ప్రాచీన కాశీ నగరం –2
— అశోక చక్ర వర్తి కాశీ ని దర్శించాడు .సార నాద్ లోని అశోక స్తూపం ,అక్కడి శివ లింగం దగ్గరలోనే వుంది .దీన్ని ”శివ సంఘీశ్వరం ”అంటారు .
సంఘానికి అధిపతి అని అర్ధం .హిందువులు వారునా నది ని దాటి ఇక్కడికి వచ్చి ,ఈ శివున్ని పూజించే వారని ”కాశీ పరిశ్రమ ”అనే పుస్తకం లో జయన్నారాయన గోషాల్ రాశాడు .కనుక సార నాద్ శైవ క్షేత్రం కూడా .
గంగా నది పవిత్రత అందరికి తెలిసిందే .ఎన్ని ఏండ్లు నిలవా వున్నా ,ఆ జలానికి శూక్ష్మ జీవులు చెరక పోవటం ఒక గొప్ప ప్రత్యేకత .అక్బర్ చక్రాక్ వర్తి కూడా రోజూ గంగా జలాన్నే తాగే వాడని ”ఐనీ అక్బరీ ”లాంటి పుస్త కాలలో ఉందట .ఎక్కడికైనా ప్రయాణం అయితె వెంట జంగా జలం ఉండాల్సిందే నట .ఆగ్రా ,ఫతేపూర్ లలో వుంటే ,”సోరన్”నుంచి ,పంజాబ్ లో వుంటే ”హరిద్వార్ ”నుంచి గంగా జలం తెప్పించి తాగే వాడట .వంటలు చేయటానికి శుద్ధ వర్షపు నీటిని కాని ,లేక పొతే యమునా చీనాబ్ నదుల నీటికి గంగా జలం కలిపి ఉపయోగించే వాడట .గంగా జలాన్ని ”ప్రాణ మూలం ”(source of life )
అన్నాడు అక్బర్ భక్తీ పురస్సరం గా .అమరత్వ మిచ్చేదని (the water of immortality )అనే వాడట చక్ర వర్తి అక్బర్.కృష్ణ దేవ రాయలు కూడా కోనప్ప అనే వాడి ద్వారా గంగోదకం తెప్పిచి దానితో స్నానం చేసి పవిత్రుడయే వాడట .1446 ”తిరుమల మహా దేవ రాయల శాసనం ”లో ఈ విషయం వుంది ”కృష్ణ దేవ రాయ మహా రాయ రిగే గంగోదక సేవిత రప్ప -కోనప్ప నాయకరు ”అని శాసనం లో వుంది .
మొగలు ల కాలమ్ లోవచ్చిన (1656 -1668 ) ”బెర్నియర్”అనే యాత్రికుడు ”బెనారస్ నగరం హిందువులకు ఎథెన్స్ వంటిది ”అని వ్రాశాడు .శివుడు- పంచ ముఖాలున్న బ్రహ్మ శిరస్సులలో ఒక దాన్ని ఖండించి నపుడు అది ఇక్కడ పది అంతర్దానమైందని పురాణ కధనం .ఈ విషయాన్ని ఘజనీ మహమ్మద్ తో వచ్చిన ”ఆల్బరూని ”రాశాడు .మకర వాహనం పై వచ్చిన గంగా మాత ఇక్కడ విగ్రహమిందని ఇతిహ్యం .
