ఆరుద్రాభిషేకం
ఒకసారి ఆరుద్రకు ఘన సన్మానం జరుగు తోంది వేదిక మీద విశ్వనాధ సత్యనారాయణ గారు వున్నారు ,ఆ ముచ్చట చూసి ”సాధారణం గా శివుడికి రుద్రాభిషేకం చేస్తారు .ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నది ”ఆరుద్రాభిషేకం ”అని అందరి హర్ష ధ్వానాల మధ్య ప్రకటించారట .
ఇంతకీ ఆరుద్ర ఆంటే ఎవరు? ఆరుద్ర ఆంటే ”సిల్కు పురుగు ”.అందులోని సిల్కు దనం ఆరుద్ర రచనల్లో మిల మిల మెరుస్తుంది .ఆరుద్ర ఒక నక్షత్రం పేరు కూడా .దాని తళుకు మినుకు ,కులుకు ,నైశిత్యం అతని రచనలలో ప్రతిఫలిస్తాయి .లక్ష రూపాయల విలువ చేసే తన స్వంత గ్రంధాలయాన్ని ”సుందరయ్య విజ్ఞాన భవన్ ” కు అర్పించి తన కంటూ ఏమీ మిగుల్చు కోని వితరణ శీలి ,త్యాగి ఆరుద్ర .
లబ్ధ ప్రతిష్టులైన ఎంతో మంది ఆరుద్రను మనసార అభినందించారు .ఆ అక్షరాభినందన అభిషేక వైభవాన్ని చూద్దాం ”ఛందస్సు చేత ఇంత వెట్టి చాకిరీ చేయించు కున్న ఆధునిక కవి ఆరుద్ర కంటే ఎవరూ లేరు ”. ”ఆరుద్ర ఒక చైతన్య కిరణం ”.
”సాహిత్య రుషీ —నీ కలం పేరు కృషి —నీ బలం పేరు కుషీ జోహార్ —–వ్యాసానందా ,– వాక్యాక్షర శబ్ద భావ విన్యాసానందా ప్రసానందా’ అంత్య ప్రసానందా జోహార్ ”వెయ్యేళ్ళు నీ ఎకాడెమీ -నడిపించు సుమీ ” అని బాపు ,రమణ తమ ప్రియ మిత్రుని కీర్తించారు .
”ఆస్తి ఆంటే భువనాలు ,జాగీర్లు ,ఫ్యాక్టరీలు బ్లాకు మనీ ,గిద్డంగులూ ,కాదు కనుక తెలుగు వాడి ఆస్తి ,భాగవతుల శంకర శాస్త్రి ”అంటూపొగడ్తల బొగడ పూల దండ వేశాడు పురాణం సుబ్రహ్మణ్య శర్మ
”ఆధునిక కవిత్వం పై ఆరుద్ర ముద్ర చిరస్థాయి ”అని చెరిగి పోని ముద్ర వేశారింకొకరు .
”వంద ఎకాడెమీ లకు మారు పేరు –నడుస్తున్న ఎన్సైక్లో పీడియ ఆరుద్ర ”అన్నారు ఆయన సాహితీ కృషి చూసి ఇంకొకరు పొంగి పోయి
”ఆంద్ర సాహిత్యం లో ఆరుద్ర చిరంజీవి ”అని అతని సాహిత్యము ,అతను అమరం అనే భావం తో వేరొకరు
”పద్యం ,గేయం ,పాట అన్నీ సమాన ప్రతిభ తో వ్రాసిన శిల్పి ”అనీ ”స్నేహ శీలి ,చమత్కారి స్వంత వ్యక్తిత్వం వున్న మహా మనీషి ”అని శ్లాఘించిన వారున్నారు .
‘ఆకాశం వున్నాన్నాళ్ళు ,ఆరుద్ర నక్షత్రం వుంటుంది .ఈ కాలమ్ వున్నన్నాళ్ళు ఆరుద్ర సంతకం అలానే వుంటుంది ” అన్నాడు సిరి వెన్నెల సీతా రామ శాస్త్రి చంద్రుని వెన్నెల వుమ్దేంత కాలము ఇది సత్యం
”ఆరుద్రకు ఆంద్ర లోకమే రుణ పడి వుంటుంది ”అనికితాబు ఒకరిస్తే ”ఒకే ఒకడు ఆరుద్ర ”అన్నది ఆంద్ర ప్రభ అతని సాహితీ ప్రభకు జీజీ లు పలుకుతూ .
