సాహిత్య సమోసాలు -రెండో వాయి
01 -గురజాడ వారి ”ముత్యాల సరం ;;ఛందస్సు ,సంస్కృతం లోని ”మధుమతి ”ఛందస్సు ఒకటే నని పండితాభిప్రాయం .
02 -పానుగంటి లక్ష్మి నరసింహం ,చిలకమర్తి లక్ష్మి నరసింహం ,కూచి లక్ష్మి నరసింహం గార్లను ”సింహ త్రయం ”అనేవారట నండూరి బంగారయ్య గారు .
౦౩-పానుగంటి వారు గీత పద్యాలు ఎక్కువగా రాసేవారు అందుకని ఆయన్ను ”గీత కవి ‘[‘అనే వారు
౦౪-”కన్ను వోయిన అమ్మకి మతి ఇచ్చాడు ”ఇవి చిలకమర్తి వారి గురించి గుర్రం జాషువా అన్న మాటలు దీని అర్ధం చిలక మర్తి గుడ్డి వారైనా గోప్పరచనలు చేసి తెలుగు భాషకే కళ్ళు ఇచ్చారు అని
05 -వావిలాల వాసుదేవ శాస్త్రి ,వీరేశ లింగం వడ్డాది సుబ్బా రాయుడు లను” ఆధునిక కవి త్రయం ”అనే వారు
06 -వావిలాల వాసుదేవ శాస్త్రి గారు బి .ఏ .పరీక్ష లో (1877 )ఉత్తర సర్కారు లో ఇంగ్లిష్ లో మొదటి మార్కు పొంది macdonaald మెడల్ సాధించారు .ఆంగ్ల నాటకాలను తెలుగు లోకి అనువదించిన మొదటి వాడు ఆయనే .మొదటి తెలుగు స్వతంత్ర నాటకం ”నందక రాజ్యం ”రాసిందీ ఆయనే .
07 -వావిలాల వాసుదేవ శాస్త్రి గారి పేరు ఆటవెలది పద్య పాదానికి సరిపోతుంది యతి తో సహా .వీరి బావ గారు వీరిని ”బావ గారు ఆటవెలది పాదాలలో చిక్కు కున్నారు ”అని వుడికించే వారట. .
08 – వెంకట రామ కృష్ణ కవులలో ఒకరైన శ్రీ ఓలేటి అత్యుత రామ శాస్త్రి పానుగంటి వారి” సాక్షి” వ్యాసాలు లాగా ”పరశు రామ కవి పద్యోపన్యాసాలు ”అని వ్రాసి భారతి మాస పత్రిక లో ప్రచురించే వారట .
09 -ఆచార్య విస్సా అప్ప రావు గారు తమ కుమారుడికి వేటూరి ప్రభాకర శాస్త్రి గారి కుమార్తె తో వివాహం జరిపించారు .విస్సా వారి జీతం అప్పుడు నెలకు ఎనిమిది వందల రూపాయలు .శాస్త్రి గారిది నెలకు యాభయి మాత్రమే .దీన్ని పోలుస్తూ శాస్త్రి గారు ”మీకేన్ని రూపాయల జీతమో మాకు అన్ని అణాలు ”అని చమత్కరించారట. ఒక రూపాయికి పదహారు అణాలు .
10 -ఉత్తరాంధ్ర లోని శ్రీకాకుళానికి చెందిన వాసా సూర్య నారాయణ శాస్త్రి గారు లోకమాన్య బాల గంగాధర తిలకు జీవిత చరిత్రను సంస్కృతం లో వ్రాసిన ఘనులు
వాయి తిరగేసిన వాడు
గబ్బిట దుర్గా ప్రసాద్
శ్రీ టేకుమళ్ళ కామేశ్వర రావు గారి ”నా వాజ్మయ మిత్రులు ”పుస్తకం లోని వాటిని మీ కోసం ఏరి ఈ పేజి పళ్ళెం లో పెట్టాను .

