రెండు మహోన్నత శిఖరాలు
———————————
ఒక రోజు తేడా తో ఇద్దరు మహోన్నతులు అస్తమించారు .ఒకరు కళా ప్రపూర్ణ ,పద్మశ్రీ నటరాజ రామ కృష్ణ అయితే రెండవ వారు పద్మ విభూషణ్ పురస్కార గ్గ్రహీత ప్రఖ్యాత చిత్ర కారులు ఏం .ఎఫ్ .హుస్సేన్ .మొదటి వారు మన రాష్ట్రానికీ ,రెండవ వ్వారు ,మహారాష్ట్రానికి చెందిన వారు ఇద్దరు జీవిత సర్వస్వం తమ కళకు అంకితం చేసి ధన్య జీవులైన వారే .నటరాజు తాను సంపాదించినదంతా కళ కోసమే ఖర్చు చేసి తనకంటూ ఇల్లు కూడా మిగుల్చు కొకండా అచ్చమైన భారతీయ ధర్మానికి ప్రతీక గా నిలిచారు .హుసేన్జీ చిత్ర కళ లోని వివిధ అంగాలను స్పృశించి తనదైన శైలిలో పరిపుష్టి చేసి ,కోట్లు ఖరీదు చేసే చిత్రాలు గీసి ,సంపాదన అంతుచూసి ,ఈ దేశం పై ప్రేమాభి మానాలు వున్నా ఇక్కడి వారి మనోభావాలను కించ పరిచారనే ఆరోపణ కు ఖిన్నుడై లండన్ చేరి ,ప్రవాసి గానే వుండి పోయారు .మొదటి వారు భారతీయ ధర్మానికి ,రెండవ వారు అంతర్జాతీయ విదానాన్కి ప్రతి బింబాలు ..ఇద్దరు సృజన తో ఉన్నత శిఖా రాలు చేరు కొన్న వారే. వారి మరణం కళామ తల్లికి గర్భ శోకమే .అభిమానులకు అనంత శోకమే .
రామ కృష్ణ గారికి చిన్నాప్పుడే తలి దండ్రులు చనిపోతే రామ కృష్ణ ఆశ్రమం లో పెరిగారు .వారి పుట్టుక ఇండొనీషియా లోని బాలి ద్వీపం .18 వ ఏటనే ప్రఖ్యాత నాట్యా చార్యులయారు నటరాజ ”బిరుదు పొందారు ,అదే ఆ తర్వాత ఆయన ఇంటి పేరు అయింది దేవదాసీ నాట్యానికి స్థాయి కల్పించిన సంస్కారి .దాన్ని శాస్త్రీయ నాట్యం గా మలిచారు .పది వేల ప్రదర్శనలిచ్చి వేలాది మందికి శిక్షణ నిచ్చారు .విద్యార్ధులకు అన్నీ తానే అయి ,ఖర్చు అంతా భరించి నాట్యం నేర్పారు .ఆయన దశ భాషా పండితుడని చాలా మందికి తెలియదు .నిగర్వి .తన పని తాను చేసుకు పోయేవారు అవసరమైతే . ప్రభ్హుత్వం పై వత్తిడి తెచ్చి కళకు న్యాయం చేసే వారు .ఆయన నల్లభై రెండు ప్పుస్తకాలను నాట్య శాస్త్రం పై రాశారు .వాటిపై దాదాపు పది మంది పరిశోధనలు చేయటం విశేషం .తన అనుభవాలను ‘[‘అర్ధ శతాబ్ది ఆంద్ర నాట్యం ”లో వివరించారు .ఇది వారి జీవిత చరిత్రే ..జీవితాంతం వివాహం చేసు కోకుండా ,ఆంద్ర నాట్య కళకే అన్కితమయారు .
తెలుగు వారి అసలు నాట్యం మూలాలను వెదికి ,ఆంద్ర నాట్యం పేరున దాన్ని నేర్చి నేర్పించి వ్యాప్తి చేసిన మహానుభావుడు నటరాజు .కాక తీయుల నాటి పేరిణి శివ తాండవం కు పరిపుష్టి కల్గించి రామప్ప దేవాలయం లో ప్రదర్శనలు ఇచ్చారు ..ఆయన సృష్టించిన ”నవ జనార్దన పారిజాతం ..”ప్రముఖ నగరాలన్నిట ప్రదర్శించారు ..ఆయనకు ”నటరాజ ”బిరుదును బందార సంస్థాన రాజు గణపతి పాండ్య గారు పద్దెనిమిదవ ఏట ప్రదానం చేశారు ..ఆయన కు భారత కలా ప్రపూర్ణ బిరుదుంది .దక్షిణ భారత ఉత్తమ నాత్యాచార్యుని గా మంచి గుర్తింపు పొందారు .ఆయన శ్రీశైలం దేవస్థాన నాట్యాచార్యులైనారు .ఆంద్రప్రభ్త్వం ఆస్థాన నాట్యా చార్యునిగా నియమించింది(1980 ) ప్రఖ్యాత రాజ్య లక్ష్మి ఫౌండేషన్ పురస్కారం పొందారు .నిబద్ధత ,నిమగ్నత గల నాట్యా చార్యులు రామ కృష్ణ అని చుక్కా రామయ్య ,జితేంద్ర బాబు వంటి వుద్దండులన్నమాట నూటికి నూరు పాళ్ళు సత్యం .కళను కాసులకు అమ్ముకోలేదు .అదొక తపస్సు గ భావించి జీవించిన” ”నృత్య తపస్వి ”నాట్యాన్ని ఉద్యమం గా నడిపిన కారణ జన్ముడు .”శ్రీ వెంకటేశ్వర కల్యాణం ”,కుమార సంభవం ,,మేఘసందేశం నృత్య రూపకాలను ఆయన రూపొందించి ప్రదర్శనలు ఇచ్చారు .”నవ జనార్దన పారిజాతం ”నృత్యాన్ని ,తొమ్మిది రాత్రులు ,తొమ్మిదిమంది నర్తకులు ,తొమ్మిది మంది నర్తాకీమనులతో ,తొమ్మిది వాయిద్యాలతో ప్రదర్శించిన ఘనత నట రాజు ది ..ఆయన శిష్యులలో ప్రధముడు కలా కృష్ణ ఆయన్ను జీవితాంతం వెంట వున్నారు .ఇద్దరు కళకు అన్కితమయారు ..త్యాగమయ జీవితం ఆయనది ఎందరినో ప్రభావితం చేసి ,నాట్యకళ జ్యోతి లా మిగిలి పోయారు నిండు జీవితం అనుభవించి పండు గా రాలి పోయారు విదేశ మైన ఇండోనేషియా లో జన్మించి ,భారత దేశం చేరి ఆంద్ర నాట్యానికి జీవం పోసి ,నిలబెట్టి ,మన సంస్కృతీ వైభవాన్ని పవిత్రం గా భావించి ఈ నేలలో కలిసి పోయిన మరో” నాట్య భరతుడు ‘నట రాజ రామ కృష్ణ .
