ఊసుల్లో ఉయ్యూరు –21 లలిత కళల ఇల్లు – వల్లూరు సంస్థానం

ఊసుల్లో ఉయ్యూరు –21

                            లలిత కళల  ఇల్లు  –  వల్లూరు సంస్థానం
సంగీతం ,నృత్యం ,చిత్రకళా ,చారిత్రిక  కావ్యాలు,ప్రబంధ రచనకు నిలయమైన సంస్థానం వల్లూరు .దీన్నే ”తోట్ల వల్లూరు ”అంటారు . మా ఉయ్యూరు కు అయిదు కిలో మీటర్ల దూరం లో కృష్ణా నది ఒడ్డున వుంది .అరవై గ్రామాలతో విలసిల్లింది .మచిలీ పట్నం విజయవాడ తాలూకా ల లోను ,పశ్చిమ గోదావరి లోని ఏలూరు తాలూకా లోను ఈ జమీందారి విస్తరించి వుంది .పచ్చని పంటలకు నిలయం .ఈ సంస్థానానికి వల్లూరే  రాజధాని .కృష్ణ కు తూర్పు గట్టున వుంది .కొబ్బరి ,మామిడి తోటలతో కళ కళ లాడుతూ వుండటం తో తోట్ల వల్లూరు అయింది .కొంత కాలమ్ నూజివీడు ,చల్లపల్లి జమీందారి లో వుంది .౧౯౦౦ లో అన్నదమ్ముల పంపకాల వల్ల ఉత్తర దక్షిణ వల్లూరు లు గా మారింది .పట్నాల వంశీకులైన బొమ్మ దేవర వంశం వారు వల్లూరు పాలకుఅలైనారు .200 ఏళ్ళు వీరి పాలన లో వుంది ఆ కాలమ్ లో నిర్మించ ఆడిన వేణు గోపాల స్వామి ఆలయం అప్పట్నించి ఇప్పటి వరకు భక్తులను ఆకర్షిస్తూనే వుంది .
సంస్థాన ఆవిర్భావం 
1750 లో బొమ్మదేవర నాగన ఆయుడు మొదటి జమీందార్ .ఈయన్ను ఎడ్ల నాగన్న అంటారు .వందలాది  జతల ఎడ్లున్దేవి .గోల్కొండ నవాబులకు అవసర మైన ఆహార పదార్ధాలను  ఎడ్ల బండ్ల మీద ,హైదరాబాద్ తీసుకొని వెళ్లి అంద జేసీ వాడు .నవాబుల ఆస్థానం లో వున ఉల్ల్లి పొట్టు నిలవ చేసే గదిలో బంగారం ,వజ్ర వైదూర్యాలు కనిపించాయి .ఈ విషయం నాగయ్య ,నవాబు దృష్టికి తీసుకొని వెళ్ళాడు. వాటి పై వ్యామోహం పడని నవాబు ,వాటిని నాగయ్యకే అందజేశాడు .ఆ అపార ధన రాశుల్ని ఎడ్ల బండ్ల మీదనే వల్లూరు తోలుకు వచ్చాడు   నాగయ్య .తొమ్మిది ఎకరాల స్థలం లో ఆ ధనం లో కొంత ఖర్చు చేసి కోట కట్టించాడు .
 బ్రిటిష్ వారి కాలమ్ లో కూడా   ,ఎడ్ల బండ్ల మీద నీరు సరఫరా చేశాడు .కలెక్టర్ ఇచ్చిన లీజు భూమి తవ్వు తుంటే బంగారం లభించింది .అది నాగయ్య కే చెందుతుందని కలెక్టర్ ప్రకటించాడు .దానితో పెద్ద జమీందార్ అయాడు నాగన్న .అతని సేవలకు మెచ్చి బ్రిటిష్ ప్రభుత్వం  ”బహదూర్” బిరుదు ప్రదానం చేసింది . జమ్మి చెట్టు వద్ద వున్న బావి లో వేణు గోపాల స్వామి విగ్రహం  లభించింది .నాగన్న నాయుడే దాన్ని ప్రతిష్టించాడని ,ఆలయం నిర్మించాడని తెలుస్తోంది .తర్వాత దక్షిణ దేశ యాత్ర చేసి ,అక్కడి గోపుర నిర్మాణానికి  ఆశ్చర్య పోయి, ఇక్కడ కూడా 90 అడుగుల ఎత్తున రాజ గోపురం ,ముఖ మండపం నిర్మించాడు .ఆళ్వారుల ప్రతిష్ట కూడా చేశాడు .అప్పటి నుంచి బొమ్మ దేవర వారి దే మొదటి పూజ .12 రోజులు కళ్యాణ ఉత్స వాలు నిర్వహింప జేశాడు .ఏనుగుఅంబారి   పై గోపాలస్వామి తో పాటు నాగన్న కూడా ఊరే గే వాడట .నాగన్న 1750 నుంచి 1808 వరకు వున్నాడు .1803 లో కోట కట్టించాడు .శ్రీ రంగ పట్నం యుద్ధం లో నాగన్న సేవలకు మెచ్చి బ్రిటిష్ ప్రభుత్వం ”రాజా  ”బిరుదు నిచ్చింది .౧౮౦౮ లో ఖమ్మం నుంచి తిరిగి వస్తు జబ్బు పది దారిలోనే మరణించాడట . .
