అవీ ఇవీ అన్నీ
2005నుండి కాలి ఫోర్నియా లోని హిందూ స్వయం స్వక సంఘం వార్షిక ”గురు వందనం ”కార్య క్రమాన్ని క్రమం తప్పకుండా నిర్వహిస్తోంది .ఈ యేడు కూడా జూన్ పదిహేను న ఉపాధ్యాయలను ఆహ్వానించి సమ్మానించింది .వారి పాదాలను తాకి నుదుట తిలకం పెట్టి ఆనంద బాష్పాలు రాలుస్తూయువకులు ,చిన్నారులు తమ కోసం ఆహరహం శ్రమించి తమను తీర్చి దిద్దు తున్న గురు వరేణ్యులను అత్యంత శ్రద్ధా ద్ద భక్తులతో వారందరూ పూజించి,సత్కరించి తమ కృతజ్ఞతలను తెలియ జేసుకొన్నారు .ఇది అందరిని ఆనంద సాగరం లో ముంచి తేల్చిన ఘటన .
2011. డిసెంబర్ లో బంగ్లా దేశ్ లో బీద విద్యార్ధుల కోసం విశ్వ నికేతన్ అనే స్కూల్ ను ప్రారంభించారు .దీన్ని అమెరికా లోని లాభాపేక్షలేని గీతా సొసైటీ వారు ఏర్పాటు చేశారు .దీని సంస్థాపకులు అమెరికా నేవీ మాజీ ఆఫీసరు మరియు శాన్ జో స్టేట్ వర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ రామ చంద్ర ప్రసాద్ .ఈ సంస్థ ఒక లక్ష భగవద్గీత పుస్తకాలను ఉచితం గా పంపిణీ చేసింది. అమెరికా లోని హిందూ సంఘటనకు ఈ సంస్థ దివ్యమైన కృషి చేస్తోంది .
ఆస్ట్రే లియా లోని ”సిడ్నీ సంస్కృత విద్యా లయం ”లోని విద్యార్ధులు సంస్కృతాన్ని నేర్చు కోవటమే కాదు చక్కగా సంస్కృతం లో సంభాషిస్తు అందరికి ఆదర్శం గా నిలుస్తున్నారు .స్థాపించి అయిదేల్లయింది .దిన దిన ప్రవర్ధ మానం అవుతోంది .ప్రతి ఏడాది ”సంస్కృత ఉత్స వాన్ని ”ఘనం గా నిర్వ హిస్తున్నారు .కిందటి నవంబర్ లో దున్దాస్ కమ్యూనిటి సెంటర్ లో నిర్వ హించారు .అక్కడికి వచ్చిన అతిధులందరూ సంస్కృతం లో మాత్రమె మాట్లాడటం గొప్ప ముందడుగు .శ్రీ ఛా.ము కృష్ణ శాస్త్రి గారు అక్కడ” సంస్కృత భారతి” అనే సంస్థను స్తాపించి ,సంస్కృతానికి పూర్వ వైభవాన్ని తీసుకొని రావటానికి సర్వ శక్తులు ధార పోసి పని చేస్తూ అనుకొన్నది సాధిస్తున్నారు .”సంస్కృతాన్ని పునరుద్ద రించి అందరికి అనుసంధాన భాష గా తీర్చి దిద్దటమే మా ధ్యేయం .ఆది సామాన్యుని భాషను చేయాలనేదే మా సంకల్పం .దాని అపార జ్ఞాన సంపదను అందరికి అందించటమే మా ధ్యేయం .సంస్కృతం తోనే సాంఘిక సామరస్యం ,జాతీయ సమైక్యత సాధ్యం అని నిరూపించటమే మా లక్శ్యం .మాకు జాతి కుల మత భాషా భేదాలు లేవు ”అని వారు తెలియ జేస్తున్నారు .
కమ్యూనిస్టు చైనా లో ఎన్నో ఊహా తీత మైన మార్పులొస్తున్నాయి ,ముఖ్యం గా హిందువు లందరూ గర్వించ దగిన సంఘటనలు అక్కడ చోటు చేసుకొంటున్నాయి. చైనా లోని ”wilken arts and crafts ltd .” అనే సంస్థ” xiamen”లో ఏర్పడి అతి తక్కువ ఖర్చుతో పోలీ రేజిన్ పదార్ధం తో హిందూ దేవతా మూర్తులను తయారు చేస్తోంది .రెండేళ్ళ క్రితేమే ఏర్పడిన ఈ సంస్థ గణేష్ ,బుద్దా విగ్రహాలను ఆటో డాష్ బోర్డు వారికి తయారు చేసి ఇచ్చింది . .అవి బాగా అమ్ముడు పోవటం తో ఇంకా ఎక్కువ రకాలను తయారు చేయటం లో నిమగ్న మైంది .పెద్ద పెద్ద విగ్రహాలను నిర్మిస్తోంది .సాయిబాబా ,లోక నాద్ ,షిర్డీ బాబా ,రామ కృష్ణ పరమ హంస మొదలైన విగ్రహాలను ఆర్డర్ల మీద తయారు చేసి అందిస్తున్నారు .కనీస ఆర్దర్ అయిదు వందల బొమ్మలున్డాలి .చాలా తక్కువ ఖరీదు కే విగ్రహాలు లభించటం తో జనం కొనుక్కోవటానికి క్యూ లు కడుతున్నారట .
మీ–గబ్బిట దుర్గా ప్రసాద్ –22-9-12- కాంప్–అమెరికా
వీక్షకులు
- 1,107,615 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.2 వ భాగం.23.12.25.
- శ్రీ ఆర్ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.4 వ భాగం.23.12.25
- యాజ్ఞవల్క్య గీతా.9 వ భాగం.23.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.72 వ భాగం.23.12.25.
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.1 వ భాగం.22.12.25.
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.3 వ భాగం.22.12.25.
- యాజ్ఞవల్క్య గీతా.8 వ భాగం.22.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.71 వ భాగం.22.12.25
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.2 వ భాగం.21.12.25.
- శ్రీ వసంతరావు వెంకటరావు గారి విజ్ఞాన వాస0త గీతాలు.1 వ చివరి భాగం.21.12.25.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,551)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు

