కళా స్రష్ట విశ్వ నాథ్

   కళా స్రష్ట విశ్వ నాథ్
                        హిందీ లో ఝనక్ ఝనక్ పాయల్ బాజే ,నవరంగ్ వంటి అద్భుత కళా ఖండాలు సృష్టించి సంగీతానికి ,సాహిత్యానికి భారతీయ కళా వైభవానికి వున్నత మైన స్థానం కల్పించిన వాడు శాంతా రాం .అవి అద్వితీయాలు అనిపించుకున్నాయి  అంత ఎత్తుకు ఎవరు చేరలేరని భావించిన రోజులవ హిందీసినిమాలకుదేశమంతట  అభిమానులుంటారు .ఆదరిస్తారు .ఆ సిన్మాలకు మంచి మార్కెట్ వుంది .శత దినోత్చ వాలు చేసుకొనేవి .అవి దర్శకుని సృజాత్మక శక్తికి నిదర్శ నాలు .అలాంటి సినిమాలు తెలుగు లో తీయ టానికి సాహసించటం కష్టమే .మరి కొత్త దనం కళాల పట్ల పూర్తి అవగాహనా ,ఆరాధనా వున్న దర్శకులు ఊరుకో లేరు .ప్రయత్నం చేస్తారు .చేసి ప్రతిభను నిరూపిస్తారు
అదిగో  ఆ కోవ లోని వాడే మన కాశీ నాధుని విశ్వ నాద్
                              దిగ్దర్సాకుడు ఆదుర్తి సుబ్బా రావు దగ్గర అసిస్టెంట్ గా పనిచేసి ,క్రమంగా తనపై పెట్టిన  విశ్వాశాన్ని   రుజువు చేసు కున్నాడు ఉండమ్మ బొట్టు పెడతలోమన సంస్కృతీ ని ప్రతిబింబించే సన్నీ వేషాలు అతనే తీసాడు అసిస్టెంట్ గానే నే .కృష్ణా జిల్లా మానికొండ లో ఆ సినిమా షూటింగ్ జరిగింది .కడియాల విష్ణు రావు గారు ఆ ఊరిలో ధన వంతులు సంస్కారి స్నేహ పాత్రుడు .సినిమా అంతా వాళ్ల పొలాల్లో నే జరిగింది .ఎంతో పంట నష్ట పోయారు . వల్ల అబ్బాయి తొమ్మిదో తరగతి చడువుందే వాడు ఆ వూరి హై స్కూల్ లో నేను అక్కడ సైన్సు మాస్టర్ గా పని చేస్తున్నాను .నా దగ్గర ప్రైవేటు కుడా చదివే వాడు .అతను మమ్మల్ని తీసుకొని వెళ్లి షూటింగ్ చూపించాడు అచ్తోర్లు అందరికి వూరి లోని ఇల్లాల్ల లోనే బస .కొద్దిమంది బేజ వాడ హోటల్ లో వుండే వారు ..దాదాపు నలభై రోజుల పైనే షూటింగ్ జరిగింది .విశ్వ నాద్ కాకి ప్యాంటు కాకి షర్టు  ఇంశిర్ట్ బెల్ట్ తో వుండే వాడు అప్పటికి ,ఇప్పటికి అదే ఆయన దర్శ కత్వ పు డ్రెస్ ..ధూళిపాల  ”రావమ్మ మా  లక్ష్మి రావమ్మా ”అని  సంక్రాంతి దాసరి వేషం లో పాడుతూంటే ఇళ్ళ దగ్గర ముత్యాల్లాంటి ముగ్గులు .బంగారు తల్లుల్లాంటి గొబ్బెమ్మల మధ్య సన్నివశాలు తీయటం నేను చూసాను .అప్పుడు ఆ వూళ్ళో ప్రతి ఇల్లు సంక్రాంతి శోభతో కళా కళా లాడేది ..పొలం లో ”బోర్ వేస్తె జలం భూమి నుంచి చిమ్ముకొని పైకి రావటం ,అప్పుడు పాడే పాట జమున కృష్ణ ల మీద చిత్రీక రించాడు విశ్వనాద్ .కృష్ణ సరిగ్గా నాటించ లేక పోయేవాడు .తకుల కేకులు తెగ తినేవాడు .ఆ రోజున జమున కోపం వచ్చి చెంప మీద కొట్టినంత పని చేసింది .వెంటనే మూడ్ వచ్చి గొప్పగా నటించి అందరి సహనానికి ఫుల్ స్టాప్ పెట్టాడు విశ్వ నాద్ చాలాప్రశంతం గా అరుపులు హదావిదిలేకుమ్డా చిత్రీకరణ చేసాడు .అదే మొదటి సారి అతన్ని చూడటం అయితె ఎందుకో తెలీదు కాని అతని శక్తీ యుక్తుల మీద నమ్మకం వుండేది నాకు .కాని ఇంత గొప్పగా ఎదిగి తెలుగు చిత్ర సీమను మలుపు తిప్పుతాడని అనుకోలేదు .మాణిక్యం మట్టి లో ఉన్నంత వరకే  బయటకు వస్తే దాని కాంతికి మనం అప్రతిభుల    m  avaalsinde  .
                                            జీవన జ్యోతి చిత్రం లో వాణిశ్రీ శోభన్ బాబుల చేత అద్భుత నటనను రాబట్టాడు అందులోని ప్రతి మాట ,పాట గుండె తలుపుల్ని తడుతాయి సన్నీ వేషాలతో గుండెను పిండి చేసే మహా గొప్ప చాతుర్యం వుంది విశ్వనాద్ కు .అలాగే అమ్మ మాట సినిమా లో (పేరు కర్రెక్టేనా )/?)సత్యనారాయణ జయంతి ల నటన ల తో మనల్ని మరో లోకం లోకి తీసుకు వెద తాడు .మాత్రుత్వపు మహోన్నత భావాన్ని చాలా ప్రతిభావంతం గా ఆవిష్కరించాడు .నేరము ,శిక్ష లో ఎంతో బాలన్సుడ్ గా emotions ను
కంట్రోల్ చేస్తాడు .ఆత్మ గౌరవం ను సరదాగా జలసాగా తీసి నవ్వులు పూయించాడు జగ్గయ్య రామ రావు ల స్నేహ ధర్మానికి గొప్ప నిర్వచనం చెప్పాడు దీనిలోదేవిక వుంది సినిమా పేరు ఆప్త మిత్రోలని జ్ఞాపకం .ఇలా వొక్కొక్క  సినిమాలో ఒక్కొక్క భావానికి తన దిన శైలి లో పట్టం కట్టాడు .
                     సిరి సిరి మువ్వ ,సీతా మహా లక్ష్మి లతో ఉత్తమ దర్శకుల జాబితాలో చేరాడు ఇక శంకారాభరణం చిత్రంలో  విశ్వ నాద్  కళా విశ్వ రూపం చూస్తాము సోమయాజులు మంజు భార్గవి పాత్రలను ఆరాధ్య మైన వాటిగా చూపటం లో సంగేత సాహిత్యాలని ఈ    తరానికి కళాత్మకం గా పరిహాయం చేయటం లో ఈ నాటి యువతను మన సంస్కృతీ సామ్ప్రదాయాలవైపు మళ్లించటం లోసిని మాధ్యమం యెంత చేయాలో అంత కంటే ఎక్కువ గా చేసిదిగ్దర్శనం   చేశాడు . ఉత్తమోత్తమ దర్శకుడని పించు కున్నాడు .కళామ తల్లికి బంగారు గొడుగు పట్టిన వాడనిపించుకున్నాడు .సప్త పడి చిత్రం లో శంకరాచార్య గారి అద్వైత సిద్ధాంతాన్ని కాలానుగుణ భాష్యం చెప్పి సహ బాష్ అని పించు కున్నాడు ఈ ధోరణి నచ్చని బాపు రమణలు రాదా కల్యాణం తీసి దీన్ని తిప్పి కొట్టారన్నది వేరే విషయం .స్వర్ణ కమలం లో భానుప్రియ లోని నట నాట్య ప్రతిభను కనుల విందుగా కమనీయం గా ఆవిష్కరించిన తీరుకు జోహార్లె .స్వాతి కిరణం లో ముమ్ముట్టి సహజ నటనకు నీరాజనం పట్టించాడు రాధికను  అమ్మ తనానికి ప్రతినిధి గా మలచిన తీరు అద్వితీయం .child progidy ని ఈర్చిన తీరు అతని నటనను వెలికి తీసిన విధానం ఈర్ష్య ఎంతపని చేయిస్తుందో చెప్పిన పధ్ధతి చిరస్మరణీయం .శ్రుతి లయలలోమన వారసత్వాన్ని యెంత బాగా జాగ్రత్తగా కాపాడుకోవాలో భవిష్యత్తరాలకు అందించాలో  ఎరుకపరచిన విధానం ఒక జగద్గురువు బోధించినంత ఉత్తమం గా వుంది .సుభలేఖ లో కట్నం సమస్యను అతి సున్నితంగా హాష్యం మేళవించి పరిష్కరించిన తీరు మెచ్చతగింది .సూత్ర దారులు చిత్రం లో నాగేశ్వర రావు ,సుజాతల నట నా చాతుర్యాన్ని సంగీత పరం గా ,పల్లె టొల్ల డోలు సన్నాయి  లకు పవిత్రతను కల్పించి ఆ వారసత్వాన్ని కాపాడుకోవాలనే తపన జనానికి కల్గించాడు .స్వాతి ముత్యం లో వివాహానికి కొత్త అర్ధం ,మాటలతో కాదు చేతలతో ఆదుకోవాలని స్వాతి ముత్యం లాంటి పాత్రకు జీవం పోయించాడు కమల్ హసన్ తో రాధిక  పాత్ర చిత్రణ భేష్ ..
                    బాలు తీసిన శుభ సంకల్పం లో తెలివి తేటలకు చదువు అక్కర్లేదని నిరూపించాడు .ఆపద్బాన్ధవులు  లో స్వయం కృషి లో చిరంజీవి గ్లామర్ను దేగ్లమౌర్ చేసి అతని లోని సహజ నటనను వెలికి తీసాడు జంధ్యాల తో నటింప జేసి చ్నత  చిరంజీవిని చేసాడు .శుభోదయం లో సోమరి తనం యెంత అనర్ధ దాయకమో నిరూపించాడు యే చిత్రం లో నైన విలువలకు పట్టం గటతడే కాని విలువల వలువల  ఊడ దీయ లేదు .రోజా రమణి దేవదాస్ కనకాలతో తీసిన.మరోసీత కధ  లో  దంపత్యానికి వున్న విలువ ఏమిటో చూపి మనల్ని దేవదాసుని కంగు తినిపించాడు .రోజా రమణి లోనినటనను  చాల . హుందాగా అద్భుతంగా ప్రదర్శింప చేశాడు .ఇలా ఏ సిన్మా తీసినా తన ముద్రను వేసాడు భారతీయ ఆత్మను సంస్కారాన్ని సంస్కృతిని కాపాడే వే తీసాడు తీసి రాష్ట్ర ,దేశ పరువును కాపాడటం కాకుండా మన సాంస్కృతిక ఔన్నత్యాన్ని  ప్రపంచం నలుమూలలకు వ్యాపింపజేసిన మహనీయ దర్శకుడు విశ్వ నాథ్
            విస్వనాద్ కు ఇవన్నీ ఎలా సాధ్యం అయాయి? అతను రచయితల్ని ఎంచుకొని వారి పాటవాన్ని గ్రహించి పనిచేయిన్చుకుంటాడు .పాటలు రాయటానికి వేటూరి మాటలకు జంధ్యాల గొప్ప సహకారం అందించారు సంగీతానికి మహా దేవన్  ఇలయ రాజాలు లయ స్వర  రాగాలతో రాగ రంజితం చేసారు .అన్ని పాటలు ఆణిముత్యాలేచిరస్మరానా బాణీలే .అదొక స్వర సాగర సంగమం అన్నట్లు విశ్వ నాధుని సాగర సంగమం ,సిరి వెన్నెల ను మరిచి పొతే చరిత్ర క్షమించదు . ఇన్ని సినిమాల్లో నాకు బాగా నచ్చి పరవశింప జేసింది మాత్రం సిరివెన్నెలే   పాటలు ,మాటలు భావాలు హృదయ ఆవిష్కరణలు ,సంస్కారం నన్ను పరవశింప జేసాయి .వుయ్యూరు లో ఆ సినిమా మూడు రోజులే ఆడింది రెండు రోజులు వరుసగా చూసాను ..
                    విశ్వ నాద్ సినిమా లో హాష్యం వింత పోకడలు పోతుంది సున్నితమైన సుతిమెత్తని సందర్భోచిత హాష్యం చిప్పిల జేస్తాడు మొరటు రెండర్దాలుండవు .అమాయకత్వం తో శుచిగా శుభ్రం గా వుంటుంది .చంద్ర మోహన్ సాక్షి రంగా రావు  శుభ లేఖ సుధాకర్ తులసి ఆయన సినిమాలలో హాస్యంతో జీవించి తరించారు నటీ నటుల ఎన్నిక విశ్వనాద్ ప్రత్యెక ద్రుష్టి .తో చేయటం గొప్ప గా వుంటుంది .అరుపులు రాద్ధాంతాలు నరాలు తెగే ఉత్కంత వుండవు ప్రేక్షకులను క్రమం గా elivate  చేయటం విశ్వ నాద్ ప్రత్యేకత .ఆ వున్నత స్థితి నుంచి కిందికి దిగ టానికి ఇష్టం వుండదింక .వీటి నన్నిటిని మించి విస్వనాద్ చిత్రాలలో ఆర్ద్రత నిండి వుంటుంది .ప్రతి సన్నివేశంఆ అనుభూతి బ్రహ్మానంద సహోదరం గా వుంటుంది  రసాత్మకం గా వుంటుంది  ఆనందంతో పరవశం కల్గుతుంది  తాదాత్మ్య స్థితి లో వుంటాం.ఆ ఆనందం బ్రహ్మానంద సహోదరం గా వుంటుంది ఇదొక్కటే విశ్వనా ద  ను మిగిలిన darsakulanunchi వేరు చేసే అతి గొప్ప అనన్య సాధ్య మైన గుణం .భారతీయ ఆత్మను అన్ని కోణాల్లోనూ దర్శింప జేసిన దర్శక విశ్వ నాధుడు .నటింప జేయటం కాదు స్వయం గా నటించీ పాత్రలకు సార్ధకత చేకుర్చటం మరీప్రసంసించ దగిన విషయం .
 విస్వనాద్ బృండంశంకరాభారణ విజయోత్చ  వాలు చుదతానికిప్రతి ధియేటర్ కు వచ్చారు వుయ్యూరు సాయి మహల్లో ప్రదర్సన చూడ తానికివచ్చినపుడు  సోమయాజులు విశ్వనాద్ లకు shake హ్యాండ్ ఇచ్చిసినిమా బాగుందని చెబితే ఇద్దరు సంతోషించారు ఇది రెండవ సారి చూడటం  ఇంకముడవ సారి కృష్ణ జిల్లా పెదకల్లె పాలి లో వేటూరి గారింటిలో ఆయన్ను బాలును సబితను  దేవదాస్ దంపతుల్ని చూసా .శంకరాభరణం మీద నేను రాసిన notes స్వనాద్  వున్న డైరీ ని చూపివ్స్తే చదివి సంతోషం తో vi స్వనాద్ సంతకం చేసారు
  విశ్వనాద్ ,బాలు మా కుటుంబ  స్నేహితులు సీతం రాజు వెంకట రావు మల్లి  .తరచు కలుస్తారు వాళ్ళంతా kaambalaku దగ్గర బంధువులు తరచూ కలుస్తారు వాళ్ళంతా బాలుని కలిసినపుడు మేముమల్లి కంబ గారి స్నేహితులం అని చెప్తాం ;.
 ఇదీ కలా స్రష్ట విశ్వ నాధుని కీర్తి హారం లో ఒక చిన్న పువ్వు .
                    అమెరికా లో కాలిఫోర్నియా లో ఉంటున్న  మా మేనల్లుడు jay  వేలూరి నన్ను విశ్వనాద్ గురించి రాయమని అడిగితె ఇంతరాయాల్సి వచ్చింది .
                                                                  మీ 
                                                             దుర్గాప్రసాద్
Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు. Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.