రాం నగర్ అనే కాశి సంస్థానం గంగా నది కి కుడి ఒడ్డున వుంది .1730 లో మహా రాజు ”మన్స రాం ”కాశీ రాజా వంశం లో మొదటి రాజు .1750 లో కొడుకు బలవత సింగ్ కోటను కట్టించాడు .చివరి రాజు” విభూతి నారాయణ సింగ్ ”
కాశీ కోట లో వెద వ్యాస మహర్షి ఆలయం వుంది .ఈ ప్రాంతాన్ని వ్యాస కాశి అనీ అంటారు .ఆయుధ ,అతిధి శాలలు ,గ్రంధాలయం కోట లో వున్నాయి .గంగా దేవి ఆలయం ,మహాదేవాలయం వున్నాయి .ఆశీ రాజు కోటను ”రాం బాగ్ ”అంటారు
.భారత దేశ రెండవ ప్రధాన మంత్రి లాల్ బహ దూర్ శాస్త్రి గారు నివశించిన ప్రదేశమే ఇది .ఆయన ఇల్లు ఇక్కడే వుంది .రోజూ నెత్తి మీద పుస్తకాలు పెట్టు కొని అక్కడి నుంచి గంగా నది ఈదుకొంటు కాశి వచ్చిచదువు కొని, మళ్ళీ సాయంత్రం ఈదుకొంటు వ్యాస కాశి చేరే వాడు . వ్యాస మహర్షిని విశ్వనాధుడు కాశీని వదిలి పొమ్మని శపిస్తే ,ఇక్కడికి చేరి వున్నాడు .అందుకే వ్యాస కాశి అయింది
.వ్యాస కాశి లో చని పొతే ”గాడిద ”గా జన్మిస్తారని పార్వతీ దేవి ప్రతి శాపం ఇచ్చింది వ్యాసుడు శపించిన దానికి ప్రతిగా .మాఘ మాస ఉత్సవాలు ఘనం గా జరుగు తాయి .ఆ ఉత్స వాలను చూస్తె గాడిద పుట్టుక ఉండదని పార్వతీ దేవి శాప విమోచనం చెప్పింది .
గౌతమ బుద్ధుడు రంగ ప్రవేశం చేసే సరికి కాశీ తన పూర్వ వైభవం అంతా కోల్పోయింది .కాశీ రాజు ”కి కి ”తో బుద్ధుడు వారణాసి లోని ”రుషి పతన మృగ దానం ”లో ఉన్న ”విహారం ”లో సంవాదం చేసి నట్లు బౌద్ధ గ్రందాల లో వుంది .ఇక్కడున్న ”ఘటి కార ”అనే కుమ్మరి ని బుద్ధుడు ప్రశంశించి నట్లు వుంది .
పెండ్లి రోజున వధువు కు తండ్రి ”స్నాన చూర్ణ మూల్యం ”(BATH POWDER MONEY )అని కొంత పోలమో ,డబ్బో ,నగలో ఇచ్చే వారు అని జాతక కధల్లో వ్యాఖ్యానాలలో వుంది .ఇప్పుడు అదే” పసుపు -కుంకుమ” పేరా కూతురికి ఇచ్చే పధ్ధతి గా మారి వుంటుంది .ప్రసేన జిత్తు తండ్రి ”మహా కోసల ”అనే వాడు కోసల దేశాది పతి .ఆయన తన కుమార్తె ”కోసల దేవి ”ని మగధ రాజు బింబి సారుని కి ఇచ్చి వివాహం చేసే సందర్భం లో ,కాశీ మండలం లోని ఒక గ్రామాన్ని ”స్నాన చూర్ణ మూల్యం ”గా ఇచ్చి నట్లు వుంది .ప్రసేన జిత్తు కుమార్తె ”వజీర ”ను అజాత శత్రువు కిచ్చి స్నాన చూర్ణ మూల్యం ”గా కాశీ గ్రామం ఇచ్చాడని”
ధర్మ పాద వ్యాఖ్య” లో వుంది .కాశి వర్తకుని కూతురు ”అద్ద కాశి ”అనే భిక్షుని ధర్మం బాగా తెలిసిన స్త్రీ గా ప్రసిద్ధిచెందింది .”మిలిందుడు ”(మీనాన్ దర్ )అనే గ్రీకు రాజు ,నాగ సేన అనే బౌద్ధ భిక్షువు తో సంవాదంచేసి నట్లు ”మిళింద పన్హా ”అనే క్రీ.పూ.110 నాటి గ్రంధం లో వుంది .శీలం మీద శ్రద్ధ వుంటే ,నిర్వాణం పొంద వచ్చు నని కాశీ లో వున్నా ,గాంధారం లో వున్నా,శీలం లేక పోతే నిర్వాణం రాదనీ ఆయన మిలిండుడికి బోధించాడట .
