళు గగుర్పొడుస్తుంది .ఆయనకు రాజ్య లక్ష్మి ఫౌండేషన్ అవార్డ్ ను రమణయ్య రాజా అందించి నప్పుడు అనుకో కుండా నేను మద్రాస్ లో వున్నాను .మా మేన కోడలు కళ అప్పుడు ఆ ఫౌండేషన్ లో పని చేస్తోంది కలది మంచి kanthasvaram .radio లో పాడేది .అంత్యాక్షరి చేసేది .కళను ఆ సభకు ప్రార్ధన గీతం పాడమన్నారట ..నేను వాళ్ళింట్లోనే వున్నాను నన్ను పాట రాయమంది తాను ట్యూన్ కట్టి పాడతానంది .”వాగధీశ్వరీ వాణీ – వీణా పుస్తక ధారిణీ” అని పాట రాసాను .దానికి అద్భుత మైన ట్యూన్ కట్టి ఆ నాటి సన్మాన సభలో ప్రార్ధనా గీతం పాడింది నా మేన కోడలు కళ .చప్పట్లు మారు మోగాయి ఆ సభలో దాశరధి నారాయణ రెడ్డి ,బెజవాడ గోపాలరెడ్డి ,పిలకా గణపతి శాస్త్రి మొదలైన వుడ్డండులున్నారు ..చాలా గొప్ప సన్మానం అది .హాల్ కూడా tnagar లోనే పేరు జ్ఞాపకం లేదు .గొప్ప హాలు నారాయణ రెడ్డి కళను పిలిచి పాట ఎవరు రాసారమ్మా అని అడగటం మా మామయ్యా రాసారని చెప్పటము పాట బాగుంది నీ పాడటము ఇంకా బాగుంది అనటము జరిగింది . కృష్ణ శాస్త్రి గారు ఇంకో పదిహేను రోజుల్లో పోతారనగా నేను మద్రాస్ వెళ్ళాను .అప్పటికి ఆరోగ్యం గానే వున్నారు .స్క్రిబ్బ్లింగ్ పాడ్ మీద మా సంభాషణ గంటకు పైనే జరిగింది .బహుశా అది ఫెబ్రవరి నెల అని జ్ఞాపకం .అదే చివరి సారిగా వారిని దర్శించటంఅవుతుందని అనుకో లేదు వుయ్యూరు తిరిగి వచ్చిన తర్వాత వారి మరణ వార్త విన్నాను ఆ మహా కవికి అక్షరాంజలి ఘాతించటం తప్ప చేయ గలిగిన్దేముంది ?”షెల్లీ మళ్ళీ చనిపోయాడు ”అని శ్రీ శ్రీ అన్న మాట నిత్య సత్యం .నేను అంతకు చాలా ఏళ్ళ ముందు ”భావ కవిత్వానికి మేస్త్రి కృష్ణ శాస్త్రి ”అన్న వ్యాసం రాస్తే ”తెలుగు విద్యార్ధి ”మాస పత్రికలో ప్రచురిత మైంది .ఉషశ్రీ గారు విజయవాడ radio కేంద్రం లో పనిచేస్తున్నప్పుడు ”కృష్ణ శాస్త్రి .-మానవత ”అన్న ప్రసంగం చేసే అదృష్టం కల్గింది
నా చిన్నతనం లో ఆంటే 1950 -53 మధ్య కృష్ణ శాస్త్రి గారు ,కాటూరి వెంకటేశ్వర రావు గారు వుయ్యురులో మా ఇంటికి వచ్చారు .మా పెద్ద బావ (మద్రాస్ )గారి తమ్ముడు కన్నా వివాహం విజయ వాడలో జరుగు తున్న సందర్భం గా మా కుటుంబాన్ని పెళ్ళికి ఆహ్వానించ టానికి వచ్చారు అదే మొదటి సారి వారిద్దరిని చూడటం .పెళ్ళికి బేజ వాడ వెళ్ళాం కుడా .కృష్ణ శాస్త్రి గారికి అప్పటికి గొంతు బాగా వుంది గల గలా మాట్లాడారు .మా అక్కయ్య తో చాలా ఆప్యాయంగా మాట్లాడారు కాటూరి వారు చుట్ట కాలుస్తూ కాల క్షేపం చేసారు ఆయనది మా వుయ్యూరు దగ్గర కాటూరు గ్రామమే ఖద్దరు పంచ లాల్చి ,కోటు తో కాటూరి ,మల్లె పువ్వు లాంటి తెల్లని పైజమా చొక్కా తో కృష్ణ శాస్త్రి గారిని చూసిన జ్ఞాపకం అప్పటికి నా వయసు పదమూడు లోపే .
బుజ్జాయి గురించి మొదలు పెట్టి జ్ఞాపకాలను దొంతరలు గా దొర్లించాను .
దీని ద్వారా బుజ్జాయి గారికి ఒక విన్నపం కృష్ణ శాస్త్రి గారి స్క్రిబ్బ్లింగ్ పాడ్ లో ఎందరో మహానుభావుల పలకరింపులు ,చిలకరింపులు ,ఆప్యాయతలు ఆత్మీయతలు గౌరవ అభినందనలు నిక్షిప్తమై వున్నాయి ఎన్నో ఏళ్ళ నుండి. అవిబుజ్జాయి జాగ్రత్త చేసి ఉంటారని తలుస్తా కొన్నేళ్ళ క్రితం వాటిని అచ్చు రూపం లో తెస్తానని ఆయన అన్నట్లు చదివిన జ్ఞాపకం .అరుదైన ఆ అక్షర సంపదను అవసరం అయితె ఎడిట్ చేసి వెలుగు లోకి తేవాలని కోరు తున్నాను .ఇది నా ఒక్కరి కోరిక మాత్రమే కాదు అందరి అభి ప్రాయము అని భావిస్తున్నాను .
మరొక్క మారు అభినందిస్తూ శ్యాం గారు సెలవ్
మీ దుర్గా ప్రసాద్

