కన్యా శుల్కం లో కరటక శాస్త్రి –1

 

                                            కన్యా శుల్కం లో కరటక శాస్త్రి  –1
                  మహా  కవి గురజాడ అప్పా రావు గారు రాసిన కన్యా శుల్క నాటకం 27 -06 -1892 లోవిజయ నగరం   లో మొట్ట మొదటి సారిగా ప్రదర్శించారు ..ఆ ప్రదర్శనకు వందేళ్ళ పండుగ 1992 లో దేశమంతా భారీగా జరిగింది .అంతకు ముందు  ఆ నాటకాన్ని నేను రెండు మూడు సార్లుచదివాను  .కాని అప్పుడు ఇంకొంచం శ్రద్ధ తో చదివాను .పాత్రల మీద దృష్టి పెట్టి చదివాను .ముందుగా అందరి దృష్టి గిరీశం మీద ,మధుర వాణిమీద  పడుతుంది .వారిద్దరి పాత్రలమీడా లోతైన చర్చలు ,విస్తృత మైన రచనలు జరిగాయి .అల్లాగే మిగిలిన పాత్రలను స్థాలీ పులాక న్యాయం గా పరామర్శించారు .నేను చదివినంత  వరకు అందులో దాక్కున్న ”కరటక శాస్త్రి ”గురించి అంత తీవ్రంగా రాసినదేదీ కనిపించలేదు .మళ్ళీ చదువుతూ ,ఆ పాత్ర మీద దృష్టి పెట్టి చదివా .చదివిన కొద్దీ అతని పాత్ర చాలా లోతైనదని ,నాటక నిర్వహణ లో బాగా సాయపడిన పాత్ర అని ,లోతైన మనిషి అనీ ,కొంత లోకజ్ఞానం   వున్నా ,స్వార్ధం అతన్ని బాగా కిందికి లాగేసిందనీ ,తన పని నేర వేర్చుకోవ టానికి ఎంత కైనా దిగాజారుతాడనీ అని పించింది .అతను నాటకం లో ప్రవేశించిన దగ్గర్నుంచి ,నిష్కర మించే దాకా అతని తీరు తెన్నుల గురించి 1992 సెప్టెంబర్ లో  సుదీర్ఘ రచన చేశా .దేనికీ పంపలేదు .నా దగ్గరే వుంది .అప్పా రావు గారి నూట యాభై వ జయంతి సందర్భం గా దాన్ని మీ అందరి కోసం అందిస్తున్నాను .ఇది పరిశోధన అనే పెద్ద పేరు పెట్టె సాహసం చేయలేను .కాని ,నా అవగాహన ,నా పరిశీలన గా మాత్రం వినమ్రం గా చెప్పు కొంటాను .ఇదీ కరటక శాస్రి కినేపధ్యం
                మనుష్యుల స్వభావాలక్ను బాగా అంచనా వెయ గల దిట్ట గురజాడ .అందుకే తన కన్యాశుల్క నాటకం లో ప్రతి పాత్రా నిండుగా ,జీవం తో తోనికిస లాడు తుంది .పాత్రల స్వరూప ,స్వభావాలను బట్టి ఆయన పేర్లు పెట్టారు .PILGRIMS ప్రోగ్రేస్స్లో పేర్లు అలానే వుంటాయి .అప్పా రావు గారు కుడా అందుకే అర్ధ వంత మైన పేర్లు సార్ధకం గా పెట్టారు .అవి క్లిక్ అయాయి .ఆపాత్రలకు యా పేర్లు LABELS  లాగా వుంటాయి .చిత్రణ ,మనః ప్రవ్రుత్తి ,నడత ,నడక ,అంతా ,ఆ పేరును బట్టే అర్ధమై పోతుంది .అలాంటి వారిలో నులక అగ్ని హోత్రావధానులు ,బావ మరిది కరటక శాస్త్రి .పంచ తత్రం లో కరటక దమనకులు కలిసి ఒక్కరైఅట్లున్తుంది .సింహం వద్ద స్నేహం చేసి ,తంపులు పెట్టి ,పొట్ట పోసుకొనే నైజం గలనక్కలు అవి .కరటక శాస్త్రి సింహం వంటి అగ్ని హోత్రావదావదానులకు స్వయానా బావ మరిది .కొంత లోక ధర్మం తెలిసిన వాడు .జిత్తుల మారి తెలివి తేటలతో తాను అనుకొన్నది సాధించ గల వాడు .ఎత్తుకు పై ఎట్టు వెయ తానికీ ,ఏ ఎండ కు ఆగోడుగు పట్ట టానికి  సర్వ సమర్ధుడు . .అవతలి వారిని ఉబ్బేసి పనులు జరిపించుకొనే నేర్పున్న వాడు .తన చెల్లెలు బాధ ,మేన కోడలు అన్యాయంగా విధవ రాలు కావటం ,రెండో మేన కోడల్ని బావ అమ్మకానికి పెట్టటం బావ గారి అగ్గిమీద గుగ్గిలం తత్త్వం ,ఎరిగి కీలెరిగి వాత పెట్ట టానికి తన శిష్యుడి సహాయం తో ప్రయత్నం చేయ టానికి సిద్ధ మైన బావ మరది కరటక శాస్త్రి .అక్క గారి కాపురం పచ్చ గా వుండాలని తపనతో సాహసం చేసిన తమ్ముడు .దేశ వ్యవహారాలూ ,దేశం లో వస్తున్నా మార్పులు ఎప్పటికప్పుడు ఒంటబత్తించు కొన్న    వాడు .అందు వల్ల పని సులువు తెలిసిన వాడు .ఆవలిస్తే పేగులే కాదు సర్వము లెక్క పెట్ట గలిగే గణికుడు ..
                 కరటక శాస్త్రి పరిచయం మనకు కృష్ణ రాయ పురాగ్రహారం లో నులక అగ్ని హోత్రావదానుల ఇంటిలో జరుగుతుంది .గిరీశం అక్కడికి ”బిచానా ”వేయటానికి వస్తాడు .తన పేరా ఉన్న భూమి అమ్మి కొడుకు వెంకటేశానికి చదువు చెప్పించమని అతని అక్క వెంకమ్మ భర్త అవధాన్లతో అంటుంది .బావ గారి డబ్బు కాపీనం అర్ధం చేసు కొన్న కరటక శాస్త్రి ”నీ భూవెందుకు అమ్మా లామా .-మన సొమ్ము చాడ తిని కొవ్వున్నాడు .అతడే పెట్టుకుంటాడు ”అని బావను కడగటం తో పరిచయ మవుతాడు .
Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు. Bookmark the permalink.

2 Responses to కన్యా శుల్కం లో కరటక శాస్త్రి –1

  1. ప్రసాద్ గారూ!

    మీ ప్రతీ టపా శ్రధ్ధగా చదువుతాను. ముందు మీ వోపికకి ఓ సాష్టాంగం!

    విమర్శిస్తున్నాననుకోవద్దు….లెక్కపెట్టేవాణ్ని “గణకుడు” అనాలి కదా? అథవా, కరటకశాస్త్రి మధురవాణి దగ్గర చేరాడు కాబట్టి “గణికుడు” అన్నా ఆ మాటని కొటేషన్స్ లో పెట్టివుంటే, శ్లేష ధ్వనించేది!

    తరవాత…..స్థాలీపులాక న్యాయం గురించి వినడమేగానీ, దాని వ్యుత్పత్తి అర్థం తెలుసుకోలేకపోయాను. మీకు వీలైతే వివరించండి.

    మీరు తెలుగు వ్రాయడానికి యేది వుపయోగిస్తున్నారోగానీ, చాలా తప్పులు దొర్లుతున్నాయి. వీలైతే “లేఖిని” వాడండి. చాలా బాగుంది.

    చివరిగా, మీ ప్రొఫైల్ లో వున్న మెయిల్ చిరునమాకి మెయిల్ చేస్తే, తిరిగి వచ్చింది! అది వాడటం లేదా?

    యెక్కువ వ్రాసివుంటే క్షంతవ్యుణ్ని!

    Like

    • gdurgaprasad's avatar gdurgaprasad says:

      శ్రద్ధగా చదివినందుకు కృతజ్ఞతలు .నా మెయిల్ కు చాలా మంది పంపుతూనే వుంటారు .అందుతూనే వున్నాయి తిరిగి వచ్చినదను కుంటే gabbita.prasad @gmail .com కు మళ్ళీ పంపండి .లేఖిని నేను ప్రయత్నించాను .నాకు వీలు కాలేదు .తప్పులు దొర్లుతున్నాయి .మీ సూచన బాగుంది దుర్గా ప్రసాద్.

      Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.