శ్రీ శంకరుల లలి (కవి ) తా సౌందర్య లహరి –12

  శ్రీ శంకరుల లలి (కవి ) తా సౌందర్య లహరి –12
29–”కిరీటం ,విరించిం , ,పరి హర పురః ,కైట భిదః –కథోరే ,కోటీరే,స్ఖల సి ,జహి జంభారి మకుటం
ప్రనమ్రే ,శ్వేతేషుప్రసభ ,ముపయా తస్య భవనం –భావస్యాభ్యుత్తానే తవ ,పరి జనోక్తి ర్విజ యతే ”
తాత్పర్యం –అమ్మా శారదా రాధ్యా !నీ ముందు బ్రహ్మ గారి కిరీటం ఉంది .దాన్ని తగల కుండా నువ్వు రావాలి .తర్వాతా కైటభ మర్దనుడైన విష్ణు మూర్తి కిరీటం ఉంది .నీ కాలికి తగులు తుందేమో జాగ్రత్త సుమా .ఆ తర్వాత జమ్భాసుర మర్దనుడైన ఇంద్రుని కిరీటం ఉంది .దాన్ని అతి జాగ్రత్త గా దాటి రా .అంటే ,నీకు బ్రహ్మాదులు సాష్టాంగ ప్రణామం చేస్తూ ఉంటె ,నీ పతి సాంబ శివుని దర్శించ టానికి నీవు వేగం గా వీటిని అన్నిటిని దాటు కుంటూ అతి జాగ్రత్త గా రావాల్సి ఉంటుంది .
30–”స్వ దేహోద్భుతాభి ర్ఘుణిభి, రణిమా ద్వాభి రభీతః –నిషేవ్యే ,నిత్యే ,త్వామహ మితి సదభి వయతియః
కిమా శ్చర్యం ,తస్య ,త్రినయన ,సంరుద్ధిం ,త్రుణయతః –మహా సంవర్తాగ్ని ర్విరచయతి ,నీరాజన విధిహ్ .”
తాత్పర్యం –ఆద్యంతాలు లేని చిచ్చక్తీ !లోకం చేత నీవు సేవింప బడుతున్నావు .నీ చరణ కమల కిరణాలతో అణిమ ,మహిమ ,గరిమ ,లఘిమ ,ప్రాప్తి ,ప్రాకామ్య ,ఈశత్వ ,వశిత్వాలు అనే ఎనిమిది సిద్ధుల తోకూడి ఉన్న ”అహం ”అనే భావం తో ఎవరు నిన్ను ధ్యానిస్తారో ,వారికి శివుని ఐశ్వర్య విభూతిని త్రుణీకరించిన వానికి ,మహా ప్రళయ కాలాగ్ని నీరాజనం పడుతుంది .
విశేషం –తాదాత్మ్యం తో ధ్యానిస్తే ,ప్రళయ కాలాగ్ని సాధకుని పాదాల వద్ద వెలుగు తుంది .వాడు శ్రీ దేవి తో కలిసి పోవటం వల్ల ,ప్రళయ కాలాగ్ని దేవి పాదాలకే నీరాజనం ఇస్తోందన్న మాట .అంటే అతడు దేవి గా మారి పోయాడు అని భావం .అలాంటి వాడికి శివుడిచ్చే ఐశ్వర్యాన్ని లెక్క చేయడు అని అర్ధం .
     శ్రీ దేవి శరీరం శ్రీ చక్రమే .శ్రీ చక్ర నవావరణ దేవతలు ఆమె శరీర కాంతులే .భూపుర త్రయం లో ఉండే వారు అణిమాది అష్ట సిద్ధులు .,బ్రాహ్మ్యాది అష్ట మాతృకలు ,సర్వ సంక్షో భిన్యాది దశ ముద్రా దేవతలు .షోడశార పద్మం లో కామ్మక్షి మొద లైన పదహారు మంది దేవతలు ,అష్ట దళ పద్మం లో మన్మధాది దేవతలు ఎనిమిది మంది ,చాతుర్దశారం లో సర్వ సంక్షోభిన్యా దులు14 గురు ,బహిర్దశారం లో సర్వ సిద్ధి ప్రదులు1౦ మంది ,అంతర్దశారం లో సర్వజ్ఞాది దేవతలు పది మంది ,అష్ట కోణం లో వశిన్యాదులు ఎనిమిది మంది ,త్రికోణం లో కామేశ్వరీ ,మొద లైన ముగ్గురు ,బిందు స్థానం లో మహా త్రిపుర సుందరీ దేవి ఉంటారని సర్వజ్ఞులు శ్రీ తుమ్మల పల్లి రామ లింగేశ్వర శర్మ గారుగొప్పగా  విశ్లేషించి చెప్పారు .
31– ”  చతు స్ష్యష్ట్యా తన్త్రైహ్ సకల మతి సంధాయ భువనం –స్తిత స్తత్తే ,త్సిద్ధి ప్రసవ పర తన్త్రైహ్ పశు పతిహ్
పునస్థ న్నిర్బంధా  దఖిల ,పురుషార్ధైక క ఘటనా –స్వతంత్రం తే తంత్రం ,క్షితి తల మవా తీతరదిదం ”
తాత్పర్యం –శ్రీ మహా రాజ్నీ!పశు పాలకుడు శివుడు .పర కాయ ప్రవేశం ,ఆకాశ గమనం ,తిరోధానం ,జల స్తంభన ,అగ్ని స్తంభన ,వాయు స్తంభన ,మొదలైన ఇంద్ర జాల విద్యలను ,వాటి విద్యా స్వరూపాలైన విద్యా స్వరూప సిద్ధాంతాలను సాధకులకు వారి వారి కోర్కెలను తీరుస్తూ ,మహా మాయ ,శామ్బరం మొద లైన 64తంత్రాలను తెలిపి ,ప్రపంచాన్ని మోహ పెడుతూ ,తాను నిశ్చలం గా ఉన్నాడు .ఈ విద్యల సారాన్ని గ్రహించిన నీవు ,వాటి వల్ల మోక్షం కలగటం లేదని భావించి ,నీ భర్త  శివదేవుడిని ఉత్తమ పు రుషార్ధాన్ని చ్చే విద్యన అందించ మని కోరావు .ఆయన సకలార్ధ సాధన మైన శ్రీ విద్యా తంత్రాన్ని ఉపదేశించాడు .
  విశేషం –భగ వంతు డైన పశు పతి లోకాన్ని అనుగ్రహం చేత ఉద్ధరించాలను కొనే వాడు .భగవతి  యొక్క నిర్బంధం వల్ల వైదిక మార్గాలకు సాటి అయిన శ్రీ చక్ర విధా నాన్ని ,లోకానికి అంద జేశాడు .”ఈశానః సర్వ విద్యానాం ””అని శృతి చెబుతోంది .అన్ని తంత్రాలు ,విద్యలు ఆయన ముఖం నుండే వెలువడి నాయి .ఇదంతా శ్రీ దేవి అనుగ్రహం వల్లనే జరిగిందని భావం .శ్రీ విద్య పర దేవత .”ఆత్మా విద్యా ,మహా విద్యా, శ్రీ విద్యా, కామ సేవితా ,షోడశాక్షరీ విద్యా ,త్రికూటా ”అని లలితా సహస్ర నామాలలో ఉన్న సంగతి మనకు తెలిసిన విషయమే .
సశేషం –మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –30-9-12-కాంప్–అమెరికా

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.