శ్రీ శంకరుల లలి (కవి )తా సౌందర్య లహరి –4
8 — ”సుధా సింధు ర్మధ్యే ,సుర విటపి ,పాటీ పరి వ్రుతా -మణి ద్వీపే ,నీపోప వన వసతి చింతా మణి గృహే
శివా కారే ,మంచే ,పరమ శివ పర్యంక నిలయం –భజంతిత్వం ,ధనయః ,కతి చన ,చిదా నంద లహరీ ”
తాత్పర్యం –పరాశక్తీ !అమృత సముద్రం మధ్య లో ,రత్నాల దీవిలో ,కల్ప వృక్షాల తో పరి వేష్టించ బడిన కదంబ వృక్ష వనం లో ,చింతా మణి నిర్మిత నగరం లో ,శక్తి స్వరూపం అయిన త్రికోణా కార మంచం పై ,పరమ శివుని ప్రక్కలో ,ప్రకాశించే జ్ఞాన స్వరూపమైన ,నిరతి శయ సుఖ ప్రవాహం గా ఉన్న నిన్ను కొంత మంది ధన్య్లు లు మాత్రమె సేవించ గలుగు తున్నారు .
విశేషం –శ్రీ చక్రం అంటే ”వియత్ ”చక్రం .ఆకాశ చక్రం అన్నమాట .అంటే ఇది ఆకాశ పూజ అన్న మాట .దహరా కాశ ,బాహ్యాకాశ పూజ అని అర్ధం .పీఠం లో భూర్జ పత్ర ,శుద్ధ వస్త్ర ,సువర్ణ ,రజత రేకుల పై శ్రీ చక్రాన్ని వ్రాసి ,ఆరాధించా టాన్ని బాహ్యాకాశ పూజ అంటారు .హృదయాకాశం లో చేసే పూజ దహరా కాశ పూజ .శివాత్మక మైన నాలుగు యోనులు అదో ముఖం కలవి .శక్త్యాత్మక మైన అయిదు యోనులు ఊర్ధ్వ ముఖం కలవి .ఈ తొమ్మిది యోనులు కలిగిన ,శ్రీ చక్రం క్రింది ప్రదేశం లో ణి బిండువునే ”సుధా సింధువు ”అంటారు .బిందు స్థానం సుఖ సముద్రమే .అయిదు యోనులు కల్ప వృక్షాలు .అక్కడే కదంబం .దాని మధ్య మణి మంటపం .అందులో చింతా మణి గణం చేత నిర్మించ బడిన పీఠం ఉంటుంది .అక్కడే శక్తి రూప మైన మంచం మీద శివుడు దిండుగా ,రమ్య మైన పాన్పు గా ఉన్న సదా శివుడు ఉన్నాడు .బ్రహ్మాదులు ఆయన్ను సేవిస్తుంటారు .ఇంద్రుడు తమ్మి ప డగ.అక్కడ పర మేశ్వరి అయిన మహా త్రిపుర సుందరీ దేవి ఉంటుంది .శివార్క మండలం ఛేదించి చంద్ర మండలాన్ని ద్రవింప జేస్తూ ,,దాని లో విని పించే అమృత తుల్య మైన పరమానందాన్ని పొందుతూ, కుల సుందరి, కులాన్ని త్యజించి, పరమ మైనద ర్శనాన్ని పొందు తోంది .
దేవీ మందిరం 43 కోణాలు గల శ్రీ చక్రం. దానికి .బ్రహ్మ ,విష్ణు ,రుద్రా ,ఈశ్వరులు నాలుగు కోళ్ళు .మహేంద్రుడు తాంబూలం ఉమ్మి వేసే పళ్ళెం .కులం — కుల మార్గ శుషుమ్నా నాడి మార్గం .అక్కడే చంద్ర మండలం లో నిలిచి ,72,000నాడులు అమృత వర్షా న్నిస్తూంటాయి .మళ్ళీ కుండలిని స్వస్థానం పొంది ,స్వాదీష్టా నం లో నిద్రిస్తుంది .మూలాధారం లోని కుండలినీ శక్తి ,సుషుమ్న ద్వారా ,సహస్రారా నికి,వేళ్ళ బోతూ ,దహర గత సూర్య మండలాన్ని చేదించి ,బ్రహ్మ రంధ్రాన్ని కప్పి ,అక్కడి చంద్ర మండలాన్ని ద్రవింప జేసి ,అమృత వర్షం తో ,సర్వ ప్రపంచాన్ని అంటే సాధకుడి నాడీ మండలాన్ని తడిపి ,తృప్తి పొందు తోంది .శివుడు ”ఏ”ఆకారం .అదే ఏకాదశ స్వరం .అందు వల్లే ఆది త్రికోణం అయింది .పరమ శివుడు బిందువు .అక్కడ ఉండేది త్రికోణా కార మధ్య బిందు నిలయం .ఆమెను ధన్యు లైన వారే పూజించ గలరు .ఇదే శ్రీ శైలం లాంటి దేవాలయ దర్శనం అని రామ లింగేశ్వర శర్మ గారి అత్యన్తాద్భుత వ్యాఖ్య .అనాహత చక్రం పరమ కళ్యాణ రూపం .అదే పర్యంకం అంటే తోడ .అక్కడే చిదానంద లహరి ని దర్శిస్తారు .
