అమెరికా ఊసులు –20 గ్లోబల్ వార్మింగ్ కు భయపడక్కర్లేదా ?
అక్కరలేదనే ”గ్లోబును గుద్ది ”మరీ చెబుతున్నారు Hunts ville లో ని యూని వేర్సిటి ఆఫ్ అలబామా principal research scientist రాయ్ స్పెంసేర్ .ఆయన అనేక రిసెర్చి ప్రాజెక్టులను నిర్వహించారు .విస్కాన్సిన్ వర్సిటి నుండి meteorology లో ph.d.పొందారాయన .నాసా సంస్థ కు సీనియర్ సైంటిస్ట గా పని చేశారు .అంతే కాక అడ్వాన్సెడ్ మైక్రో వేవ్ స్కాన్నింగ్ రేడియో మీటర్ (నాసా )లో సైన్స్ బృందానికి నాయకుడు గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది .కనుక ఆయన మాటలకు విలువ ఉంటుంది .ఇంతకీ ఆయనేమి చెప్పారో సూక్ష్మం గా చూద్దాం .
గ్లోబల్ వార్మింగ్ వల్ల శీతోష్ణ స్తితుల్లో మార్పులు వస్తాయని అందరం భావిస్తాం .ఆ నమ్మకం కూడా ఇటీవలి అనేక విషయాల వల్ల ఎక్కు వింది . .ఏది జరిగినా దానికే ముడి పెడుతున్నాం .కనుక మన భయం పోవాలి అంటే వాతా వరణం అంటే ఏమిటి ?శీతోష్ణ స్థితి అంటే ఏమిటి ? ఈ రెంటికి ఉన్న సంబంధం ఎలా ఉంది ?అని తెలుసు కోవాలి .శీతోష్ణ స్తితి అంటే ఒక నిర్దుష్ట ప్రాంతం లో ,నిర్దుష్ట సమయ కాలం లో ఉండే సరాసరి వాతా వరణం .లేక పోతే భూమి పై చాలా కాలం గా ఉన్న సరాసరి ఉష్ణోగ్రత .మొత్తం మీద శీతోష్ణ స్తితి లేక క్లైమేట్ అంటే సరాసరి వాతా వరణం అని అనుకో వచ్చు .వాతా వరణం అంటే గాలి లోని తేమ ,ఉష్ణోగ్రత ,గాలి మొదలైన అంశాలు అని మనకు తెలుసు .
జనం లో బాగా భయం కల్గిస్తున్నవి ”గ్రీన్ హౌస్ వాయువులు ”.వీటి వల్లే గ్లోబల్ వార్మింగ్ పెరుగుతోందనే భయం .ఇంతకీ ఆ వాయువులు ఏవి ?అంటే వాతా వరణం లోని వాయువులే .అవి బాగా ఇన్ఫ్రా రెడ్ కిరణాలశక్తిని పీల్చగలిగేవి .మంచు ప్రతి చోటా ఉంటుంది .భూమి వాతావరణం లో ని గ్రీన్హౌస్ గాస్ లు అంటే గాలిలోని నీటి ఆవిరి ,కార్బన్ డై ఆక్సైడ్ మరియు మిథేన్ .అంతే కాదు మేఘాలు గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ను బాగా కల్గిస్తాయి .కాని మేఘాలు మాత్రం గ్రీన్ హౌస్ వాయువు లని పిలువ బడవు కారణం అవి వాయువులు కావుకనుక . గ్రీన్ హౌస్ వాయువులు ఒక దుప్పటి లాగా కప్పి భూమి దగ్గర గా ఉన్న వాతా వరనాన్ని వేడిగా ఉంచుతాయి .కాని పైన ఉన్న పొరలను చల్లగా ఉంచుతాయి అంటే మన దుప్పటి లాగా పని చేస్తాయి అని అర్ధం .లోపల వెచ్చగా ఉంచి బయట చల్లగా ఉంచుతాయి గ్రీన్ హౌస్ వాయువులు .గ్రీన్ హౌస్ గాస్ ను ”రేడియో ఆక్టివ్ బ్లాంకెట్ ”అన వచ్చు .మనకు ఉన్న వాతా వరణం గ్రీన్ హౌస్ ప్రభావం వల్లనే అన్న సంగతి మాత్రం మనం మర్చి పోతున్నాం .