అంతర్జాతీయ చిత్రకలాకారుడిగా హుస్సేన్ జీ పేరు ప్రపంచం అంతా మారు మోగింది .ఆధునిక పికాసో అని అంటారు .95 ఏళ్ళ వయసు లో తనువు చాలించారు .ఆయన ఎప్పుడు వివాదాల సుడి గుండం లో చిక్కుకొనే వాడు .900 కేసులు ఆయనపై వున్నాయి .స్థిర చిత్తం తక్కువ వైవిధ్యం కోసం ఆరాటం .హిందూ దేవతామూర్తులను నగ్నం గా చిత్రిన్చారనే ఆరోపణ తో పెద్ద దుమారం రేగి భారత్ నుంచి ఇంగ్లాండ్ వెళ్లి పోయారు .ఆధునిక కళా జగత్తుకు ఊపిరి ఆయన అంటారు .గజగామిని అనే సినిమాను తన ఆరాధ్య దేవత, ప్రేరణ అయిన మాధురీ దీక్షిత్ ను heroyin గా పెట్టి తీసాడు .తర్వాత ఆయన మనసు మీనాక్షి ,ఊర్మిలా వగైరాలపై మల్లిందట .నిలకడ లేని మనసు తో వుండటం .ఆయనకు మైనస్ పాయింట్ .ఎంత గొప్ప కళా కారుడైనా బుద్ధి వక్రిస్తే ఇలాగే బాధలు పడాల్సి వస్తుందని ఆయన జీఎవితం కళాకారులకు హెచ్చరిక .ప్రజల పొపులర్ సెంటిమెంట్ తో ఆడుకోరాదని ఆయన తెలుసు కోలేక పోవటం విచార కారం .ఇండియా పై ప్రేమ అభిమానం చివరి దాకా వున్నా ఇక్కడికి రాలేక పోవటం ఆయన చేతులారా చేసు కొన్నదే .అందుకే ఆయన అంత్య క్రియలు లండన్ లోనే జరుగు తున్నాయి .రాజ్య సభా సభ్యత్వం ఇచ్చి భారత జాతి ఆయన్ను గౌరవించింది పద్మ భూషణ్ ..,పద్మ విభూషణ్ లతో సత్కరించింది .అయినా ఆయన మన వాడే అని చెప్పుకో లేని దౌర్భాగ్యం .కేరళ ప్రభుత్వం ”రాజా రవి వర్మ ”పురస్కారాన్ని హుస్సేన్ కు 2007 లో ఇచ్చి గౌరవించింది మహారాష్ట్ర లో జన్మించి ,మంచి చిత్రకారునిగాఎదిగి ముంబాయ చిత్ర కళా మొఘల్ గా జీవించి అంతర్జాతీయ చిత్రకళా సీమలో చౌధవీకా చాంద్ గా వెలిగి చివరికి దేశం కాని దేశం ఇంగ్లాండ్ లో మరణించట .బాధాకరం
ఒకరు మట్టిలో మాణిక్యం ఇంకొరు మినుకు మినుకనే సుదూర తార
అందరికీ నట రాజ రామ కృష్ణ జీవితం ఆదర్శం ఎందుకంటె ఎంత ఎదిగినా వొదిగి వున్న సంపూర్ణ కలాజీవి ఆయన .ఆయన్ను గురించి ఆయనే చెప్పుకున్న పద్యం లోని భావం కళాకారులందరికీ -కళాకారులే కాదు సమస్త జనానికీ అనుసరణీయం ,స్ఫూర్తి దాయకం
”చదివితి సకల శాస్త్రములు
అందలి సారములెల్ల గ్రహించితి
అంత విజ్ఞాన నేత్రంబు విప్పిచూడ
తెలిసి కొంటిని నాకేమి తెలియదనుచు ”.
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –10 -06 -11


chala chakkaga rasaru.
padyam adbhutam
meeku dhanyavadalu.
LikeLike
thanks for detailed information about two great persons in two fields of art.
LikeLike
ఒకరు మట్టిలో మాణిక్యం ఇంకొరు మినుకు మినుకనే సుదూర తార
chaalaa bagaa raasaru sir……thank you very much.
LikeLike