విశ్వనాధ జాన్సన్ కు బాస్వేల్ శ్రీ మల్లంపల్లి శరభయ్య గారు –4
శరభయ్య గారి శేముషీ వైభవం
శ్రీ శరభయ్య గారు శ్రీ నాధుని ”కాశీ ఖండానికి ”విపుల మైన అర్ధ తాత్పర్యాలతో వ్యాఖ్యానం రాశారు .అది వారి శేముషికి పట్టం కట్టింది .శ్రీనాధుని కవితా వైభవాన్ని తెలుగు వారికి సాక్షాత్కరింప జేశారు .వారు ఉత్తమ భావుకులు కూడా .”హరివంశం ”పైన” సంవ్రుతి మాధురి” అనే శీర్షికన రాస్తూ కావ్యానుభావం గురించి ,కావ్య విమర్శ తో జోడించి ,చెప్పిన తీరు రమణీయం గా వుందని అందరు ప్రశంశించారు . వాస్త వాన్ని దాచ కుండా చెప్ప గల సమ వర్తి గా పేరు పొందిన విమర్శకులు .శైవ మతావ లంబనం నర నరాన జీర్ణించుకొన్న పరమ మాహేశ్వారులు .మంత్ర ద్రష్టలు .అను క్షణ అనుస్టాన పరులు .అయినా వీర శైవం ఎందుకు క్షీణించింది ?అన్న ప్రశ్న వేసుకొని ,”పాల్కురికి సోమనఅక్రుతక మాధుర్యం ”అనే వ్యాసం లో విపులం గా చర్చించారు .వారి మాటల్లోనే అందు లోని నిజాలు చూద్దాం –
”బసవేశ్వరుని మతం లో ,సంస్కారులు ,అసంస్కారులు ,అధికారులు ,అనాది కారులు ,వేల కొద్దీ చేరారు .బసవని ధర్మం ఆశిదారా వ్రతం లాగా ఆచరించాల్సిన ధర్మం .అది బసవేశ్వరుని వంటి మహా వ్యక్తులకే సాధ్యం .అది ఎప్పుడైతే సంఘ ధర్మం గా మారిందో ,కలుషిత మైంది .పూర్వ వైభవం కోల్పోయి ,క్షీణించింది .భక్తీ వ్యక్తీ నిష్టం .అది రాజా కీయ వాదం కాదు ”అని చక్క గా విశ్లేషించారు .అంటే వ్యక్తీ నిష్ఠ లో ఉండ వలసిన భక్తీ ,మతం ,విశ్వాసం సమాజానికి వర్తింప జేయాలను కొన్నారు .అది సంక్షోభం లోకి నెట్టింది .అయితె ,పాల్కురికి సోమ నాధుడు వీర శైవు డైనా ,ఇప్పటికీ ఆయన రచనలను ఎందుకు చదువు తున్నాం అంటే -కారణం ఆయన వాడిన జాను తెలుగు భాష యొక్క నిసర్గ రామ ణీయకం -మాధుర్య మైన పలుకుబడి .కావ్య ,శిల్పాల రీత్యా ,ఏనాటికీ ,చదవదగ్గ రచనే అని తేల్చి చెప్పారు .
ఆయన కావ్యం పై వెలువరించిన భావాలు మణి దీపాలు .”తాను పొందిన అనుభవాన్ని ,పాతకునిలో (paathakuni )వ్యక్తీకరించేందుకు ,వాక్కు రూపం గా చేసే ప్రయత్నమే కావ్యం .శ్రీ శరభయ్య గారు తాను పొందిన అనుభవాన్ని పాతకుని (paathakuni ) లో వ్యక్తీకరించేందుకు కావ్యాన్ని మీడియం గా తీసుకొని వ్యక్తీక రిస్తారు .
విశ్వ కవి రవీంద్ర నాద్ టాగూర్ లాంటి కావ్య మర్మము తెలిసిన వారు ఇచ్చే శిక్షణ నేటి యువ సమాజానికి అవసరం అంటారు శరభయ్య గారు .సారస్వతం యొక్క పరమ ప్రయోజనం అప్పుడే లభిస్తుందని వారి విశ్వాసం .రవీంద్రుడు భారత దేశ ఆత్మ ను అందుకొన్న వాడుఅని గర్వం గా చెప్పారు .దాని సంస్కార సర్వస్వాన్ని అవగాహన చేసుకొన్నా వాడు రవి కవి అన్నారు .ఆ ద్రుష్టి తోనే కాలిదాసాదుల కావ్యాలను పరిశీలించి వివరించాడని అంటారు .అందుచేత ఆయన చేసిన సాహితీ విమర్శ ఆ కవుల కావ్యాల కంటే గొప్పది గా వుంది అని శరభయ్య గారి భాష్యం .
దాదాపు తొంభై సంవత్స రాల వయసు లోను వారు నిత్య యవ్వనులు గ సాహితీ సమా వేశాలకు వెళ్ళే వారు .వారి దర్శనం రెండు మూడు సార్లు చేసిన ధన్యుడిని నేను .వారి కుమారుదు దుర్గయ్య గారు తండ్రికి తగ్గ గొప్ప పండితులు .