9—”మహీం మూలాధారే,కమపి ,మణి పూరే ,హుత వహం –స్థితం ,స్వాధి ష్టానే ,హృది మరుత ,మాకాశ ముపరి
మనోపి ,భ్రూ మధ్యే ,సకల మపి ,భిత్వా ,కుల పధం –సహస్రారే ,పదమే ,సహ ,రహసి ,పత్యా విహరసే .”
తాత్పర్యం –ఆది శక్తీ !మూలా ధారం లో పృధ్వీ తత్త్వం ,మణి పూరం లో జల తత్త్వం ,స్వాదిష్టానం లో అగ్ని తత్త్వం ,అనాహతం లో వాయు తత్త్వం ,విశుద్ధం లో ఆకాశ తత్త్వం ,ఆజ్న లో మనస్తత్వంఉన్నాయి . ‘,సుషుమ్నను చేదించి ,సహస్రారం లోని భర్త అయిన సదా శివుని తో సదా విహరిస్తున్నావు నువ్వు .
విశేషాలు –నాలుగు శివ చక్రాలు ,అయిదు శివా అంటే లలితా దేవి చక్రాలు కలిసి శ్రీ చక్రం గా రూపు దాల్చింది .శివ చక్రం లో బిందు ,అష్ట దళ ,షోడశ దళ ,చతుర్దశ దళ క్రమాలుంటాయి .ఈ కొణా ,చక్రాలు శ్రీ దేవి ఆధార స్వరూపాలు .అమ్మా! నువ్వు త్రికోణ రూప శక్తివి .బిందు రూప శివుడిని నేను అని సాధకుడు భావిస్తాడు .మూలాధారం నుంచి ఆజ్ఞా చక్రం వరకు ఉన్న ఆరు చక్రాలకు ”కుల మార్గం ”అని పేరు .ఆ మార్గం లో సహస్రారం లో ,సహస్ర దళ పద్మం పై పరమ శివుని తో రహస్యం గా భగ వతి విహరిస్తుంది .ఇది ధ్యాన యోగానికి ఉపాసనా విధానం .దీని వల్ల యోగ సిద్ధి కలుగు తుంది .మూలాధారంలో కుండలినీ శక్తి నిత్య నివాసి అని భావిస్తారు .
సశేషం –మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ –22-9-12–కాంప్–అమెరికా
వీక్షకులు
- 1,107,486 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.1 వ భాగం.22.12.25.
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.3 వ భాగం.22.12.25.
- యాజ్ఞవల్క్య గీతా.8 వ భాగం.22.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.71 వ భాగం.22.12.25
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.2 వ భాగం.21.12.25.
- శ్రీ వసంతరావు వెంకటరావు గారి విజ్ఞాన వాస0త గీతాలు.1 వ చివరి భాగం.21.12.25.
- నోట్ బుక్స్ కోసం చెప్పుల్ని అమ్ముకొన్న ,ఐఫిల్ టవర్ కంటే ప్రపంచం లో ఎత్తైన చీనాబ్ రైల్వే బ్రిడ్జి పయనీర్ , భూసాంకేతిక సలహాదారైన శాస్త్రవేత్త, ‘’ఇండియన్ సైన్స్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్’’–శ్రీమతి గాలి మాధవీ లత
- యాజ్ఞ వల్క్య గీతా.7 వ భాగం.21.12.25. గబ్బిట దుర్గా ప్రసాద్ ప్రసారమైన అంశం సరసభారతి ఉయ్యూరు
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.70 వ భాగం.21.12.25. part -02
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.70 వ భాగం.21.12.25.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,547)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు

