చిట్టి కవితల చిట్టా
01 – భారత చరితం
వినరా భారత వీర కుమారా
వీరుల చరితంబు
వీరులు ,పాటు ధీరులు
ధీమంతులు మరి శ్రీమంతులును
కవి పండిత ఉద్దండులు
నీతి శాస్త్ర కోవిదులు
భారత దేశమందు
ఉదయించి నారు –వెలుగొంది నారు .—వినరా భారత
చాణక్యుడు చాక చక్యముతో
మగదేస్వరులగు నవ నందులను
అనగా ద్రొక్కే -ఆర్పే తన కోపాగ్ని
చంద్ర గుప్తుని రాజాది రాజుగా
చేసే నా బ్రహ్మ తేజంబు . — వినరా భారత
పరాక్రమంతో పరిపాలించే నశోకుడు
పరువెట్టిరి శాత్రవ వీరులు
విసుగేట్టేను కదన రంగము
మొలకేత్తెను ఆహిమ్సామ్కురము
ప్రబోధించే బుద్ధ సూక్తులు c
ప్రచారించే పాలు తావులందు —–వినర భారత 28 -05 -1957
02 – ఆంద్ర నందనం
పవిత్రదేశం -ఆంద్ర దేశం
పవిత్ర స్థలాలు పలు తావులు
విజయ నగరపు విజయ పతాక
కాకతి యుగపు కరాల కాళి
రెడ్డి రాజుల శిల్ప సంపద
వెలుగొందిన వేల్గారిన దేశం
వాగను శాసనుడు ,యోగి వేమన
పెద్దన తిక్కన ఆంద్ర భోజుడు
పెంచిన కవితా నందనారామం
విస్తరించిన విజయ భూమిరా
15 -12 -1957
03 – వక్కా పోచక్కా
వక్కా పోచక్కా
వొక్క పూట నీవు లేక
గడువదు భోజనానంతరం
వక్కా నిన్ను ముక్కలు చేసి
ఏలక్కులు లవంగాలు
మున్నగు సుగంధ ద్రవ్యాల పోపువేసి
పట్క్కు పటుక్కు మని నమలనిచో
మాకేదీ నాగరకత?
ఒక్క క్షణం నీవు లేక పాట రాదు గాయకునికి
ఒక్క క్షణం నీవు లేక పాఠం మాను పంతులు
ఒక్క పూట నీవు లేక గడువదు నవ దాంపత్యం
వక్కా నీవే దిక్కు
తక్కిన వారంతా నీ తర్వాతే
క్షణం కూడా మమ్ము విడువకుండా
కాచి రక్షించు మమ్మ -నిను విడువ మమ్మ
శ్రీదేవిని ఉదరమందున శేష శయ్య స్వామి
అర్ధ భాగ మందు అంబను ఆది శంకరుడు
నాల్క పైన వాణిని నలువ
తాల్చి నట్లు మేము నిన్నేల్లప్పుడు
బుగ్గ కింద దాతుమమ్మ
కావవమ్మా వక్కా పోచక్కా 01 -02 -1963
మీ
దుర్గా ప్రసాద్

