చవితి చేష్టలు
తెల్లా రిందో లేదో మా బామ్మర్ది యోగా నందం ఫోన్ చేసి పెట్టేశాడు .మేం అమెరికా లో ఉన్నాం కదా .ఇక్కడి నుంచి మేం ఫోన్ చేస్తే వాడికి పైసా ఖర్చు లేదు కదా ఆ రహస్యం తెలిసి పొద్దున్నే మేల్కొన్నట్లున్నాడు .ఏదో పండగ కబుర్లు తెలుసు కొందామని వాడి ఆరాటం .అమెరికా లో వినాయక చవితి అంటే యెట్లా ఉంటుందో నని వాడి అనుమానం .వినాయకుడి విగ్రహాలు దొరుకు తాయో లేదో పత్రికి ఏం తంటాలు పడాలో నని భయం వాడికి .భాక్షాలు లేహ్యాలూ చోశ్యాలు లుఎలా అని మరీ సందేహం ..సరే నేనే ఫోన్ చేశా .గోతి కింద కాచుక్కూచుంటాడు కదా ఆలస్యం చేయకుండా ఎత్తాడు ”.ఏమిట్రా విశేషాలన్నాను” .”బావా నువ్వు కనీసం పండగ శుభా కాంక్షలు చెప్ప క పోయినా నాకు తప్పదు కదా. బావా వినాయక చవితి శుభా కాంక్షలు అన్నాడు .”మీ అందరికీ కూడా ”అన్నా ముక్త సరిగా .”అక్కడ పండగ యెట్లా చేసుకొంటారు ?”అని వాడి తిరుగు టపా ప్రశ్న .”మామూలుగానే .పిల్లలు స్కూల్ కు వెళ్ళే ముందు లఘువు గా చేసి ఆ తర్వాతా తీరిగ్గా అసలు పూజ చేస్తాము ”అన్నాను .”’సరే -పండగ స్పెశాల్సేమిటి “?అని మళ్ళీ లకోటా .” ఏముందిరా ‘ ఉండ్రాళ్ళు పరవాన్నం ,పులిహోర మామూలే ”అన్నాను .”’ఇవి ఇంట్లో చేస్తారా ?ఎక్కడ్నించి అయినా పార్సిల్ తెప్పిస్తారా ?”వాడి చవట ప్రశ్న.”ఒరే ! మన దేశం లో ఎలా చేస్తారో ఇక్కడా అంత కంటే శ్రద్ధగానే చేస్తారు .మీ అక్కయ్యే మడి కట్టు కోని అన్నీ చేస్తుంది .నేను మడి కట్టుకొని పూజ చేస్తా ”అన్నాను .”అబ్బో శానా ఉందే .అక్కడ కూడా ఈ ఆచారాలున్నాయా ?”అని మళ్ళీ తిక్క ప్రశ్న .ఇప్పటికే సహనం పోయింది నాకు .”సరే ఇండియా వదిలి మేం నెల అయింది .అక్కడి విశేషాలేమిట్రా “‘అన్నా టాపిక్ డైవేర్ట్ చేయ టానికి .
