నిత్య పరిశోధకుడు ఆరుద్ర
తెలుగు సాహిత్యానికి సామాజిక నేపధ్యం లో సాహిత్య చరిత్ర రాసిన ఘనాఘనుడు ఆరుద్ర .సప్త సాహితీ సముద్రాలను తానొక్కడే అవలీలగా ఈది ఒడ్డుకు చేరిన వాడు .సామాన్యుడు సైతం చక్కగా ,కధలా చదూకోనేట్లు ”సమగ్రాంధ్ర సాహిత్యం ”సృష్టించిన బహుముఖ బ్రహ్మ .అనితర సాధ్యమైన దాన్ని తాను చేసి చూపాడు .మొదటి సారిగా పడి సంపుటాలు తెచ్చాడు ..ఆ త్తర్వాత రెఫెరెన్సు కోసం పది సంవత్చారాలు పరిశోధన చేసి ఇంగ్లాండ్ ,అమెరికా లైబ్రరీ లలో వున్న సమస్త విషయాలను సేకరించి మిగిలిన మూడు భాగాలు ప్రచురించాడు .కవి కాలమ్ పై చర్చలు ,కులం పై రాద్దాన్తాల అరణ్యం లో ,కొండల్లో చీకటి కోణం లో చిక్కుకున్న సాహితీ చరిత్ర అనే దివ్య గంగను భూమార్గం పట్టించి ,జనసామాన్యం కోసం జాతి తరించటం కోసం కృషి చేసిన ”సాహితీ భగీరధుడు ”ఆరుద్ర .పది universiteelu ,వెయ్యి అకాడెమీలు చేయలేని పనిని ఒంటరిగా ఆరుద్ర చేసిజాతికి అంకితమిచ్చి ధన్యుడైనాడు .తన ఆరోగ్య సర్వస్వాన్ని కోల్పోయాడు .
. ”ప్రపంచ వాజ్న్=మయాన్ని ప్రజాపరం చేసి ,ప్రస్తాన భేరి మోగించి ,బావుటా ఎగుర వేసిన ప్రజా కవి ఆరుద్ర ”అన్న మాట సత్యం యుగావిభజన చేయటం లో ఆరుద్ర కొత్త మార్గం తొక్కాడు .పోషకులను ఆధారం గా చేసుకొని యుగావిభజన చేసి తన marxeeya దృక్పధాన్ని నిల బెట్టుకున్నాడు .కవి ,పండితుడు ,విమర్శకుడు ,శాసన భాషావిష్కారుడు అన్నీ తానె కనుక సాహిత్య చరిత్ర అంత గొప్ప గా వచ్చింది .అందుకే సాహిత్య పండితుల్లో ఆరుద్ర అగ్రేసరుడు .”చుళికీ కృత సర్వ పాదోది పయస్కుడైన ముని ”అని నన్నయ గారు అగస్త్య మహర్షిని సంభావించారు .అలాగే బవిరి గడ్డం తో ,కాషాయ వస్త్రాల తో వున్న ఆరుద్ర నిజం గానే” సాహితీ ఆగస్తి యార్ ”. ,
నిరంతర పరిశీలనా వ్యసనుడు
తొమ్మిదవ ఆశియా క్రీడల సందర్భం గా పోస్టల్ శాఖ వారు ”మాత్య యంత్రాన్ని కొట్టే శ్రీ కృష్ణుని” చిత్రాన్ని స్టాంప్ గా వేశారు .దాన్ని చూసి చాలా మంది ఆక్షేపించారు .అయితె ఆరుద్ర ప్రాచీన తెలుగు కావ్యాలలో ఒక దాని నుంచి కృష్ణుడు మాత్య యంత్రాన్ని కొట్టే ఘట్టాన్ని వుదహరించి సమర్ధించాడు .
” శ్రీ కృష్ణుడు అసలు సిసలు ఆంధ్రుడు ”అని కూడా వివరించాడు
ఏకలవ్యుడు కుంతీ దేవి అక్క కొడకు అని సంస్కృత హరివంశం ఆధారంగా తెలిపాడు .
కుమార్తె కు పుత్రిక కు భేదం వుందని”మనుధర్మ శాస్త్రం ”ఆధారం గా వివరించాడు .కుమార్తె ఆంటే తోడబుట్టిన అన్నదమ్ములు కల అమ్మాయి .పుత్రిక ఆంటే సహోదరులు లేనిది ..ఈమెకు పుత్రుని అధికారాలన్నీ దక్కు తాయి .
” సీత రామునికి ఏమవుతుంది ?”అనే వ్యాసం లో వివిధ దేశాల లోని రామాయణాలను సాకల్యం గా పరిశీలించి వివరించాడు .
” వేమన్న ” పై పరిశోధన చేసి ”వేమన్న వేదం ”అనే అభినవ వేదం రాసాడు /.
” గురజాడ ”పై అంతులేని అభిమానం తో ”గురజాడ గురు పీఠం ”రాసి ఆయనకు మహోన్నత పీఠం కల్పించాడు . ‘
తెలుగు వాళ్ళు చేసుకొనే ప్రతి పండుగ వెనుక వున్న ప్రతి ఆచారం వెనకా వున్న పరమార్ధాన్ని తెలియ జేసిన sixth sense వున్న ఆరో రుద్రుడు ఆరుద్ర . చరిత్ర ,విజ్ఞానం ,దర్శనాలు ,నాట్య శాస్త్రం ,సంగీతం ,చదరంగం ,ఇంద్రజాలం మొదలయిన వాటన్నిటి పై సాధికారం గా రచనలు చేసిన సాహితీ విరాన్మూర్తి ఆరుద్ర .అయితే ప్రతి రచనను ” marxist దృక్పధం ”అనే గీటురాయి పై పరీక్షించాడు నిబద్ధత గల గొప్ప రచయిత అనిపించు కొన్నాడు ఆరుద్ర .
నామో రుద్రాయ ఆరుద్రాయ అని నమస్కరిస్తూ ప్రస్తు తానికి సెలవ్
మీ
గబ్బిట దుర్గా ప్రసాద్