” versatile writer ” /’.అని పొంగిపోయారు ఇంకో అభి మాని .
”ఒక శ్రీ శ్రీ ,ఒక రావి శాస్త్రి ,ఒక విశ్వ నాద లా ఒక ఆరుద్ర ఒకే ఒక ఆరుద్ర ..”అని బేరీజు వేసిన విశ్లేషకులు ఇంకొకరు .
”సాహితీ రంగం లో అందరు చేసిన వన్నీ ఆరుద్ర చేశాడు .కానీ ఆరుద్ర చేసినవన్నీ అందరూ చేయ లేదు ”అని అతని సాహితీ విశ్వ రూపాన్ని ఒక్క వాక్యం లో తేల్చి చెప్పారు మరో విశ్లేషకుడు
”కవిత లోన వేయిటు ,పరిశోధనకు లైటు –అన్నిటా హైలైటు వో కూనలమ్మా ”అని గ్రేట్ గా గుర్తించారు ఆచార్య యెన్ .గోపి .ఇది నిజం గా చాలా వెయిటే .’
”ఒకే కాలమ్ లో గుండెలో కవిత్వాన్నీ ,గొంతు లో పాటనీ ,మస్తిష్కం లో పరిశోధనా పండించు కుంటూ ,ఆసాంతం జీవించిన ”సాహితీ త్రిమూర్తి స్వరూపం ‘ఆరుద్ర ”అన్న మాట కోట్లకుదీటైన మాట ..
ఇన్ని రూపాలుగా విస్తరించిన ఆరుద్ర బహుముఖ వ్యక్తిత్వం ,సహస్ర ధార కల ఇంద్రుని వజ్రాయుధమే .అందుకే ఆయన్ను ”ఆరు రుద్రులు ”ఆంటే అదిచాలా చిన్న మాటే అవుతుంది .”ఏకాదశ రుద్రులు ”అన్నా చాలదు . శైవ ఆగమం లో ”శత రుద్రీయం ”వుంది ‘అదీ సరిపోదని నాకు తోచింది .కనుక నేను ”శత మహా రుద్ర -ఆరుద్ర ”అని ఆ మహా మనీషికి, ఆ శేముషికి నమస్కరిస్తాను వినమ్రం గా .
” ఎదగ డాని కెందుకురా తొందర ”అని హెచ్చరించిన ఆరుద్ర తన చుట్టూ మరుగుజ్జు భావాదిపతున్న కాలమ్ లో అందరి కంటే తొందర పడి బాగా ఎదిగి పోయి ,దుర్నిరీక్షుదు అయినాడు .ఆ శ్రమ లో అలసట లో ,బడలికతో ,ఆరోగ్యం కోల్పోయి ,శాశ్వతం గా చదువుల తల్లి సరశ్వతి ఒడిలో ఒదిగి చంటి పిల్లాడిలా నిదుర పోయాడు .ప్రభుత్వం పట్టించు కొక పోయినా ,అభిమానులు లక్షలు పోగు చేసి కిడ్నీ చికిత్చ చేయించి రుణాని తీర్చుకున్నారు .ఆ నిరంతర పరిశీలన పరిశోధనా వర్తికి ,సాహితీ విశ్వరూపునికి ఇదే నా అక్షర నివాళి ..
మహారచయిత, కవి ఆరుద్ర పై ఇది చివరి వ్యాసం ”
06 -09 -98 న ఉయ్యూరు సాహితీ మండలి లో ఆరుద్ర మరణం తర్వాత నేను ”[ఆరుద్ర శత మహా రుద్ర ” అన్న పేరు తో చేసిన అక్షరాభి షేకమే ఈ వ్యాస పరంపర .
మీ
గబ్బిట దుర్గా ప్రసాద్
05 -06 -2011
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