శరభయ్య గారికి ఆత్మీయుడు శ్రీ చెరుకు పల్లి జమదగ్ని శర్మ గారు .కృష్ణా జిల్లా ప్రాంతం వారే ,నూజివీడు లో వుండే వారు .ఈయనా విశ్వ నాద అంతే వాసి.ఈ .ఇద్దరికీ కవితా వేశం ఎక్కువే. కలిసే పద్యాలు రాసే వారు ,పాడే వారు .ఇద్దరు బ్లాక్ డైమండ్స్ .విశ్వనాధ దగ్గర చదివే వారు .చదవటం అంటే ,ఆయన తో కలిసి తిరగటమే .ఒక్క రోజూ పుస్తకం ముట్టిన పాపాన పోలేదట .ఈ మాట శరభయ్య గారు చెప్పిందే.వీరిద్దరికీ గురువు విశ్వ నాద చెప్పిన పద్యాలు వల్లే వేయటం తోనే ,కవిత్వం ,పాండిత్యం వచ్చేశాయి .అభ్యాసం చేసి సాధించినవి కావు .”జీవితం లో ,ఇంకో వ్యాసంగానికి పనికి రాకుండా విశ్వనాధ మహానుభావుడు ,మమ్మల్నందర్నీ ఇలా తయారు చేసి వదిలారు ”అని ఆనందం గా చెప్పారు శరభయ్య గారు .వీరితో పాటు తుమ్మపూడి వారు ,పాటిబండ్ల మాద వ శర్మ ,ధూళిపాల శ్రీ రామ మూర్తి ,పేరాల భారత శర్మ ,పొట్ల పల్లి సీతా రామ రావు ,మహంకాళి సుబ్బా రామయ్య ,గొర్తి జానకి రామ శర్మ ,జువ్వాది గౌతమేశ్వర రావు వున్నారు .,కాటూరి వెంకటేశ్వర రావు గారు విశ్వ నాద ను ”మంత్రమయ వాణీ -సత్యనారాయణా ”అని అత్యంత పవిత్ర భావం తో అన్నారు .ఆ మంత్ర మయ వాణే తమల్నందర్నీ విశ్వ నాద దగ్గరకు చేర్చింది అంటారు శరభయ్యాజీ .
జమదగ్ని శర్మ బందరు లో వుంటూ ”చిలకా -గోరింక ”అనే మొదటి కధ రాశారు .భారతి లో ఆయన కధలు వస్తుండేవి నేనూచాలా సార్లు ఆయన్ని చూశాను .కాలేజి లెక్చరర్ గా చాలా చోట్ల పని చేశారు .స్వగ్రామం నూజివీడు .”మహోదయం ”అనే గేయ సంపుటి 1957 లో వెలువరించారు .తన పద్యం లో శిల్పం లేదని ఆయన చెప్పు కొనే వారు .అయితె ”గ్రాంధిక శైలి లో కొబ్బరి నీళ్ళ వలె సాగే రచన ”అని మల్లంపల్లి వారు కితాబు ఇచ్చారు .”జమదగ్ని అన్నయ్యకు శరభయ్య తమ్ముడు” అని తమ సాన్నిహిత్యాన్ని వివరించారు శరభయ్య చాలా గొప్ప ఆత్మీయులు .జమదగ్ని ”దక్షిణ కైలాస గిరి ప్రదక్షిణ ”కావ్యం రాశారు . గారు .
జమ దగ్ని గొప్ప ఆతిదేయుడు అంటారు శరభయ్య గారు .విశ్వనాధ వీరిద్దరితో సరదాగా ”జమదగ్ని గృహస్తు నీవు – సన్యాసివి ”అని ఆట పట్టించే వారట .వీరంతా ఎప్పుడు నూజివీడు లోనే జమదగ్నికి ఆతిదేయులే .జమదగ్ని ప్రతి రోజూ తండ్రి గారి సంధ్యావందనాన్ని ముందు చేసి ,తారు వాత తనసంధ్యా వందనం చేసే వారని మల్లం పల్లి వారు చెప్పారు .ఇలా త్రికాలాల్లోనూ చేసే వారట .అంతటి నిష్టా పరులు. జమదగ్ని .పేరు ను సార్ధకంచేసుకున్న పుణ్య మూర్తి .”సాకారమైన గృహస్థ ధర్మం జమదగ్నిది .ఆయన ఇంట్లో భోజనం చేయటం అంటే ”,యజ్ఞం లో పురోడాశనం సేవించటమే ‘అంటారు . దానికి అత్యంత పవిత్రతను కల్పిస్తూ .అన్న జమదగ్ని,తమ్ముడు శరభయ్య గారి మీద ఒక మాంచి పద్యం రాశారు
”ఆత్మ రతు డయి ,నిశ్చలధ్యాన యోగ మౌని –నీ ఎద లోన గాపున్న శివుని
దలచి ,యోడలెల్ల పులకలై ,జలద రింప ”అని శరభయ్య గారి లోని పరమ శివ లక్షణాన్ని దర్శించిన మహా భావుక కవి జమ దగ్ని …స్నేహం అంటే అదీ .
తాను రాసిన పుస్తకానికి ”సహ్రుదయాభి శరణం ‘అని పేరు పెట్ట టం లోనే శరభయ్య గారి లోచూపు వుంది . .సహృదయులైన వారి వైపు తిరగటం ,అంటే వారి ఆకర్షణకు లోనవటం ..కొన్ని మొక్కలు సూర్యుడు ఏ వైపుంటే ఆవైపుకు తిరుగుతాయి .మొక్కల భాష లో దీన్ని ”సూర్యాభి శరణం ”అంటారు .ముఖ్యం గాపొద్దు తిరుగుడు పువ్వు దీనికి ఉదాహరణ సంస్కార వంతులైన సహృదయుల వైపుకు చేరటం సంస్కార లక్షణం .ఆ సల్లక్షణం పూర్తి గా నిండి వున్న వారు బ్రహ్మశ్రీ మల్లం పల్లి శరభేశ్వర శర్మ గారు .
ఈ విషయాలన్నీ నేను 19 -03 -2002 లో ఉయ్యూరు లో ”సాహితీ మండలి ”సమావేశం లో ఉపన్యాసం గా విని పించాను .దీన్ని శ్రీ మల్లమపల్లి వారికి అంకితమిస్తూ ,ధూర్జటి రాసిన ”కాళ హస్తీశ్వర శతకం ”లో,మకుటం అయిన” శ్రీ కాళ హస్తీశ్వరా ” అనే దానికి బదులు” శ్రీ మల్లంపల్లీశ్వరా ”అని మార్చి నా సహ్రుదయాభిసరణం తెలియ జేసు కొంటు,సెలవు తీసు కొంటున్నాను .
”జలకంబుల్ ,రసముల్ ,ప్రసూనములు ,వాచా బంధముల్ ,వాద్యముల్
కల శబ్ద ధ్వను ,లంచిత ,మలంకారంబు దీప్తుల్ ,మెరుం
గులు నైవేద్యము ,మాధురీ మహిమ గా ,గొల్తున్ నినున్ ,భక్తి రం
జిల ,దివ్యార్చన గూర్చి ,నేర్చిన క్రియన్ శ్రీ మల్లంపల్లీశ్వరా ”.
సమాప్తం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –02 -02 -12 .


Dear Mastaru, Thanks. A rich tribute to both. In writing about viswanadha, one should also give credit to the scribes who took dictation from viswanadha. One such person and a mentor to me was Chaturvedula Ramanarasimham, a gandhian in spirit and action and the scribe for Veyipadgalu. Viswanadha had a tremondous admiration for Ramanarasimham garu. Dont forget that most novels wrtten by Viswanadha were chapters from south indian history which ramanarasimham knew well. It was a time when geniuses ruled at SRR college. They left an indelible mark on me . It is a prvilege to offer a salute in their memory. We are the blessed ones. Premchand
LikeLike
నమస్కారాలు ప్రేమ చంద్ గారు -నిజం గా ఎస్ ఆర్ . ఆర్ .కాలేజి అంటే నే సమర్ధుల కాలేజి అన్న మాట మొదటి నుంచి వుంది .మీ కాలమ్ లో వున్న వారే మేము చదివినప్పుడు అంటే 1956 -60 లలో మేము చదివి నప్పుడు వుండటం మాకూ అదృష్టమే .విశ్వనాధ, జొన్నల గడ్డ ,లాజిక్ అన్నే వారు , ,దోమా వారు ,పాటి బండ్ల వారు ,రామ నరసింహం గారు,జటావల్లభుల వారు,అందరు అందరే cream of intelligence . ఇంతమంది హేమా హేమీలు ఒకే సారి ఒకే చోట వుండటం ఆకాలేజి చేసుకొన్నా ,విజయ వాడ చేసుకొన్నా అదృష్టం .అప్పుడు మనం వారి వద్ద చదువుకొనే మహద్భాగ్యం కలిగినందుకు మనం ధన్యులం .రామ నర సింహం గారు మాకు బంధువులే .ఆయన తెల్లటి పంచ కట్టు తెల్ల లాల్చి ముక్కు మాట ,ఆ వంకర తిరిగిన ముక్కు ,ఆ ఎరుపు రంగు నాకు ఇప్పటికీ గుర్తు వున్నాయి ,చరిత్రకు మహోదధి ఆయన .అలవోక గా అలా టాబుల్ ఈద బాసి పట్టు వేసుకొని ఏమీ చూడకుండా ఎంతటి విషానైనా చెప్పటం అమితాస్చర్యం గా వుండేది .ఆయన ఇంటికి ఒకటి రెండు సార్లు వెళ్ళిన గుర్తుంది .ఉయ్యాల బల్ల మీద ఊగుతూ వుండే వారు ఆ మరపు రాని రోజుల్ని గుర్తు చేసినందుకు ధన్య వాదాలు . దుర్గా ప్రసాద్
LikeLike