భూమి ఉపరితల ఉష్ణోగ్రత సరాసరి 140ఫారన్ హీట్ డిగ్రీలు .జెట్ విమానాలు ప్రయాణం చేసే ఎత్తైన ప్రాంతం లో చాలా చల్లగా ఉండి,ఇంధనం ”జెల్ ”లాగా మారిపోతుంది ..కనుక ఈ140డిగ్రీలే గ్రీన్ హౌస్ ఉష్ణోగ్రత అంటారు .ఇదే మన వాతా వరణాన్ని గురించి చెప్ప టానికి వీలయిన స్థానం .ఇక్కడి నుంచే దేన్నైనా మనం ప్రారంభించి తెలుసు కోవాలి .సోలార్ మరియు ఇన్ఫ్రా రెడ్ రేడి యేషన్ల కలయిక భూ ఉపరితలాన్ని విపరీతం గా వేడిగా ఉంచటానికి ప్రయత్నిస్తుంది .కాని ఆ నిర్దిష్ట ఉష్ణోగ్రతకు చేర టానికి ముందే ఉష్ణ సంవహనం వల్ల (కన్వేక్షన్ ) ఆస్థిరం గ ఉంటుంది .అప్పుడు వేడి గాలి పైకి వెళ్లి ,చల్లని గాలి కిందికి దిగుతుంది .దీని వల్ల ఎక్కువ గా ఉన్న వేడి పై పైకివాతా వరం లోకి పోతుంది .ఇదంతా మనకు ప్రమేయం లేకుండా జరిగి పోయే నిరంతర ప్రక్రియ .బాగా గమనిస్తే వాతా వరణం లోని చల్ల దనపు ప్రభావం గ్రీన్ హౌస్ వాయువుల వేడి ప్రభావం కంటే చాలా ఎక్కువ గానే ఉంటుంది .కనుక గ్లోబల్ వార్మింగ్ భయం అనేది లేదుఅంటారు రాయ్ స్పెన్సర్ .
గ్లోబల్ వార్మింగ్ వల్ల ఏదో ఉపద్రవం వస్తుందనేది అసంబద్ధం .దానికి సైంటిఫిక్ విలువ లేదు .ఇలా భయ పెట్టి అనేక సంస్తలు లాభాలు గడిస్తున్నాయని రాయ్ ఆరోపించారు కూడా .గ్రీన్ హౌస్ వాయువులప్రభావం వల్ల భూమివేడిబాగా పొందుతుంది అనేది అంత నమ్మ దగిన విషయం కాదు .కారణం ,వాతా వరణం ఎప్పుడూ భూమిని చల్ల గానే ఉంచే ప్రయత్నం చేస్తూనే ఉంటుంది .భూమికి ఉన్న సహజ గ్రీన్ ఔస్ వాయువులే దాన్ని కావాల్సినంత వేడిలో ఉంచుతాయి .నీటి ఆవిరి తో పుష్కలం గా ఉన్న సహజ గ్రీన్ హౌస్ వాయువులు సహజం గా ప్రభావం చూపిస్తూ నియంత్రణ చేస్తూనే ఉంటాయి .ఉదాహరణకు భూమి పై ఉన్న సహజ గ్రీన్ హౌస్ వాయువైన నీటి ఆవిరి నే తీసుకొందాం .సూర్యుని వేడికి భూమి పై ఉన్నజ లాశాయాల లోని నీరు ఆవిరి అయి, గాలిలోకి చేరుతుంది .కాని వాతా వరణం దీనిని అంతటిని గ్రహించి తనలో నింపు కోదు. అని మనకు తెలిసిన విషయమే .ప్రకృతి దాన్ని కావలసిన మేరకు చేర్చుకుంటుంది .దానితో గ్రీన్ హౌస్ వాయువులు పారి పోయి, ప్రభావం చూప లేవు .ఇది సహజ ప్రక్రియే .దీనికి కారణం నీటి ఆవిరి ని వాతా వరణప్రక్రియే నియంత్రిస్తుంది .ప్రమాద ఘంటికలను మోగించ కుండా .దీనినే అవక్షేప చర్య లేక (ప్రిసిపి టేషన్ ) అంటారు .ఈ అవక్షేప చర్య నే సహజ దేర్మో స్టాట్ అంటారు .ఎంత నీటి ఆవిరిని వాతా వరణం లో ఉంచాలో అంతటిని ఉంచుతుంది .దానితో భూమి పై గ్రీన్ హౌస్ ప్రభావాన్ని నియంత్రిస్తుంది .
