డాల్ఫిన్లు మన కజిన్లు
ఇదేదో ప్రాస కోసం అన్న మాట కాదు .అవి మనకూ చాలా కాలం కిందటి బంధువులు ఇప్పుడు సంబంధాలు తెగినాయి తరాలు విడి పోయినట్లు .అవి మనము క్షీరజాలే అన్న సంగతి మర్చిపోవద్దు .మనం పిల్లల్ని అల్లారు ముద్దు గా పెంచుతాం ;మనకూ జుట్టు వుంది పెద్ద సైజు లో మెదడు వుంది .సంక్లిష్ట సమాజ జీవనం మనది .డాల్ఫిన్లు సముద్ర సామ్రాజ్యం లో విహరిస్తాయి కాంతి చూపు తో కాక వినికిడి శక్తి తో అవి విషయాలను గ్రహిస్తాయి .భూమ్యాకర్షణ శక్తి కంటే తేలడం వల్ల వాటి శరీరం పనిచేస్తుంది .వాటికి వెడల్పైన బాహువులు ఈద టానికి బాగా సహక రిస్తాయి .అవి విజిల్స్ చప్పుడు లతో సంభాషించు కుంటాయి .ఎంతో హుందాగా అందం గా వుండి ఆకర్షిస్తాయి శ రీరనిర్మాన్ చాలా శోభస్కరం గా వుంటుంది .
గ్రీకు సంస్కృతికి దాల్ఫిన్స్ కు గొప్ప సంబంధం వుంది .గ్రీకుల సుర్యాదేవుడిని అపోలో అంటారు .ఒక సారి ఒక శకునం లేక ఆరకిల్ ప్రకారం అపోలో దేవత డాల్ఫిన్ రూపం ధరించాడట. దీని వల్ల ఆర్యన్ ను డాల్ఫిన్ తన బ్భూజాల మీద కూర్చో పెట్టుకొని ఆకాశానికి తీసుకు వెళ్ళాడట .ఇంకో కధ ప్రకారం గ్రీకు దేవత దయానిసాస్ ఆంటే సారాయికి అది దేవత ఒక వోడలో ఇకారియ ద్వీపం నుంచి నక్సా కు ప్రయాణ మైందట ఒక వోడలో . ఆ వొడను నడిపే నావికులంతా సముద్ర దొంగలెనటా ప్రయానీకుల్ని బందీ చేసిబానిసలు గా అమ్మాలనే రహస్య ఆలోచన చేసారట .దయానాస్ దేవత ఈ రహస్యాన్ని కని పెట్టింది .తనకున్న శక్తులతో వొడ తెరచాపను మొక్క శాఖలు గా తెడ్లను పాములుగా ఒక పిల్లన గ్రోవి గా మార్చిందట దీన్ని భరించలేక పైరట్లు ఆంటే సముద్ర దొంగలు సముద్రం లోకి దూకేసారట .అక్కడ సముద్ర దేవత poseidon వాళ్ళను డాల్ఫిన్లు గా మార్చి మానవులకు సేవ చేయమని ఆజ్ఞా పించిందట .
ఒక వందేళ్ళ తర్వాత రోమన్ తత్వ వేత్త ప్లినీ అనే మేధావి ఇంకో కధ చెప్పాడు మన కజిన్ల గురించి .ఆయన్ను ప్లినీ ది ఎల్దర్ అని కుడా అంటారు .కధ వినండి .మధ్యధరా సముద్రం ఒడ్డున ఒక రైతు బిడ్డ వుండే వాడట .అక్కడ ఒకే ఒక డాల్ఫిన్ వుంది దాని పేరు సిమో .వీళ్ళిద్దరూ చాలా స్నేహం గా వుండే వారు .అతన్ని ఆ డాల్ఫిన్ రోజూ తన వీపు మీద కూర్చో పెట్టుకొని ఇంటినుంచి స్కూల్ కు అక్కడ్నించి ఇంటికి చాలా జాగ్రత్త గా తీసుకొని వేల్తుందేదట .ఒక సారి అకస్మాత్తు గా ఆ అబ్బాయికి జబ్బు చేసి చనిపోయాడట .పాపం ఆ డాల్ఫిన్ స్నేహితుడు విచారం గా సముద్రం తీరానికి వచ్చి స్నేహితుడు కనిపించక పోవటం తో నిరాశగా తిరిగి వెళ్లి పోతూండేది .చివరికి ఆ డాల్ఫిన్ కూడా దిగులుతో చనిపోయిందట .ఈ విధం గా దాల్ఫిన్లకు ,పిల్లలకు స్నేహం ఉండేదని చెప్పాడు ప్లినీ .ఈ రక మైన కధలు చాలానే ప్రచారం లో వున్నాయి .
డాల్ఫిన్లు మనుష్యలు వాటిని తాక టానికి అంగీక రించవు .whales ,ను గురించి డాల్ఫిన్ల గురించి పరిశోధన చేసే వాళ్ళను cetologists అంటారు .వీటి వీపు పైన వున్న మొప్పలు ఆంటే ఫిన్స్ వాటి మీద వుండే మచ్చలు గీతలు వల్ల వస్తువుల్ని అద్భుతం గా గుర్తించే నేర్పు వుంది .అది వాటికి వరం .ఒక్కో సారి వాటికి తిక్క రేగుతుంది చాల వింతగా ఊహించని విధం గా ప్రవర్తిస్తాయి .కనుక మన లానే వాటికీ మూడ్స్ వున్న్తాయన్న మాట .మూడ్ ను తెలుసు కోకుండా మనం ప్రవర్తిస్తే మనకు మూడిందే .మెదడు పనిచేయటం లో మానవుల తర్వాతి స్థానం దాల్ఫిన్లదీ apes దీ అని గుర్తిన్చ్చారు శాస్త్ర వేత్తలు .apes సంగతి ప్రస్తావనకు వచ్చింది కనుక ఇంకో సారి apes
కదా కమామీషు తెలుసు కుందాం
మీ
దుర్గా ప్రసాద్

