శ్రీ శంకరుల లలి (కవి ) తా సౌందర్య లహరి –2
2–” తనీ యామ్శుం పామ్శుం ,తవ చరణ పంకేరుహ భవం –విరిన్చిహ్ సంచిన్వన్ ,విరచ యతి ,లోకాన వికలం
వహత్సేనం ,శౌరిహ్ ,కధ మపి సహస్రేణ శిరసాం –హరః ,సంక్షుద్యైనం ,భజతి ,భస్మో ద్ధూలిన విధిం ”.
తాత్పర్యం –అమ్మా !నీ పాద ధూళి రేణువు తగిలి ,బ్రహ్మ దేవుడు చరా చర సృష్టి చేస్తున్నాడు .ఆ రేణువు నే ,వేయి తలల తో అనంతు డైన విష్ణువు మోస్తున్నాడు .దానినే ఈశ్వరుడు భస్మం గా శరీరం అంతా పూసుకొంటున్నాడు .
విశేషం –శ్రీ దేవి పాద ధూళి యే ,బ్రహ్మ ,విష్ణు ,శివ దేవులకు సృష్టి ,స్తితి ,లయ శక్తులకు కారణం అవుతోంది .ఆ మాయా గుణాలే ,సత్వ ,రజ ,తమోగుణాలు .విష్ణువు శింశు మార (మొసలి )రూపంతో ఊర్ధ్వ లోకా లను ధరిస్తున్నాడు .శేష రూపం లో అతల మొదలైన అదో లోకాలను ధరిస్తున్నాడు .శివుడు భస్మ స్నానం చేస్తున్నాడు .అంటే పృధివి ,నీరు అగ్ని ,వాయువు ఆకాశం అనే పంచ భూతాలు భస్మం చేస్తున్నాడని భావం .”అగ్ని రితి భస్మం ,వాయురితి భస్మం ,జలమితి భస్మం ,స్థల మితి భస్మం వ్యామేమితి భస్మం సర్వం హువా ఇదం భస్మమన ఏతాని చక్శూమ్సి భస్మాని ”అని ఉంది .
పృధివి మొద లైనవి అమ్మ వారి చరణ ధూళి కణాలు అవుతుంటే ,ఆమె స్వరూపం తెలుసు కోవటం ఒక్క శివ మహా దేవుడికే సాధ్యం అని అర్ధం .రజో గుణం అనే పంకేరుహం లో బ్రహ్మ సృష్టి చేస్తుంటే ,శుక్ల చరణ పంకేరుహం తో విష్ణువు పోషిస్తుంటే ,మిశ్ర చరణ పంకేరుహం తో శివుడు లయం చేస్తున్నాడని విశేషం .సృష్టికి ఉపాదాన కారణం ”పరమాణువులు ”అనీ ,కణాదుడు గౌతముడు మొదలైన మహర్షులు సిద్ధాంతం గా ఎప్పుడో చెప్పిన సంగతి మనకు తెలుసు .వేదాంత భావన లో ఈశ్వర ఇచ్చాశక్తియే ప్రధాన కారణం అని చెబుతారు .
3— ”అవిద్యానాం అంతస్తిమిర మిహిరోద్దీపన కరీ–జడానాం ,చైతన్య స్తబక మకరంద శ్రుతిఝరీ
దరిద్రానాం ,చింతా మణి ,గుణ నికా, జన్మ జలధౌ –నిమగ్నానాం ,దంస్ట్రా మురరిపు ,వరాహస్య భవతి ”.
తాత్పర్యం —జననీ !నీ పాద కమల రేణువు,లోపల ఉన్న అజ్ఞానం అనే చీకటికి సూర్య కిరణం లాంటిది .జ్ఞానం కలిగిస్తుంది .మంద బుద్ధులకు చైతన్యం అనే కల్ప వృక్ష పుష్పం యొక్క మకరందం .దీనులకు అన్ని కోర్కె లను తీర్చే చింతా మణి .జనన ,మరణ ,సంసార సముద్రం లో మునిగి ఉన్న వారికి యజ్న వరాహ మైన విష్ణువు యొక్క దంష్ట్రం (కోర ).లలితా పరా భట్టారిక ను స్తుతిస్తే -అవిద్య ,జడత్వం ,దరిద్రం, జనన ,మరణ భయాలు ఉండవు అని స్పష్ట పరుస్తున్నారు శంకర భగవత్పాదులు .
4–”త్వదన్యహ పాణిభ్యా ,మభయ వరదో ,దైవత గణః –త్వమేకా ,నైవాసి ,ప్రకటిత ,వరా భీత్య భినయా
భయాత్రాతుం ,దాతుం ,ఫలమపి ,చ ,వాన్చా సమధికం –శరణ్యే ,లోకానం,తవహి ,చరణా వేవ నిపుణౌ ”.
తాత్పర్యం -భవానీ ! ఇతర దేవతల చేతి లో అభయ వర ముద్రలు ఉన్నాయి .అందరి కంటే ముఖ్యురా లైన నీ చేతులలో ఆ ముద్రలనేవి లేనే లేవు .అయితే నేమి ?నీ పాదాలే, భయం నుంచి కాపాడి ,కోరిన దాని కంటే ఎక్కువ ఇచ్చే అధిక సామర్ధ్యం కలవి .అవే మాకు దండి .పాశ ,అంకుశ ,ఇక్షు ,బాణాదులే ఆమె హస్తాలలో ఉంటాయి .ముద్రాభి నయం అనేది లేదు కనుక ఆమె పాదాశ్రయమే భోగం, మోక్షం అని భావం .
సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ —20-9-12-కాంప్–అమెరికా
వీక్షకులు
- 1,107,470 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.1 వ భాగం.22.12.25.
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.3 వ భాగం.22.12.25.
- యాజ్ఞవల్క్య గీతా.8 వ భాగం.22.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.71 వ భాగం.22.12.25
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.2 వ భాగం.21.12.25.
- శ్రీ వసంతరావు వెంకటరావు గారి విజ్ఞాన వాస0త గీతాలు.1 వ చివరి భాగం.21.12.25.
- నోట్ బుక్స్ కోసం చెప్పుల్ని అమ్ముకొన్న ,ఐఫిల్ టవర్ కంటే ప్రపంచం లో ఎత్తైన చీనాబ్ రైల్వే బ్రిడ్జి పయనీర్ , భూసాంకేతిక సలహాదారైన శాస్త్రవేత్త, ‘’ఇండియన్ సైన్స్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్’’–శ్రీమతి గాలి మాధవీ లత
- యాజ్ఞ వల్క్య గీతా.7 వ భాగం.21.12.25. గబ్బిట దుర్గా ప్రసాద్ ప్రసారమైన అంశం సరసభారతి ఉయ్యూరు
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.70 వ భాగం.21.12.25. part -02
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.70 వ భాగం.21.12.25.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,547)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు

