తెలుగు కధల్లో జీవిత సత్యాలు
శ్రీ వాకాటి పాండురంగా రావు ,పురాణం సుబ్రహ్మణ్య శర్మ లు సంకలనం చేసిన ”కదాభారతి తెలుగు కధానికలు ”ఈరోజు చదివాను .అందులో అందరికి తెలియజేయాల్సిన కొన్ని జీవిత సత్యాలను కధకులు అద్భుతంగా వివరించారు .అవి నాకు నచ్చి ,మీకూ ,నచ్చుతాయని మీ ముందుంచుతున్నాను .వాక్యాలన్నీ రచయితలవే ..నేను కూర్పరిని మాత్రమే .
దేవుడి పల్లకి —అవసరాల రామ కృష్ణా రావు
————————————————-
కామ రూపులైన దేవతలూ ,పరకాయ ప్రవేశం చేసిన మనుష్యులూ పుష్కలంగా వున్న కాశీ మజిలీ కధలోని మనోహర దృశ్యాలను కళ్ళకు కట్టి నట్లు సన్నాయి లోని మలయ మారుతం అలా ఎక్కడికేక్కడికో తెలియని దూర తీరాలకు తీసుకొని వెళ్లి పోతోంది .కధ చివరని ,మాంచి బిగింపు వున్న ముగిమ్పులా ,మద్దెల దరువులు ముచ్చటగా విని పిస్తున్నాయి .దేవుడు ఊరేగి తున్నాడు .పూజా ప్లుస్ అరులు మాత్రంకుర్రాళ్ళను కోప్పడుతున్నారు .
”పద్నాలుగు భువనాలు కడుపులో పెట్టుకున్నాడట .చూస్తె చిన్న కుర్రాడు .అని కృష్ణున్ని ప్రతి వాళ్ళు పొగుడు తున్నారు .పాపం ఎలా భరిస్తున్నాడో యెంత గొప్ప వాడో అనుకుంటూ —ఇంతగొప్ప వాణ్ని ,బరువైన వాణి అవలీలగా అదేపనిగా చంకనేసుకున్తున్నాను .నన్ను మెచ్చుకున్న తలక మాసిన వాడు ఒక్కడూ కనపడ్డు .ఇంతకీ ప్రాప్తం ”అని యశోదా దేవిసరదాకి అన్నదట .
”వూళ్ళో ఎవరు చచ్చిపోయిన తనే నాయకత్వం వహించేసుబ్బయ్య చనిపోతే ఒక్కరూ ఆ శవాన్ని స్మశానానికి తెసుకు వెళ్ళటానికి ఒక్కడూ రాలేదు .పిల్లాలు చనిపోతే తలి దన్ద్రుల్నిఒదార్చిగుడ్డా కప్పి శ్మశానానికి తెసుకొని వెళ్ళేవాడు సుబ్బయ .అతను చేసిన అనాధ ప్రేత సంస్కారాలకి లెక్క లేదు .కాని వూరు అతనికేమి తోడుగా నిలవలేదు .కామేశం ”నేను మొగాణ్ణి కనుక ”అని చిన్న పిల్లాడైనాకామేశం ముందుకు వచ్చి పై బట్టలు పిరికి తనం ,భయం అన్నిటినీ విప్పిపారేశాడు .వాడు మనిషి గా మళ్ళీ మాట్లాడితే మనీషిగా మారింది అప్పుడే . గాఢమైన జడత్వం లో నిద్రిస్తున్న చీకటిగూడును చీల్చుకొని జ్ఞ్గాలిగొంగళి పురుగు రంగు రంగుల చుక్కల చుక్కల శ్సీతా కొక చిలుకల మారి ఎగిరి పోయింది .అప్పుడే అమావాష్య బతుకు లో అందమైన దీపావళి ”కామేశానికి తోడూ జగన్నాధం వీళ్ళకు తోడూ ఊళ్ళోని పిల్ల లంతా జతకలిసి సుబ్బయ్య అంతిమ సంస్కారానికి దండులా కదిలారు .అపుడు బుద్ధి వచ్చింది ఊళ్ళోని పెద్దలకు .వాళ్ళు అంతా భక్తుల్లా ముందుకు దూకారు .పిల్లలే ముందు శవ వాహకులై మున్డునారు ప్రతి కుర్రాడు భుజం కలిపాడు .చివరికి సుబ్బయ్య చావు దేవుడి పెళ్లి లా వైభవం గా జరిగింది .అప్పుడు కామేశం అన్న మాటలు మరువ రానిది ”మన్చి పనులు చేద్దామని పెద్ద పెద్ద కబుర్లు చెబుతాం .అవసరం వస్తే ఆమడ దూరం పారి పోతాం .అలాంటి బతుకు బతుకు కాదు చావు .మనం చేసే మంచి అనులకు ఇదే నాంది .మన సంస్కారం ఇక్కడ్నించే ప్రారంభిద్దాం .
మర మనిషి —-కొమ్మూరివేణుగోపాల రావు —–”
———————————————————-
తల్లితనయుడికి వున్న సంబంధం బాంధవ్యం లాభ నష్టాల త్రాసుతో తూచటం చేత కాదు శ్రీ దేవికి .కాని ఈ విషయం లో భర్తతో వాదించాడు .మౌనం గా వుంటుంది .అనా కారిగా పుట్టిన కొడుకు చని పోయాడు .దాన్నిస్పెసిమేన్ గా మేఇకాల్ ల్యాబ్ ఉంచాడు .తండ్రి తనం కంటే ప్రొఫెసర్ తనం అతన్ని డామినేట్ చేసింది .రోజూ దాన్ని చూస్తూ వెళ్ళేవాడు.చివరికి అతనిలో మార్పు వచ్చింది .దాని చెంతనున్చుంటే అతని హృదయం స్పందిన్చినట్లుండేది .శరీరం చేమర్చేది .అక్కడ ప్రదర్శనకు పెట్టిన పదార్ధం సైన్సు ను విరజిమ్మే ఆ పయుక్త వస్తువు ,తన రక్తం లో రక్తం తన బొమికలో బొమిక తనలో ఒక అంగం అనే భావం బలపడింది .
maramanishilo మానవత్వం ప్రవేశించింది .మొదట విజ్ఞానాభి రుచి ,తదుపరి యుద్ధం ,తదనంతరం అభిమానం ఆ తర్వాత ఆకర్షణ ,అటుపై మమకారం వెర్రి భ్రమ పిదప ఏకత్వం ఒక దాని వెనుక ఒకటివిరుచుకు పడుతూ అతన్ని కుదిపిపారేస్తున్నాయి .ఆ ఆకృతి ,నిద్రలో కూడా ప్రత్యక్షమవుతోంది .సీసాలో పెట్టిన ఆ స్పెసిమెన్ ను పగల కొట్టి తన పిల్లాడిని ఆప్యాయం గా కావలించుకొని పిత్రుప్రేమ కురిపించి స్మశానానికి తీసుకువ్ల్లి పితృ విధి నెరవేర్చి ఊపిరిపీల్చుకున్నాడు ప్రొఫెసర్ శ్రీధర్ .
కానుక –ముళ్ళపూడి వెంకట రమణ —
————————————————-
–ఉహించిన సంగీతాన్ని భావన చేసి భావించిన దాన్ని అనుభవించి దర్శించే సరికి గోపన్నకు ఒక సత్యంగోచారించింది .సంగీతాన్న్ని అనుభూతికి తెచ్చు కోవటానికి జంత్ర గాత్రాలను ఉపయోగించ బోవటం అవివేకం .జలపాతాన్ని వెదురు గొట్టం లో ఇమడ్చటం పొరబాటు .సముద్రాన్ని పాల కడవ లో ఇమడ్చటం తెలివి తక్కువ .వూహ కందే సంగీతం లో పాట కండేది శత సహశ్రాంశం వుండదు .ఊహసాగినకొద్దీ స్వరలతదిగంతాలకు వ్యాపించింది .ఆకాశం వరకు వ్యాపించింది రోదసి అంతా నిండి పోయింది .క్రమంగా ఓంకార జనితమై న స్వరార్నవం తిరిగి ఓంకారమై ,భువన సమ్మోహనం గాభీకరం గా , అద్భుతం గా ,ఎరుక పడ సాగింది .శ్రుత సంగీతం లా ఇందులో పశ్రుతులు లేవు .అపశబ్దాలు రావు .అని వేదాంతాలు అన్ని సత్యాలు అర్ధ సత్యాలేనంటు తనలో భాగాలేనంటూ నిలచే అద్వైత సత్యం లా ఈ సంగీతం లో అపస్వరాలు కూడా అర్ధస్వరాల పూర్ణ స్వరాల పక్కన నిలిచి అందాలు సంతరించుకొనిఅంగం గా భాశించాయి.ప్రతి అనువునా భగవంతుడున్నాడని ప్రతి శబ్దం లోము సంగీతం వుంది .అతను ఊహించిన సంగీతాన్ని అనుభవించటానికి గోపన్నకు శక్తి చాల లేదు .అందమానందం ,ఇంత దగ్గరగా వస్తే ఇంత దుర్నిరీక్షాలై దుర్భారాలై ఉంటాయని క్రిష్ణయ్యసంగీతాన్ని వింటుంటే అతనికి అనిపించింది .
శృతి బద్ధంగా తాను తయారు చేసిన వేణువు వుందో లేదో నిర్నయంచే జ్ఞానం తనకు ఉందా అని అనుమానం వచ్చింది గోపనకు .శ్రుతులన్నీ దాచుకొన్న బోజ్జలోని ఒంకారానికి మూల స్థాన మైన నాభిలోంచి మంగళ గళం లోంచి మధురాధరాల లోంచి ,రాదాధరాలను పవిత్రం చేసిన మధురాధరాల లోంచి ,జీవం వచ్చి తన వేణువు లో ప్రవేశిస్తుంది .అసత్యమైన వేణువు లేనే లేదు .భగవంతునికి ఉపయోగపడని వేణువే లేదు .సహస్ర వేణు నాద స్వరార్నవం లో సాక్షాత్తు మహా విష్ణువే తేలుతున్నాడు .
మీ —-గబ్బిట దుర్గా ప్రసాద్ —-29 -06 -11 .

