సాహితీ సంపెంగలు
01 – విజయ నగర సంస్థానం లో కలిగొట్టు కామ రాజు అనే గొప్ప గాయకుడు వుండేవారు .మహా రాజుబ్రతిమాలినా తనకు తోస్తేనే పాట పాడే వారట అంతటి స్వాతంత్ర్యం ఆయనది
-02 – కొక్కొండ వెంకట రత్న కవి వెండి ,బంగారం మొదలైన లోహాల పేర్లతో కొత్త రకమైన వృత్తాలు కనిపెట్టి రాశారు ఆయన పచ్చి గ్రాంధిక వాది పూజ చేస్తూ ”పలుకు దెయ్యమా (సరస్వతీదేవి) ఇది పాయసమమ్మా ,”బామ్మ దేయ్యపుటిల్లాలా ఇది పానకము త్రాగుమమ్మా ”అని నైవేద్యం పెట్టె వార ట సరస్వతి దేవికి .ఆంధ్ర జాన్సన్ బిరుదు పొందిన ఘనులు ఆయన .౦౩-
-02 – కొక్కొండ వెంకట రత్న కవి వెండి ,బంగారం మొదలైన లోహాల పేర్లతో కొత్త రకమైన వృత్తాలు కనిపెట్టి రాశారు ఆయన పచ్చి గ్రాంధిక వాది పూజ చేస్తూ ”పలుకు దెయ్యమా (సరస్వతీదేవి) ఇది పాయసమమ్మా ,”బామ్మ దేయ్యపుటిల్లాలా ఇది పానకము త్రాగుమమ్మా ”అని నైవేద్యం పెట్టె వార ట సరస్వతి దేవికి .ఆంధ్ర జాన్సన్ బిరుదు పొందిన ఘనులు ఆయన .౦౩-
03 -ఆది భట్ల నారాయణ దాసు సంస్కృతం లో వున్న ”విష్ణు సహస్ర నామ సంకీర్తన ”ను అచ్చ తెలుగులో ”వెన్నుని వేలు పేరుల వెనుకరి ”గా రాశారు .సంగీత ,సాహిత్యాలలో ఉద్దండులైన దాసు గారు ప్రముఖ వాగ్గేయ కారుడు త్యాగయ్య గారి జయంతి రోజున మరణించారు .
04 – వేలూరి శివ రామ శాస్త్రి గారు శతావధాని .ఇంజరం గ్రామం లో శతావధానం చేయ టానికి వెళ్లారు .అంత మంది పృచ్చకులు దొరక రేమో నని ,అభ్యాసం కోసం ,మామిడి తోటలో స్నేహితునితో ప్రశ్నలు కాగితం మీద రాయించి చెట్టు కొమ్మలకు కట్టి శతావధానం ప్రాక్టీసు చేసారట .సభలో ఇది బాగా ఉపయోగ పడి గొప్పగా నిర్వహించి ప్రసంసలనందుకున్నారు .
05 – అభినవాంధ్ర కవి నిర్మాణం లో తల్లవఝాల తలల శివ శంకర శాస్త్రి ఒక యంత్రం అని పించ్కున్నారు .నిష్పాక్షికం గా విమర్శించే వారు .అందుకని ఆయన్ను ”చాకి రేవు ”అని పిలిచే వారట .ఉతికి ఆరేయటం ఆయన పని అన్న మాట .
06 – ”పాకిస్తాన్ ,ద్రావిడ స్తాన్ ,చంపెస్తాన్ -ఖనిల్ ఖనిల్ ,దమ ధామా ” అని 1890 లోనే చిలుకూరి నారాయణ రావు గారు వచన కవిత్వానికి దారి చేసారు
07 – జయంతి రామయ్య గారు ఒక సారి మద్రాసుకు వోడలో వెళ్తూ పొరబాటున సముద్రం లో జారి పడ్డారు .ఆయనకున్న పొడవాటి వెంట్రుకల జుట్టు పట్టుకొని వొడ కాప్టైన్ పైకి లాగి రక్షించాడు ఇలా బతికి బయట పడ్డారు కనుకనే 1200 ల శాసనాలు పరిశీలించి ,పరిష్కరించి వెలువరించి భాషా సేవ చేసారు .
08 – పండిత శివ నాద శాస్త్రి బ్రహ్మ సమాజ వ్యాప్తి చేస్తూ రాజమండ్రి లో ఉపన్యాసం ఇచ్చారు .shorthand సౌకర్యం లేని ఆ కాలం లో జయంతి రామయ్య గారు దాన్ని క్షుణ్ణం గా విని అక్షరం పొల్లు పోకుండా పేపర్ కు రాసి పంపించారట .అది యదా తదం గా పత్రికలో అచ్చు అయింది .అప్పుడు రామయ్య బి.ఏ ..విద్యార్దియే ఇంకా ..”చికిలి కన్నుల వాడేనా ఇది రాసిందీ ”అని ఆశ్చర్య పోయారట .రామయ గారికి కళ్ళు చిట్లించే అలవాటు వుండే దట .
09 – మాడ భూషి వెంకటా చార్య కవి గొప్ప అవధాని .మంచి వినికిడి శక్తి వుండేది .ఒక గదిలో 100 చెంబులు పెట్టి పుల్లతో వాయిస్తే ,గది బయట వున్న ఆచార్యుల వారు విని ఏ ధ్వని ఏ సంఖ్య చెంబులోనుంచి వచ్చిందో ఖచ్చితం గా చెప్పే వారట నూజివీడు సంస్థాన కవిగా ,అభినవ పండిత రాయలు గా ప్రసిద్ధులు
10 – వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు (అమరావతి),నరసరావు పేట జమీందార్ మల్రాజు గుండా రాయుడు ,నూజివీడు ప్రభువు అప్పా రావు ,చల్ల పల్లి జమీందార్ అంకినీడు ఇష్టా గోష్టి చేస్తున్నారు .మల్రాజు సరదాగా ”మనం చస్తే లోకం మనల్ని గురించి ఎమనుకుంటుందో ఆలోచిద్దాం ”అన్నాడట .సరే నన్నరంతా .అప్పుడు మల్రాజే ”నూజివీడు దొర చస్తే బైరాగులేడుస్తారు .నే చస్తే వేస్యలంతా లబో దిబో .వెంకటాద్రి చస్తే అల్లో అని దుఖిస్తారు .అంకి నీడు చస్తే అంతా ఆహా అని ఆనందిస్తారు ”అన్నాడట.అంతా విని నవ్వుకున్నారట భేషజం లేకుండా అదీ స్నేహం ఆంటే .
సేకరణ
గబ్బిట దుర్గా ప్రసాద్
ఈ సంపెంగలు శ్రీ మధునా పంతుల సత్య నారాయణ శాస్రి రచించిన ”ఆంద్ర రచయితలు ”తోట లోనివి .మీ కోసం ఏరి ఈ పేజి పూల సెజ్జ లో పేర్చాను


చాలా ఆసక్తికరమైన విషయాలు చెప్పారు.
“వెన్నుని వేలు పేరుల వెనుకరి” ఇప్పుడెక్కడైనా దొరుకుతుందా?
LikeLike