హాస్యపుసుత్తికి పట్టం కట్టిన వేలు
ఈగ ఇల్లలుకుతూ తన పేరు మరిచి పోయి నట్లు సుత్తి వేలు గా తన పేరు మారటం తో కురుమద్దాలి లక్ష్మీ నర సింహా రావు తన పేరు ఎప్పుడో మరిచి పోయి ఉంటాడు . జంధ్యాల వెతికి పట్టు కొన్న నట ముత్యాలు ఆయన .,వీర భద్ర రావు కూడా .జంధ్యాల మావటి గా వీరిద్దరూ సుత్తిని హాస్యపు ”హత్తి ”(ఎనుగు )పై కూర్చుని ఊరేగించారు .వేలు సన్నగా వేలంతటి వాడు గా ఉండి ఆ పేరు కు చిన్నప్పుడు సార్ధకం చేస్తే, స్టేజి నాటకాల తో తన ప్రతిభను నిరూపించుకొని హాస్య బ్రహ్మ దృష్టిలో పడి తెలుగు హాస్యాన్ని పూల రధం లో ఊరేగించిన వారిలో ఒకడయ్యాడు వీరభద్రుడితో . జంట పండించిన అర్ధ శత సినిమాలే దీనికి నిలు వెత్తు సాక్షి . గ్రామ్యమైనా ,బ్రాహ్మణ్య మైనా ఆ మాటలను వారి హృదయాల నుండి వచ్చి నట్లు చెప్ప గల మహా గొప్ప నటుడు వేలు .సంఘర్షణ లో అతని సీరియస్ నటన కల కాలం గుర్తు పోయేది .సదా చార సంపన్నుడిగా వేసినా ,విల విల లాడే తండ్రి గా వేసినా, నాటి రాజరికపు పోజు పోనీ మాజీ రాజు గా చేసినా,చిరు చంటబ్బాయికి చిరు నిక్కర్ తో పెద్ద పోడు గాటి అసిస్టంట్ గా వేసినా అతని మార్కు అతనిదే .ముక్కు తో మాట్లాడి హాస్యాన్ని మన ముక్కు పిండి,నవ్వింప జేస్తాడు .అతని డైలాగ్ డెలివరీ యే ఒక ప్రత్యెక స్కూల్ ని పిస్తుంది . . పాత్రలో ఒదిగి పోవటం పాత్ర స్వభావాన్ని పూర్తీ గా ఆవిష్క రింప జేయటం వేలు ప్రత్యేకత వేలేడంతటి వాడు అతి వేలమై పోతాడు నట
నలో .
జంధ్యాల మార్కు సినిమా లకు వేలు అదనపు ఆకర్షణ .అతను లేక పోతే ఏదో తెలీని వెలితి గోచరిస్తుంది .పరి పక్వ మైన నటుడు అలానే మనల్ని ఆ కట్టు కొంటాడు .ఆయన పంచె షర్టూ వేసినా గోచి పెట్టి తిరిగినా, కోటూ సూటు వేసినా ,లాయరైనా ,దళారి అయినా, తండ్రి అయినా ,తాత అయినా ,పూజారి అయినా ,పండితుడైనా ఆ పాత్రకు ఒక స్వంత వ్యక్తిత్వం ఉండేట్లు చేస్తాడు .వేలు చిందించిన నవ్వుల పువ్వులు వేలకు వేలు .అవి సువర్ణ పుష్పాలు .అతను జాలు వార్చిన నవ్వులు పొదరిల్లు లై ఆహ్లాదం చేకూరుస్తాయి .నిరంతరం హాస్యపు జల్లు వేలు అనచ్చు .సినిమా లలో రాణించి బుల్లి తెరకూ రాణ తెచ్చాడు .డిటెక్టివ్ కధల్లో అతని అడుగడుగు చమత్కారానికి పరవశిస్తాం .పళ్ళు కొంచెం బయట పెట్టి ఆయన నవ్వే నవ్వు చిదానందమే .చెణుకులు రువ్వటం లో వేలు అందే వేసిన చెయ్యి .వేలు ఉంటె చాలు అన్న సినిమాలు చాలానే ఉన్నాయి .అంత గుర్తింపు పొందిన నవ్వులపువ్వుల రేడు వేలు .
భ.రా .గో.కధలకు జీవం వేలు
ఇవన్నీ ఒక ఎత్తు అయితే భమిడి పాటి రామ గోపాలం గారి కధలకు వేలు చేసిన పాత్రలు నవ్వే కాక ,విషయ పరిజ్ఞానాన్ని , లోక వృత్తినీ, కవితా మర్మాలను ,డాంబిక ప్రవృత్తిని ,సన్మానాలు అందుకోవాలన్న వారి” తీటను ”బయటను బయట పడేయటం లో వేలుచూపిన హావ భావాలు చిరస్మరనీయాలు .అతని కతనే సాటి అని చాటి చెప్పే ధారా వాహికాలు .భ.రా.గో.రాయటం ఒక ఎత్తు అయితే , వేలు ఆ పాత్రకు అంటే భరాగో కు జీవం పోసి నటించటం ఒక ఎత్తు .రెండూ పోటా పోటీ గా సాగి ఎన్ని సార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలని పించేటట్లుఉంటాయి . నా ఉద్దేశలో తో ఈ కధలు చాలు వేలును చిరంజీవిని చేయ టానికి . అతని నట విశ్వ రూపాన్ని దర్శించటానికి ఇవి హై లైట్లే .హాస్యం లో ఎంత ఎట్టు కు ఎదిగాడో సాత్వికాభినయం లోను వేలు అంతే ఎత్తున నిల బదాడని చెప్పే సీరియల్సు ఇవి .ఇక్కడ దర్శకుని ప్రతిభనూ మనం మెచ్చు కోవాలి .వేలు లోని నట నను అన్ని కొనాల లోనుంచి రాబట్టే అద్భుత ప్రయోగం ఈ ధారా వాహిక .హాట్స్ ఆఫ్ భరాగో మరియు వేలు .ఇద్దరు స్వర్గ స్తు లైనారు . కాని తెలుగు హాస్యాన్ని స్వర్గపు సుధర్మ లో పంచి పెట్ట టానికి వెళ్లారని భావిద్దాం .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –17-9-12-కాంప్–అమెరికా