ఇప్పుడు బల్బు బాగా వెలిగింది .”బోలెడున్నాయి .ఈ సారి వినాయక చవితి చాలా ఆశావహం గా అందరు చేశారు బావా “‘అన్నాడు .”ఆశావహం ‘అంటే ”అన్నాను నేను .”ఏంలేదు బావా “అందరు ఏదో ఆశించి ఈ చవితిపూజ చేశారు .ఒక్కొక్కడి మనసు లో ఒక్కో కోరికా .తప్పక గణపతి దేవుడు తీరుస్తాడని ఆశ ”అన్నాడు .”చానళ్ళలో ఆ విశేషాలు చూపిస్తున్నారా ?”అన్నాను .”మరీ రెచ్చి పోయి చూపిస్తున్నారు బావోయ్ ”అన్నాడు .”యే చానెల్ లో బాగుందో చెప్పు చూస్తాను ”అన్నాను . ”ఛా.ఛా”అన్నాడు .అదే మిట్రా చేనల్ పేరు చెప్పమంటే ఏదో ”ఛీఛీ ”అన్నట్లు ఒక్క సారిగా ”ఛా. ఛా ”అన్నావు?”అని ప్రశ్నించా .”పొరబాటు పడ్డావు బావే ,నన్ను అపార్ధం చేసుకోన్నావు .నేను చెప్పింది కొత్త గా వస్తున్నా” ఛా ఛా ”చానెల్ పేరేనీకు చెప్పింది . ”ఆపేరేమిట్రా అసహ్యం గా ”అన్నాను .ఆది సరైన పేరే బావా .దాని అర్ధం ”ఛానళ్ళకు ఛాలెంజి ”చానెల్ .బలే గా ఉందిలే .జనం విరగ బడి చూస్తున్నారు .మీక్కూడా వస్తోందేమో చూడు .మాకిక్కడ అమెరికా లోను విజయ యాత్ర చేస్తున్న చానల్ అని .తెగ డబ్బా కొడుతున్నారు .నువ్వెప్పుడు పెట్టి చూడ లేదా ?”అని కసురుకోన్నంత పని చేశాడు .”నేను మా మూలు చానళ్ళే సరిగ్గా చూడటం లేదు .ఈ తొక్కలో చానళ్ళు ఎక్కడ చూడను?చదువుకోవ టానికే నాకు టైం చాలటం లేదు ఈ ప్రయోగాలు నేను చెయ్యలేను .మీ అక్కయ్యకూ విసుగే నని తెలుసు గా నీకు ”అన్నాను ”.సూక్ష్మం గా అందులో కొత్త విశేషాలేమితో తెలియ జేయి బామ్మర్డీ ”అన్నాను. .
” బావా ! ఈ సారి వినాయక చవితిని బలేగా ఎంజాయ్ చేశాం .మన రాష్ట్ర ముఖ్య మంత్రి గారు వినాయకుడి ముఖాన్ని సోనియాముఖం గా చేయించి పూజించాడు .కే.సి.ఆర్ .గణపతి ముఖానికి తెలంగాణా తల్లి ముఖం పెట్టించాడు .చిరంజీవి ”అంతూలే ముఖం పెట్టించి పూజించాడు .తనను పార్టీ లోకి ఆహ్వానించింది ఆయనే కదా ఆయనే కేంద్రం లో పదవి ఇప్పిస్తాడని ఆశ గా .బొత్సా గారు మాత్రం ”వోక్సు వాగన్ ”ముఖం పెట్టించాడు మళ్ళీ వస్తుందనే ఆశ .చంద్ర బాబు వినాయకుడికి రెండు ముఖాలు పెట్టించాడు .ఒకటి ఆంధ్రా ముఖం ,రెండోది తెలంగాణా ముఖం ట .మంత్రి వెంకటేష్ రాయలతెలంగాణా కోరే వాడు కనుక ”వినాయకుడి ముఖాన్ని రాయల వారి ఫోజు తో చేయించి పూ జించాడు .జై ఆంధ్రా ఉద్యమ నాయకులు తెన్నేటి విశ్వ నాదం గారి . ఆకారం పెట్టించారు .మూడు ముక్కలు కావాలను కొనే వారు మూడు ముఖాలు చేయించి పూజించారు .ఇవన్నీలైవ్ లో బలే రంజు గా చూపించారు ఛా ఛా వాళ్ళు ”అని ఊపిరి పీల్చుకొన్నాడు యోగి .