     నాగన్న నాల్గవ కుమారుడు వెంకట నరసింహ నాయుడు తండ్రి చని పోయే  నాటికి మైనరు .తల్లి శేషమాంబ అతని తరఫున వ్యవహారాలూ చూసేది .నరసింహ నాయుడు కూడా ,తండ్రి లాగ కంపెని వారికి అణుకువ గా వున్నాడు .జమీని అన్ని విధాల అభి వృద్ధి చేశాడు .భార్య రాజ్య లక్ష్మి అని విధాల సహకరించింది .1829 లో నాయుడు మరణించాడు .కొడుకు ఇమ్మడి నాగన్న అప్పటికి అయిదేళ్ళ వాడు .నరసింహుని సోదరుడు వెంకయ్య నాయుడి భార్య వెంకమ్మ వ్యవహారాలూ చూసింది .దీనికి కారణం అతని తల్లి అంతకు ముందే మరణించటం .
  ఇమ్మడి నాయుడు కూడా తాత నాగన లానే వ్యవహార దక్షుడు .గోదావరి మండలం లోని వసంత వాడ ,కొప్పాక ,నారాయణ పురం దుద్దే పూడి ,ఎస్టేట్లను కోని జమీ ని  విస్తరించాడు .కొప్పాక లో వేణు గోపాల స్వామి దేవాలయం కట్టించాడు .వసంత వాడ లో వేంకటేశ్వరాలయం నిర్మించాడు .1857  లో సిపాయి తిరుగు బాటుగా పిలువ బడ్డ మొదటి స్వతంత్ర సంగ్రామం లో చాకచక్యం గా యుద్ధ సామగ్రి చేరా వేశాడు .ఆ నాటి బ్రిటిష్ రాని రౌద్ర నామ సంవత్స రామ్ లో ”భాసుర స్వర్ణ మయ బాహు పురియు ,రమ్య కాశ్మీర పట్టాంబర ద్వయము ”బహుమతి గా అంద జేసినట్లు ”చెన్న పురీ విలాసం ”లో వుంది .వేణుగోపాల స్వామికి అయిదు అంతస్తుల గాలి గోపురాన్ని నిర్మించాడు .స్వామికి భువసతి కల్పించాడు .1869 లో పెద్ద కొడుకు వెంకట నరసింహ నాయుడు రాజు అయాడు .ఇతను బ్రిటిష్ వారికి ఎడ్లను సరఫరా చేసి ”దిల్లీశ్వర ప్రసాద సమా సాదిత రాజ బహద్దర ”మొదలైన బిరుదులు పొందాడు .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -18 -02 -12 .

ఊసుల్లో ఉయ్యూరు –19 ఉయ్యూరు సంస్థానం-2

.ఊసుల్లో ఉయ్యూరు –18 ఉయ్యూరు సంస్థానం–1

ఊసుల్లో ఉయ్యూరు –17 సంగీతం టీచర్ పద్మావతి గారు

ఊసుల్లో ఉయ్యూరు –16 వీరమ్మ తల్లి చరిత్ర వీరమ్మ తల్లి తిరునాళ్ళు -3

క్రింద ఇంకొన్ని ఉసులు

ఊసుల్లో ఉయ్యూరు –12 చెవులు తుప్పు వదిలించే సంక్రాంతి మేళాలు

ఊసుల్లో ఉయ్యూరు –11 మహా’త్తరు’ సాయిబు

ఊసుల్లో ఉయ్యూరు —10 కాఫీ పా( ప్రా ) ణి ఏ కాని అపర పాణిని

ఊసుల్లో ఉయ్యూరు –9 ఆ ఇద్దరు -ఈ నలుగురు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in ఊసుల్లో ఉయ్యూరు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.