గురజాడ కన్యాశుల్కం —2

గురజాడ కన్యాశుల్కం —2
                   తెలుగు లో ఆధునిక యుగం కీ.శ.1800 నుంచి ప్రారంభం అయింది .1800 –1850   కాలాన్ని బ్రౌన్ యుగం అనీ ,1850 నుంచి 1900  కాలాన్ని వీరేశాలింగాయుగం అనీ 1900 —1915 వరకు ఉన్న కాలాన్ని గురజాడ యుగమనీ అంటారు .అంటే గురజాడ యుగపురుషుడు .బాలా వితంతువుల దుర్భర జీవితం ,కన్యాశుల్కం బిల్లు విఫలత ,శిధిల సామాజికి స్థితి ,విజ్రుమ్భించిన వేశ్యావృత్తి ,గురజాడను కన్యాశుల్క రచనకు ప్రోత్చాహించాయి .”నేను రచయితను కావాలనుకోలేదు ”అన్న గురజాడ రాజు గారి ప్రేరణతో తెలుగులో రచన ప్రారంభించాడు .అప్పటికే విశ్వ సాహిత్య పరిచయం వుంది .సాంఘిక దురన్యాయాలను వ్యతిరేకిన్చాతానికి ప్రజాభిప్రాయం కొద గట్టాలి అందుకు నాటకమే సరైన ప్రక్రియ అని భావించాడు .కదా వస్తువును హాశ్యం తో మేళవించి ,సమశ్యను వివిధ కోణాల్లో చిత్రించటం ,పరిష్కారం సూచిన్చాకుండా ప్రజలకే వదిలేయటం ఆయన మార్గం .ఈ నాటకంనూటైరవై ఏళ్ళ చరిత్ర అలిగి వుంది .దీన్ని కన్నడం ,తమిళం ,ఇంగ్లీష్ ల లోకి రష్యన్ భాష లోకి హిందీ లోకి అనువాదం జరిగింది .”కన్యాశుల్కం భూమిక గా ,బాల్యవివాహాలు ,విధవా పునర్వివాహాలు వేశ్యాసమస్యాల సోపానం తో గురజాడ నిర్మించిన మహాసౌధం కన్యాశుల్కం ”అనారు విశ్లేషకులు .ఈ సౌద నిర్మాణానికి సంఘ సంస్కరణ ,భాషా సంస్కరణ ,ఉత్తమ నాటక సృష్టి మూల స్తంభాలు .
                           సామాన్య జనానీకానికి తనభావాలు చేరాలంటే వాళ్ళ వ్యవహారిక భాష లోనే రాయాలి .కనుక మాండలీకాల స్ఫూర్తి కలిగించాలి .మాటలతో గాయాలు చేయకుండా సుతి మెత్తని హాశ్యం తో గిలిగింతలు పెడుతూ ,ఆలోచిమ్పజేయాలి .తానూ భావించిన లక్ష్యాలకు లక్షణం గా నాటకాన్ని తెర్చిదిడ్డాలి అని గురజాడ ఆలోచించి ఆచరించాడు .”నాది ప్రజల ఉద్యమం ‘అన్నాడాయన .అందుకే ”ఆధునిక తెలుగు నాటకకానికి కన్యాశుల్కం ప్రామాణికం ”అని అంటాడు ,నటుడు రచయిత ప్రయోక్త ,విమర్శకుడు కాకరాల .కర్చీఫులు ,కొంగులు తడిసి పోయేట్లుఏది పించ రాదు అన్యాయాల మూలాలు అందించాలి  వాటిపై ప్రజలు ఆలోచించాలి అని గురజాడ ఆరాటం .”నేను మితమైన మిత వాదిని ,మితమైన అతి వాదిని ”అని తనను ఆవిష్కరించుకున్నాడు ..౧౯౦౮ లో మద్రాస్ లో జరిగిన కాంగ్రెస్ సభలకు హాజరైనాడు .జాతీయభావాలు ఆకళింపు చేసుకున్నాడు .అప్పటికే 19 వ శతాబ్దపు కవులు కొందరు దేశభాషలలో రచనలు చేశారు .గురజాడ జాతీయోద్యమ స్ఫూర్తి తో ”ముత్యాల సరాలు ”అనే స్వీయ ఛందస్సులో రచనలు చేశాడు .”మేలుకొలుపుల కోడి కూసేనాను ”అనీ ,”చదల చీకటి కదలబారెను ”అనీ కొత్త గోతుకతో మేలుకొలుపులు చేశాడు .అదే సమయం లో ఆంద్ర దేశం లో సురెంద్రనాద్ బెనర్జీ సుడిగాలి లా తిరిగి ఉపన్యాస ఝారితో ఉత్తేజితులను చేశాడు ”ఎల్లలోకము ఒక్క ఇల్లై -వర్నభేదములేల్ల కలి ,మమతలన్న్యు మాసి పోయి జ్ఞానమొక్కటే నిలిచి వెలుగును ”అని అంతర్జాతీయ స్పృహను కలిగించాడు .మరి తాను రాసే కన్యాశుల్కనాటకం ఆస్తాయికి తగ్గరాదు ,దానిని మించి ఉండాలన్న తపన చెందాడు .అందుకే ఆయన హృదయపు లోతులోంచి కన్యాశుల్కం అచ్చమైన నీల ముత్యం లా ప్రభాసించింది అంటారు విమర్శకులు .”జీవితం లోంచి పుట్టుకొచ్చింది ,జీవితాన్ని వ్యాఖ్యానించింది సమాజ రుగ్మతకు శస్త్ర చికిత్చ చేసింది వాస్తవికతనుప్రతిబింబింప జేశింది .తన నాటకానికి నైతిక ప్రయోజనం వుందని గురజాడే తెలిపాడు .
                 ఒంగోలు లోని తన మిత్రుడు ముని సుబ్రహ్మణ్యానికి ఈ విషాలన్ని పూసా గుచ్చినట్లు లేఖ లో తెలిపాడు .పాత్రోచితమైన భాష ,జీవకళ ఉట్టిపడే పాత్రలు ,సులభమైన భాషా ,తేలికైన శైలీ ,భావగర్భిత పదజాలం ,చమత్కార కల్పనలతో నాటకానికి సమగ్రత్వం తెచ్చారు .”ఆయన ప్రతిభా సర్వస్వం ప్రతిఫలించిన అద్భుత మని దర్పం కన్యాశుల్కం ”అంటారు అందుకనే .”రాబోయే యుగం రూపు రేఖలు ,రాబోయే సమాజ స్వరూపం ,స్వహావాం ,రావాల్సిన మార్పులు ,చేయాల్సిన చేర్పులు తెలుగుభాషకు అవసరమైన చర్యలు ఉత్తమ , మానవ సమాజ స్థాపన ”ఇందులో అనిపిస్తాయి,ప్రతిబింబిస్తాయి .
                     సంస్కృతరూపకాలలో   శూద్రక మహాకవి రాసిన మ్రుత్చాకటికం ఎంత విశిష్ట మైనదో ,తెలుగులో కన్యాశుల్కం అంత గొప్పది . రెండూ సామాజిక ఇతి వృత్తం కలవే లోక వృత్తం వుంది .సామాన్యులే పాత్రధారులు .అభ్యుదయ వాదుల దృష్టి లో ఆ రెండూ ఉత్తమ నాటకాలే .అని మహాకవి శ్ర్రీ శ్రీ కి భావకవి అబ్బూరికి అనిపించాయి .
                       ప్రపంచనాటక రంగం లో గురజాడతో పోల్చదగిన వారు ఎవరైనా వున్నారా అని ఆలోచిస్తే జర్మనీ నాటక రచయిత HOSTMAN  కనిపిస్తాడు .ఇద్దరు ఒకే సంవత్చారం అంటే 1862 లో జన్మించారు . కన్యాశుల్కానికి ముందు తెలుగు దేశం లో ఏ పరిస్థితులు వున్నాయో జర్మని లోనూ అవే పరిస్థితులున్నాయి .HOSTMAN ”THE WEAVERS “‘ .అనే నాటకాన్ని రాసే వరకు సామాన్య మానవుడిని ఎవరూ అక్కడ పట్టించుకోలేదు .ఏ రచయితా వాళ్ళ జీవితాలపై రచన చేయ లేదు .వెట్టిచాకిరీ చేసే సామాన్య నేత కార్మికుల కరుణామయ గాధను నాటకీకరించి ,ప్రజాదరణ పొందాడు .గ్రామీణ ,ప్రాంతీయ వ్యావహారిక భాషను హోస్త్మన్ వాడి నాటకాన్ని సామాన్యుల దగ్గరకు చేర్చాడు .దాదాపు గురజాడ ,ఆయన ఒకే సమయం లో ఈ నాటకాలు రాశారు .ఒకరికొకరు తెలియరు .ఒకరి నాటకం ఇంకొరు చదివే అవకాశమూ లేదు .ఆయన  కూడా  సామాన్యులేనా  నా యకులు అన్నాడు .అందులో నాయకులు అంటే హీరో ఎవరు లేరు.  హోస్త్మన్ ,గురజాడలు ఆధునిక నాటక రంగానికి మరపు రానిమనీషులు  .ప్రగతిపద కేతనం ఎగరేసిన వీరులు .ఈ విషయమంతా అబ్బూరి రామ కృష్ణా రావు గారు తెలియ జేస్తూ ”ఎన్ని నేరజాడలున్నా గురజాడకు సాటి రారు ‘అని కితాబు ఇచ్చారు .
                                                                సశేషం
                                                                          మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –23 -10 -11 .

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు. Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.