” అన్నీ బానే ఉన్నాయి కాని అసలైన పార్టీ కాంగ్రెస్ ఎముఖాన్ని పెట్టి పూజ చేసింది ?” అని అడిగాను .దానికి వాడు ”ఇదీ తెలీదా బావా ! యే ముఖం పెడితే ఏమి కొంప మునుగు తుందో నని తలకాయ లేకుండా గణేశుని చేయించి పూజించారని చెవులు కొరుక్కుంటున్నారు బావోయ్ ”అన్నాడు .”మరి దీన్ని ఛా ఛా లో చూపించాలేదా ”అడిగాను .”ఛీ.ఛీ.చూపించలేదు బావా .చూపిస్తే ఏమవుతుందో నని పార్టీ ఆఫీసులో నె తంతు జరిపించేశారని, ముఖ్యులైన వారికే ప్రవేశం కల్పించారని, మీడియా వారికి ప్రవేశం లేదని తెలిసింది బావా” ”బానే ఉంది మరి తెలంగాణా ఎప్పుడు వస్తుందని అనుకుంటున్నారు “?అని అడిగా .”అందరి పార్టీ లలోపలి గోడ ల పై ”రేపు ‘అని రాసుకోన్నారట బావా .ఆది సీక్రెట్ .ఎవరికీ చెప్పట్లేదు ఆ రాత చూపించటం లేదట .”జైపాల్ రెడ్డి సి.ఏం .అవుతాడని ఇక్కడిమిత్రులు అంటున్నారు అక్కడ ఆ వాసన యే మైనా ఉందా “‘? అని అడిగా ”.అందుకనేనేమో బావా ఈ మధ్య ఆయన్ను చాలా క్లోజప్ లలో చూపిస్తున్నారు .అక్కడున్నా నువ్వు బలే గా పసి కట్టావే “”?అన్నాడు ఆశ్చర్యం గా .”బావా ! అక్కయ్య ఎప్పుడూ ఏదో వే రైటీ గా గణేష్ ను చేస్తుంది కదా ఈసారి ఎలా తయారు చేసింది ?అని కుతూహలం గా అడిగాడు ”? ”ఈ సారి వినాయకుడికి” పెరట్లో గణ పతి ”అని పేరు పెట్టింది మీ అక్కయ్య .ఇక్కడి పెరట్లో పండిన సొరకాయ, దోసకాయ,బీరకాయ, టమేటా,చమ్మ కాయలతో వినాయకుడిని చేసింది .ఇక్కడ మట్టి విగ్రహాలు దొరకవు .ఎవరో ఆ మధ్య గిఫ్టు గా మంచి అందమైన గణేష్ విగ్రహాన్నిచ్చారు .ఈ రెండిటి తో పూజ చేశాం .చాలా ఆకర్షణీయం గా ఉన్నాయి .బంతి పూలు, చామంతి పూలు ,మల్లెపూలు, మందారాలు, మరువం గులాబీ లతో పూజ బాగా చేశాం .ఇవీ దొడ్లో పూసినవే .అందుకే ఈ సారి పూజ మాకూసరదాగా ఉందనిపించింది .దేశాలు వేరు అయినా భావన ఒక్కటే .మా” ఛీమతి ”అదే మీ అక్కయ్య పిలుస్తోంది .ఛా ఛా – నీ చానల్ ప్రభావం నా మీదా పడింది శ్రీ మతి అనటానికి” ఛీ మతి” అని వచ్చింది నోటి వెంట ఛీ ఛీ …” అని ఫోన్ పెట్టేశాను ”బావా బావా ”అని అరుస్తూనే ఉన్నాడు యోగానందం బామ్మర్ది .
గణేష్ చతుర్ధి శుభా కాంక్షల తో –మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –19-9-12–కాంప్–అమెరికా


బాగు..బాగు..చక్కగా నవ్వులు పూయించాయి మీ చవితి చేష్టలు.మీరు అమెరికా వెళ్లి అయిదు నెలలు దాటిందని గుర్తు.
మరి మీ యోగానందం బామ్మర్దితో నెల దాటిందన్నారేమిటి ?
LikeLike