ఫార్—- –దర్స్ —డే

            ఫార్—- –దర్స్ —డే    

                          ——————–
                 రేపు తండ్రి రోజు -ఫాథర్స్   డే .తండ్రికి , సంతానానికి .దూరం అవుతున్న రోజులివి . దూరంగా ఉంటున్న రోజులు కూడా అందుకే అది ఫార్థర్ డే అన్నాను .దూరపు రోజు అని అర్ధం . నిత్యం ఆఫీసు డ్యూటీ లో,మైళ్ళ కొద్దీ ప్రయాణం లో ,చీకట్లో నే చద్ది మూట కట్టించుకొని ,బండీయో ,బస్సో ,రైలో పుచ్చుకొని కనీసం ఇరవై కిలో మీటర్ల దూరం వెళ్లి ,ఆప సోపాలు పడుతూ ,చేరి .ఆఫీసు బాస్ ల ఇష్టా ఇష్టాలకు సాగుతూ ,కుంచించుకు పోతూ ,రోజంతా గడిపి హలో లక్ష్మణా అని ఇంటికి అంతదూరం ఈదుకొంటు చేరి రోజులు గడుపుకోనేవారు చాలామందే .ఇంటినించి బయల్దేరేటప్పటికి పిల్లలు నిద్ర లేవరు ,తిరిగి వచ్చేసరికి గాఢ నిద్ర లో జోగుతూ ఉ౦టారు .మరి ఈ తండ్రికి పిల్లలు దూరమా ,దగ్గరా ? వుండేది ఒకే ఇంట్లో .కాని వారిద్దరి మధ్య కనిపించని దూరం .వాళ్ల చదువుకు డబ్బు ,సమకుర్చ గలుగుతున్నదే కాని వాళ్ళు ఎలా చదువు తున్నారో ,ఏం చేస్తున్నారో తెలుసు కోలేని స్థితి .తల్లి చదువు కున్న దైతే ఆ సంసారం కొంత నయం .లేక పొతే వాళ్ల గతి అధో గతే .ఈ బాధలన్ని భరించలేక పుట్టంగానే residential లో పడేసి చేతులు దులుపుకొని ,లక్షలు కుమ్మరించి ,వాళ్ల తిండీ బట్ట కార్పోరేట్ పరం చేసి ,అభిరుచులేమిటో ,ఆశలేమితో తెలుసు కోకుండా ,అమెరికా ధ్యేయాన్ని వాళ్ల వంట బట్టించి ,అది నెరవేరే వరకు నిద్రా హారాలు వాళ్ళు మాని సంతానంతో మాన్పించి ఊహా స్వర్గాలలో విహరిస్తూ ,వాళ్ల బాధ్యతను డబ్బు తో దులిపేసుకొంటుంటే ఎక్కడున్నాయి ? ఇంకా ఆప్యాయత ఆనందం ,ప్రేమ వాళ్ల మధ్య ఎక్కడుంటాయి?  కింది తరగతి జనం లో రెక్కాడితే కాని డొక్కాడని పరిస్థితి .వున్న కాస్త కోసం తగువులు, కార్పణ్యాలు ,పగా, ప్రతీకారం .  తాగుడు ,వ్యభిచారాలతో కుటుంబ బంధం విచ్చేదనమే . తండ్రికి కొడుకులు చూస్తారని నమ్మకం ,కొడుకులకి తండ్రి న్యాయం చేస్తాడనే నమ్మకం తగ్గిపోయాయి .ఎవరి స్వార్ధం వాడిది .కూతుర్ని ఆప్యాయంగా చూస్తె కొడుకులకు మంట .పోనీ వాళ్ళేమైనా తవ్వి తలకేత్తు తార?ఆంటే అదీ లేదు . కాల౦ గడిచిన కొద్దీ కార్పణ్యాలు పెరగటమే కాని ,కమ్మని పలకరింపులే కరువై నాయి.
                          ఇక అమెరికా లాంటి దేశాల్లో కొడుకులు వుంటే ,ఏదో చుట్టపు చూపుగా పెంచిన వాళ్ళను కొడుకు తీసికొని వెళ్తే అక్కడ కోడలు పెట్టె హింస, ఇటీవలే   అంపశయ్య నవీన్ గారు చాల గొప్ప కధ రాశారు నవ్య వీక్లీ లో . ఆయన్ను సపోర్ట్ చేస్తూ చాల మంది లేఖలురాశారు .  అదే భార్య తల్లి తండ్రి వస్తే ఆమె వాళ్ళను నెత్తినా పెట్టు కోవటం వెంట వుండీ అన్ని చూపించటం ఎన్నెన్నో కోని ఇండియా కు వాళ్ళతో పంపటం కుడా ఆయన రాశారు ..ఇక్కడ తల్లి దండ్రులను చూడటం లో యెంత వ్యత్యాస ముందో తెలుస్తోంది .ఈ జబ్బు ఇతర దేశాల్లో నే వుండదను కొంటే పొర బాటు .  ఇక్కాడా అదే పరిస్థితి చాలా సంసారాల్లో.  భార్య తరుపు వారికి రెడ్ కార్పెట్ స్వాగతం , భార్య కష్ట పడుతుందని తానే అత్తగారికి, మామ గారికి బామ్మర్దికి ,ఆయన గారి భార్యకు ,వాళ్ల సంతానానికి సకలోపచారాలు ,రాచమర్యాదలు చేస్తారు.   అమ్మా ,నాన్న వస్తే భార్య కష్టపడుతుందేమో నని భయం ఇక్కడా వుంటుంది అయితె తానేమి చేయడు ,ఆమెతోను చేయించాడు .  పండగ ,పబ్బాలు వస్తే వీళ్ళకు పరవాన్నం ,పులిహోర అదే అత్తా వైపు వారికి పంచ భక్ష్యాలు ..చూపులో తేడా చేతలో ,ప్రవర్తన లో తేడా స్పష్టం .  ఇదంతా మధ్య తరగతి మంద హాసం .