ఈ పుస్తకం లోనే ”బిందు మతి ”అనే వేశ్య తన సత్య బలం తో గంగా నదిని ఎదురు ప్రవహించేటట్లు చేసి చూపిందని ,గంగా నది పొడవు 500 యోజ నాలు ,వెడల్పు ఒక యోజనం అని వర్ణింప బడిందట .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –26 -02 -12 .


ప్రస్తుతం బ్రహ్మ చతుర్ముఖుడని(చతురాననుడని) మనవారి విశ్వాసం.కాని ఆయనకూడా ఒకప్పుడు
శివుడి వలె పంచముఖుడేనట.ఓ సారి త్రిమూర్తులు కొలువుదీరి ఉండగా పార్వతి అక్కడికి వచ్చిందట.
ఆమె శివుడినీ బ్రహ్మనూ చూసి వారిరువురిలో తన భర్త శివుడు ఎవరో గుర్తించేందుకు కొంత తికమక పడిందట.ఇది గమనించిన శివుడు ఆమెకు కనుసైగ చేశాడట. దాంతో ఆమె అతడిని గుర్తించి సరసకు చేరిందట.శివుడు తన భార్యకు సైతం ఇంతగా భ్రమ కలగడానికి కారణం బ్రహ్మకు కూడా ఐదు తలలు ఉండడమే కదా- అని ఎంచి తక్షణం తన త్రిశూలంతో బ్రహ్మ ఐదు తలల్లో ఒక దాన్ని ఖండించాడట. బ్రహ్మ కోపించి ‘నువ్వు కాపాలికత్వం పొంది భిక్షాటనం చేస్తావుగాక’ అని శివుడిని శపించాడట.ఆ రోజునుంచీ శివుడు ఆ ఆదిబ్రహ్మ కపాలాన్ని మెడలో ధరిస్తూ ఆదిభిక్షువయ్యాడట.అందుకే మన ప్రాచీన సాహిత్యం శివుడిని ‘ఆది బ్రహ్మ కపాల భూషణుడు'(ప్రాచీన బ్రహ్మ యొక్క కపాలం ధరించేవాడు) అని కూడా వ్యవహరిస్తుంది.విష్ణువు సలహా మేరకు శివుడు తీర్థయాత్రలు చేసి,చివరికి కాశికి చేరి ఆ క్షేత్ర మహిమ కారణంగా బ్రహ్మహత్యా పాతకాన్నుంచి విముక్తి పొందాడట.కనుక మీరు పేర్కొన్నట్లు ‘శివుడిచే ఖండించబడిన ఆది బ్రహ్మ ఐదవ శిరస్సు కాశిలో పడి అంతర్ధానం అవడం సరికాదు.దాన్ని శివుడు ధరించిన కారణంగానే అతడు ‘ఆది బ్రహ్మ కపాల భూషణుడు’ అనబడ్డాడని పురాణాలు పేర్కొన్నాయి.ఒక్కో పురాణంలో ఒక్కో విధంగా ఉండే కారణంగానే విజ్ఞులు వాటిని పుక్కిటి పురాణాలు అన్నారు.శాస్త్రీయ దృష్టి ఉన్నవారెవ్వరూ వాటిని సత్యాలని నమ్మరు.
కాశి అంటే మిగిలిన అర్థాలతోబాటు ‘విభవం’ అనే అర్థం కూడా ఉంది.అత్యంత వైభవోపేతమైన
నగరం కనుకనే కాశికి ఆ పేరు సార్థకం అయింది.అది ఏడు పరమ పవిత్ర నగరాలలో ఒకటట.
వరణ,అసి అనే రెండు నదుల మధ్య ఉన్నందునే కాశిని ‘వరణసి’అన్నారు.అదే క్రమంగా
‘వారణాసి’గా రూపాంతరం చెందింది.’వరణ’ అంటే సంస్కృతంలో ‘చుట్టుముట్టినది’,’ఆవరించినది’అని అర్థం.
పేరుకు తగ్గట్టే ఆ నది కాశికి మూడు పక్కలా ఆవరించి ఉంటుంది.’అసి’అంటే పదునైన కత్తిలా- కోసేటంత
ప్రవాహ వేగం కల నది అయినందున మరో నదికి ఆ పేరు వచ్చింది.’అసి’ నది కాశికి దక్షిణ దిశగా ప్రవహిస్తుంది.
స్నాన చూర్ణ మూల్యమే అనంతర కాలంలో వధువు తండ్రి వధువుకు ఇస్తున్న ‘పసుపు కుంకుమల’ మూల్యంగా వ్యవహరించబడుతున్నదనే మీ విశ్లేషణ బాగుంది.
మిళిందుడనే ఇండో-గ్రీకు రాజు నాగసేనుడనే బౌద్ధ భిక్షువు ప్రభావంతో బౌద్ధ మతం
స్వీకరిస్తాడు.గురువైన నాగసేనుడిని శిష్యుడు మిళిందుడు అడిగిన ప్రశ్నలూ, వాటికి నాగసేనుడిచ్చిన
సమాధానాలు బౌద్ధమత సారాన్ని చదువరులకు చక్కగా వివరిస్తాయి.ఇవే ‘మిళింద పన్హా'(మిళిందుడి
ప్రశ్నలు) పేరిట ఓ ఉద్గ్రంథం అయ్యాయి.
శ్రీ కృష్ణ దేవరాయలు అరవైయేళ్ళు నిండిన వయస్సులో క్రీ.శ.1530 లో మరణించాడని హెచ్చుమంది చరిత్రకారుల అభిప్రాయం.బహుశా మరొక పదో, పదిహేను ఏళ్ళు ఇంకా పైబడిన తరవాత మరణించినా మరణించి ఉండవచ్చు.మరణించిన సంవత్సరం మాత్రం క్రీ.శ.1530 అని
ధృవపడింది.ఈ లెక్కన క్రీ.శ.1446 నాటికింకా ఆయన పుట్టి ఉండడు. ఒకవేళ రాయలు అప్పటికే పుట్టాడనుకున్నా, కోనప్ప చేత ఏ మహామంత్రి తిమ్మరుసో క్రీ .శ .1446 లో రాయల మొదటి పుట్టినరోజు సందర్భంగా గంగోదకం తెప్పించి స్నానం చేయింఛి ఉండాలి.క్రీ.శ.1445 లోనే రాయలు పుట్టాడని అనుకుంటే క్రీ.శ.1530 లో చనిపోయే నాటికి ఆయన ఎనభై ఐదేళ్ళ వాడవుతాడు.శాసనం వేయించినట్లు మీరు పేర్కొన్న తిరుమలదేవ మహారాయలు రాయలవారి కుమారుడే. అతడు ఆరేళ్ళ వయస్సులోనే మరణించాడు. ఈ శాసనం సంవత్సరం ఏ పరిస్థితులలో మీరు పేర్కొన్నట్లు క్రీ.శ.1446 కావడానికి వీలేలేదు. దయచేసి మూలాన్ని ఒకసారి పునః పరిశీలన చేయగోర్తాను.నేనూ ఆ శాసనమేమిటో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేస్తాను.
LikeLike
http://blaagadistaa.blogspot.com/2011/08/blog-post.html
మిళిందపన్హా గురించి నా బ్లాగులో చిన్న పరిచయం వ్రాశాను. నచ్చితే చూడగలరు.
LikeLike