కొడవటి గంటి చెప్పిన కధ కాని కధలు
——————————————-
తెలుగు సాహిత్యం లో కొడవటి గంటి కుటుంబరావు కు ప్రత్యెక స్థానం వుంది .కధ ,నవల,వ్యాసం ,గల్పిక విమర్శ ,విశ్లేషణ ,సినిమా ,రాజకీయ సంగీతా లపై సాధికారత ,ఆయనది .చాలా మామూలు భాషలో అలంకారాలు లేకుండా నిసర్గాన్ గా రాయటం ఆయన ప్రత్యేకత .అలా చదువుకుంటూ పోతూనే వుంటాం .క్లిష్టత ,డొంక తిరు గుళ్ళు వుండవు .పాఠకుడి మనసులోకి సూటిగా హత్తుకు పోయేట్లు రాయటం ఆయన శైలి .దేనిమీద రాసినా ఇదే విధానం .చదివించే మహత్తర శక్తి వుంది .అభ్యుదయ భావాల గని .మానవుడి బలం ,బలహీనతలు తెలిసిన వాడు .ప్రపంచ సాహిత్యం పూర్తిగా అధ్యనంచేశాడు .సైంటిఫిక్ గా ఆలోచించే తత్త్వం వున్న వాడు .ఆయన రాసిన వన్నీ రాసి పోయాల్సినంత వుంది .సమగ్ర సాహిత్యం లభ్యమవుతోంది చదివి తెలుసు కావలసినవి ఎన్నో వున్నాయి రుచి కోసం కొన్ని మీకు అందిస్తున్నాను
ఎనిమిది వందల ఏళ్ళ క్రితం హేమ చంద్రుడు అనే జైన ఆచార్యుడు ;”సవిరావాలీ చరితం ”అనే పుస్తకం రాశాడు అందులో కధలపై వ్యాఖ్యానం లాంటి ”గల్పిక ”రాశాడు .
రమణీయం అనే దేశానికి రాజుకు కధలంటే మోజు .పౌరుల్లో రోజు ఒకరిని పిలిపించి కధ చెప్పించుకొనే వాడట .ఒక రోజు ఒక చదువు రాని పూజారి వంతు వచ్చింది .ఆయన కుమార్తె నాగశ్రీ .తండ్రికి బదులు కధ చెప్ప టానికి వెళ్ళింది .కధ చెప్పటం ప్రారంభించింది నా పేరు నాగ శ్రీ .నా తండ్రి నాగ శర్మ .తల్లి సోమశ్రీ .నా తలిదండ్రులు నన్ను ”చట్టుడు ”అనే వాడికి ప్రధానం చేసి పెళ్లి నిశ్చయించారు .ఒక రోజు వాళ్ళిద్దరూ వూరెళ్ళారు .చట్టుడు వచ్చాడు .మర్యాదలు చేశాను .నా మంచం అతనికిచ్చి ,నేను కింద పడుకున్నాను .అర్ధ రాత్రి దాకా వుండి ,నిద్ర పట్టక ,ఆ మంచం దగ్గరకు వెళ్ళా .అతను మేలుకొనే వున్నాడు .ఉద్రేకం తో ఊగి ,నిగ్రహించుకోలేక ప్రాణం వదిలాడు .నేనే చంపానని అంతా అనుకుంటారని భయ పడ్డా .శిక్ష తప్పదు అనిపించింది .అతని శరీరాన్ని ముక్కలు,ముక్కలు చేసి రహశ్యం గా పాతి పెట్టా .అనుమానం రాకుండా జాగ్రత్త పడ్డా .ఇంతలో మా వాళ్ళు వూరినుంచి తిరిగి వచ్చారు .”ఇంతవరకు కధ విన రాజు ”ఇది నిజమా ?అని అడిగాడు ”మీరు రోజూ వినే కధలు ఎంత నిజమో యిదీ అంతే నిజం ”అని చెప్పింది నాగ శ్రీ .ఆమె గడుసు తనానికి రాజు అబ్బుర పడ్డాడు .దీన్ని బట్టి తెలిసేదేమి టంటే వాస్తవికత వుంటే వినే వాడిలో ఎంత చైతన్యం వస్తుందో తెలియ జేస్తుంది అని ముగిస్తాడు కో.కు .
దక్షిణాంధ్ర రాజు రఘు నాద నాయకుడు గొప్ప prodigy పారిజాతాపహరణం అనే ప్రబంధాన్ని ఒక్క రాత్రిలో ఆశువు గా చెప్పి తన తండ్రి చేతనే నిండు సభలో కనకాభి షేకం చేయించుకొన్న విద్వత్ కవి .
నవలను నిర్మించటం లో” విశ్వ నాద ”కు వున్న శ్రద్ధ చాలామంది నవలా కారుల్లో లేదు .అన్నారు కుటుంబరావు
ర్రావిశాస్త్రి” master of monologue ” అంటారు కుటుంబరావు
”దేశమును ప్రేమించు మన్నా ”అన్న గురజాడ గీతానికి విశ్వ సాహిత్యం లో స్థానం వుందని రావు అభిప్రాయం .’
”వీరేశలింగం కర్మిష్టి .జాతి చెవులు పిండి .బుద్ధి చెప్పి ,కోప్పడి ,అడుగడుగునా విమర్శిస్తూ ,మంచి మార్గం చూపిస్తూ ఒక పెద్ద దిక్కై కాపాడాడు .గారాబం ,మెప్పు ,లాలన చూపి ,తెలుగు జాతిని ”పాడు ”చెయ్య లేదు .మౌధ్యం ,మరుకు తనం ,వున్న తెలుగు జాతి ,వీరేశ లింగం పెంపకానికి లొంగి వచ్చింది .మరొకరి వల్ల ఇది సాధ్యమయ్యేది కాదు .తన ద్వారా జాతి పైకి రావటమే ”లింగం”గారి ఆత్మ విశ్వాసం ,కీర్తనం .సంఘం కార్యం నేట్టికేసు కొన్న వాడేవాడు సాహిత్యం జోలికి పోడు .దీనికి వ్యతిరేకం గా వీరేశలింగం పని చేసి చూపించాడు .”veereshlingam ”రాక్షసుడు అన్నాడు కృష్ణ శాస్త్రి .అంచనాలకు అందనిది రాక్షస బలమే .అందుకే ఆయన శత్రువుల్ని హడల కొట్టాడు .సర్వతోముఖాభి వృద్ధి కోరే వాడెవడైనా ఇలానే చేస్తాడు .అయితే వీరేశలింగం పుట్టి 160 ఏళ్ళు దాటినా ఆయన రచనల అవసరామ్ ఏమాత్రం తీరలేదు .దేశాభ్య్దయం కోరే ఏ రాజ కీయ పక్షమైనా ఆయన్ను ,ఆయన భావాల్ని విస్మరించ రాదు ”అని చాల గొప్పగా estimate వేశాడు కుటుంబరావు .
”మిమ్మల్ని ఆంద్ర చెకోవ్ ”అంటారు మీ కామెంట్ ?అని ఒక విలేకరి కుటుంబరావు ను అడిగితే నిర్మోహ మాటం గా ,నిజాయితీ గా ”విశ్వ సాహిత్యం లో చెకోవ్ ఒక్కడే వున్నాడు ”అని బదులిచ్చాడు .
”శ్రీ కి ఏ మాత్రం తీసి పోని అంత కంటే ఎక్కువ గానే కృషి చేసిన మీకు వామ పక్షాలు శ్రీ శ్రీ కిచ్చినంత ప్రచారం ఇవ్వలేడెం ?”అని అడిగాడు ఒక విలేకరి ”దానికి స్పందనగా ”శ్రీ శ్రీ కి populaarity వుంది దాన్ని వాళ్ళు వాడుకొన్నారు .నాకు లేదు .వాడుకో లేదు ”అని తక్కున చెప్పాడు .
మాధవ పెద్ది గోఖలే ను మా,.గోఖలే అంటారు .మంచి కధకుడు దళితుల జీవితాన్ని కధల్లో వారి భాషలో అద్భుతం గా చిత్రించిన బ్రాహ్మణుడు .ఆ కధలు చదివి ఒక royist మిత్రుడు ”యెంత అన్యాయం జరిగిందండీ .నేను రాయాల్సిన కధలు మీ బ్రాహ్మణ అబ్బాయి రాసేశాడు ”అని నెత్తీ ,నోరు కొట్టుకోన్నాదట .అంత గొప్పగా గోఖలేకధలుంటాయి అని కుటుంబరావు కితాబు .
సోమర్సెట్ maaughum చివరి రోజుల్లోతన కధా సంపుటిని చదివి ఆయనే ”ఈ కధలు రాయ కుండా వుంటే బాగుండేది ”అని ఆత్మ విమర్శ గా చెప్పాడట .మంచి రచయిత లక్షణం.
”తెలుగు వాడి జాతీయ గుణం -ఓర్వలేని తనం –జాతీయ కార్య క్రమం –కోడిగుడ్డు మీద వెంట్రుకలు లెక్కించటం ”అన్నాట్ట శ్రీ శ్రీ అని మనకు చెప్పాడు కో.కు .
”విశ్వ నాద తన రామాయణాన్ని చదివి వినిపిస్తుంటే ఆ పథనాన్ని ప్రేక్షకులు యే విధం గా స్వీకరించినదీ ,నేను సయం గా చూశాను .అలాగే శ్రీ శ్రీ ,కృష్ణ శాస్త్రి ,ఏ వ్యాఖ్యానం లేకుండా పద్యాలు చదువుతుంటే శ్రోతలు వింటూ ఎలా కంగారు పడ్డది నేను స్వయం గా చూశాను ”అని కుటుంబరావు వారి వారి ధోరణుల ప్రభావంపై చక్క గా స్పందించారు
మీ గబ్బిట దుర్గా ప్రసాద్ ——11 -06 -11 –
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com


chaalaa bagundandi
LikeLike