                                నాన్నా అని, అమ్మా అనీ ఆప్యాయంగా పలకరించే కొడుకులు తగ్గారు .ఫోన్ సంభాషణల్లో ఆ పరమ గౌరవం తగ్గిపోయాయి మెయిల్ రాసేప్పుడూ పొడి అక్షరాలే ..అదే రేపు వాళ్ల సంతానం అలా ప్రవర్తిస్తే సహిస్తారా . ఇవన్నీ సభ్యతా సంస్కారాలకు ,విలువలకు నిలయమైనవి .  కొడుకుల పెట్టు పోతల కంటే వీటినే తలిదండ్రులు కోరుతారు .  వీటికి విఘాతం రా కూడదు.  మామ గారింట్లో ఒక్క రోజు ఉండటానికి కోడలికి తీరిక వుండదు .చుట్టపు చూపు పరామర్శ మాత్రమే. అదే అమ్మకు ,నలత అయితె కలత చెంది భర్త కిబ్బండైనా  వాలి సేవ చేయటం చూస్తున్నాం .  వీళ్ళకే ఈ భావం వుంటే సంతానానికేం చెప్తారు ?అందుకే బంధుత్వాలుగెందె(gender )ర్   బట్టి మారుతున్నాయి
                              వయోవ్రుద్ధుల దీన పరిస్థితి మరీ దారుణం .కొడుకు ఇతరదేశాల్లో వుంటే ఇంకా వారి గతి కుక్కలా గతే .ఆలనా పాలన వుండదు .వృద్ధాశ్రమం లో చేర్పి దులిపెసు కోవటం వంటరి బతుకు ,జీవితం విరక్తి ,జబ్బులు ,వీరి పాలిటి శాపాలు .  వీటిని తట్టుకొని నిలబడే మానసిక ధైర్యం, స్థైర్యం వారికి వుండటం లేదు  .ప్రభుత్వం తలి దండ్రుల బాధ్యతా సంతానానిదే అని చట్టం తెచ్చింది కాని ఆమలులో ఎంతో దూరం ప్రయాణించాలి .  వృద్ధులు దేశ జనాభా లో 50 %ఉన్నారట .వీరందరి గురించి ప్రభుత్వం ఏమి చేయ గలుగుతుంది?  స్వచ్చంద సంస్థలకు కూడా అలవికాని పరిస్థితి .తాత మనవడు సినిమా లాగా తన దాకా వస్తే కాని తెలియదు .కూతుళ్ళే నయం అనిపించేరోజులై పోయాయి ఆవిడ ఏదైనా తలిదండ్రులకు సాయం చేస్తే దోచి పెడుతో౦ది అనినేరం .ఆమెకు వీళ్ళు చేస్తే పక్షపాతం అని ఈసడింపు.
                        ఆప్యాయతకు ,ప్రేమకు ,మమతకు ,మమకారానికి గౌరవానికీ ,మర్యాదకు మంచికి సహృదయతకు ,సానుభుతికి నిలయమైన దేశం లో ఇవన్నే క్రమంగా దూరమవటం విచారకరం .  ధర్మానికి దూరం అవటం లో వచ్చిన ఇబ్బంది ఇది తలిదండ్రుల బాధ్యతా సక్రమంగా సంతానం వహించాలి అప్పుడే వారికి ఆనందం ,వీరికి శ్రేయస్సు .faathers డే ,కుటుంబ బంధాలను ద్రుఢతరం చేయాలి .  ఏక కుటుంబ భావన కలిగించాలి ఆంటే కాని వాటిని మరింత దూరం చేసే ఆంటే ఫార్థర్  చేసే పని చేయ దాని ఆశిద్దాం .  రోజు ను జరపటం కాదు రోజూ  వారితో గడిపే రోజూ రావాలని ఆకాంక్షిద్దాం
                                                                                 గబ్బిట దుర్గా ప్రసాద్
Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు. Bookmark the permalink.

4 Responses to ఫార్—- –దర్స్ —డే

  1. John Hyde's avatar John Hyde says:

    CHECK TYPING MISTAKES

    Like

  2. Madhavi's avatar Madhavi says:

    chaalaa baagaa chepparu sir………meeru rasinavanni nijaale

    Like

    • kovila's avatar kovila says:

      Chalaa baagundi article…ఎంతమందికి కనువిప్పు కలుగుతుందో చూడాలి మరి…!!

      Like

  3. Harini-Jaya's avatar Harini-Jaya says:

    Correct ga rasaru..Ee kaalam pillalaki fathers ki dooram peruguthondhe kani aapyayatha karuve!!

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.