మేఘాల విషయమే తీసుకొందాం . ఇదే భూమి పై గల మరో సహజ గ్రీన్ హౌస్ గాస్ వాయువు .ఇదే భూమికి చేరే సూర్య కాంతిని మళ్ళీ ఔటర్ స్పేస్ లోకి పరావర్తనం గా నెట్టివేస్తుంది .చాలా మంది శాస్త్ర వేత్త్తలు దీన్ని గమనించకుండా భయ పెట్టు తున్నారు .ప్రిసిపిటేషన్ చెందని అతి దూరం లో ఉన్న మేఘాలు కూడా ప్రిసిపి టేషన్ ప్రాసెస్ నియంత్రణ లోనే ఉంటాయి .కనుక ఏతా వాతా తేలింది ఏమిటి అంటే భూమి మీద ఉండే శీతోష్ణ స్తితిపై ప్రభావంచూపి చాలా ఎక్కువ భాగం నియంత్రించే ఏకైన ప్రక్రియ ప్రిసిపి టేషన్ ప్రక్రియ మాత్రమె . .దీన్ని కంట్రోల్ చేయటం అంటే దేర్మో స్టాట్ లా గా పని చేయటమే .ఇదేసహాజ దేర్మో స్టాట్ .ఒక వేళ భూమి చాలా వేడేక్కితే, ప్రిసిపిటేషన్ ప్రక్రియ దాన్ని వెంటనే చల్ల బరుస్తుంది .ఒక వేళ భూమి బాగా చల్ల బడి పోతే ,ఈ విధానాలు మళ్ళీ వేడిని చెందించే ప్రక్రియలు చేస్తాయి .మన ఇళ్ళల్లో ఉండే ఉష్ణ నియంత్రణ వ్యవస్థ అంటే దేర్మోస్తాట్ వ్యవస్థ సంక్లిష్టం గా ఉంటుంది .దీన్ని అర్ధం చేసుకొంటే వాతా వరణం లోని వేడిని నియంత్రించే ఇప్పటి దాకా చెప్పుకొన్న దేర్మో స్టాట్ వ్యవస్థ బాగా అర్ధమవుతుంది .
అయితే గ్లోబల్ వార్మింగ్ ను తగ్గించే ప్రయత్నాలు బానే వచ్చాయి .ప్రత్యామ్నాయ ఇంధనాలను కని పెట్టి ఉప యోగిస్తున్నారు .న్యూక్లియర్ విద్యుత్తు ,సౌర విద్యుత్తు అంత తక్కువ ఖరీదు లో వచ్చేవి కావు అని తెలుస్తోంది .అందులో మొదటిది చాలా ప్రమాద కర మైనది కూడా .ఉన్న వనరులను నియంత్రణ లో వాడుకొని, భవిష్యత్తు తరాలకు మిగిల్చాల్సిన బాధ్యత మన మీదేఉంది . .మనమే కర్తా భోక్తా అని మరువ రాదు . ఊరికే గ్లోబల్ వార్మింగ్ అంటూ గుండెలు బాదుకోవద్దని ,ప్రకృతి లోనే నియంత్రణ సాధనం ఉందని నమ్మకం గా తెలియ జేశారు శాస్త్ర వేత్త రాయ్ డబ్ల్యు .స్పెంసేర్ .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –9-9-12-కాంప్–అమెరికా
వీక్షకులు
- 1,107,615 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.2 వ భాగం.23.12.25.
- శ్రీ ఆర్ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.4 వ భాగం.23.12.25
- యాజ్ఞవల్క్య గీతా.9 వ భాగం.23.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.72 వ భాగం.23.12.25.
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.1 వ భాగం.22.12.25.
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.3 వ భాగం.22.12.25.
- యాజ్ఞవల్క్య గీతా.8 వ భాగం.22.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.71 వ భాగం.22.12.25
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.2 వ భాగం.21.12.25.
- శ్రీ వసంతరావు వెంకటరావు గారి విజ్ఞాన వాస0త గీతాలు.1 వ చివరి భాగం.21.12.25.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,551)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు

