శ్రీ శంకరుల లలి (కవి)తా సౌందర్య లహరి –13

 శ్రీ శంకరుల లలి (కవి)తా సౌందర్య లహరి –13
32–” శివశ క్తిహ్ కామః ,క్షితి రధః రవిస్శీత  కరణః  –సమారో హంస శక్రః తదనుచ ,పరమార హరయః
హమీ ,హ్రుల్లెఖాభిస్తి సృభి రవ సానేషు ఘటి తాః –భజన్తే ,వర్నాస్తే ,తవ జనని నామా వయవతాం ”
తాత్పర్యం –కపర్దినీ !శివుడు (కకారం ),శక్తి (ఏ కారం )కాముడు (ఈ కారం )భూమి (ల కారం )మొదటి ఖండం గాను ,రవి (హ కారం )చంద్రుడు (స కారం )మన్మధుడు (క కారం )హమాస (హకారం ),ఇంద్రుడు (ల కారం )రెండవ ఖండం గా ,పరా శక్తి (స కారం )మన్మధుడు (క కారం )హరి (ల కారం )మూడవ ఖండం గా ఉన్న దాని ,విమర్శ స్థానం లో హ్రీమ్కారం తో కూడిన ,నీ పేరు తో ఉన్న త్రిపుర సుందరీ దేవి మహా విద్య కు అవయవాలు గా ఉన్నాయి .ఈ పన్నెండు వర్గాలు ,మోడు హ్రీం కారలతో ,కలిసి త్రిపుర సుందరీ మహా మంత్రమవుతుంది .”క ,ఏ ,ఈ ,ల ,హ్రీం ,హ ,స,క,ల,హ్రీం ,స ,క ,ల ,హ్రీం ”అనేదే మహా మంత్రం అని భావిస్తారు సాధకులు
విశేషం –ఇందులో పద హారు అక్ష రాలున్నాయి .ఇవి షోడశ ”నిత్య ”లకు రోప్పాలు .పద హారావడి షోడశి -నిత్య .ఆ పదహారవాడే పరా కళ .దానినే ”చిదేక రస ”అంటారు .దాని ఛాయా ఏ ,విశుద్ధ చక్రం లోని షోడశారం లో ,కళా స్వ రూపం గా ,వెలుగుతూ ఉంటుంది అని రహస్యం .ఆ షోడశి కలే ముఖ్య మైనది గా భావిస్తారు .అదే ప్రకృతి అయింది .మిగిలిన పడి హేను నిత్యాలు ,ఈ పదహారవ కళ కు అంగాలు మాత్రమె .
ఈ శోడశికళా రూపాన్ని గురు ముఖం గా తెలుసు కోవాలి .ఇది ”హాస్ట మస్తక ప్రయోగం వల్లనే ”సాధ్యమవుతుంది .అంటే గురువు గారు శిష్యుని ఆశీర్వా దిస్తూ దగ్గరకు తీసునిని శిరస్సు మీద చెయ్యి వేయటం .నెత్తిన చెయ్యి పెట్టటం అన్న మాట .ఇవాళ లోక వ్యవ హారం లో నెత్తిన చెయ్యి పెట్టాడు అంటే మున్చేశాడని అర్ధం .ఆది అలా కాదు .
షోడశ కళ అంటే ష ,రేఫా ,ఈ కారాలు ఉంది ,బిందువు చివర ఉన్న మంత్రం అని అర్ధం .ఈబీజమే శ్రీ విద్య .శ్రీ బీజాత్మక మైంది శ్రీ విద్య .ప్రతి పట్టి రోజున త్రిపుర సుందరి కళను ,విదియ నాడు కామేశ్వారిని ,తదియ రోజున భాగ మాలిని ని ,చవితి నాడు నిత్య క్లిన్నాను ,పంచమి నాడు భేరుండా ను ,షష్టి రోజున వహ్ని వాహినిని ,సప్తమి నాడు మహా వజ్రేశ్వారిని ,అష్టమి నాడు రౌద్రిని ,నవమి నాడు నీల పతక ,దశమి రోజున కుల సుందరిని ,ఏకాదశి నాడు నీల పతాకను ,ద్వాదశి రోజున విజయ ను ,త్రయోదశి రోజున సర్వ మంగళ ను ,చతుర్దశి నాడు జ్వాలను ,పూర్ణిమ రోజున మాలినీ కళ ను ఉపాసించాలి అని శ్స్స్త్రం చెబు తోంది .అన్ని తిధుల లో చిద్రూప కళ షోడశి ను ఇ ఉపాసించాలని భావం .
ఈ షోడశ, నిత్యలకు శ్రీ చక్రం లో విశుద్ధ చక్రం (షోడశారం )లో స్తానం ఉంది .తూర్పు నుండి ప్రారంభ మవుతాయి .దీని క్రింద ద్వాదశారమైనఅనాహతం లో12 మంది సూర్య మంద లాది పతులు ప్రా దక్షిణం గా చుట్టి ,ఉన్నాయి .ఇవి పన్నెండు మాసాల కు ప్రతీకలు .క నుండి ల వరకు ఉన్న వర్ణాలే ”కళ .అనుస్వారాలు ,నాలుగు సున్నాలు బిందువులు .దీని పై నాదం .ఈ విధం గా నాద ,బిందు కళాత్మకం గ శ్రీ చక్రం మూడు ఖండాలు గా గోచ రిస్తుంది .
33–”స్మరం యోనిం లక్ష్మీం ,త్రితయ మిద మాదౌ ,తవ మనొహ్ –నిధా యైకే ,నిత్యే ,నిరవధి మహా భోగ రసికాః
భజంతి త్వాం ,చింతా మణి ,గుణ నిబద్ధాక్ష వలయాః  –శివా జ్ఞౌ ,జుహ్వాస్త స్సురభి ఘ్రుత ధారా హుతి శతైహ్ ”
తాత్పర్యం –నిత్య స్వరూపా దేవీ !నీ మంత్రానికి మొదట కామ రాజ ,భువ నేశ్వారీ ,లక్ష్మీ బీజాలు (క్లీం ,హ్రీం ,శ్రీం )లను చేర్చి ,అపరిచ్చన్న మై ,అఖండమై ,మహా భోగ రూప మైన నిత్య సుఖానుభావం పొందిన పరమ యోగీశ్వరులు ఏ కొద్ది మంది , సమయా చార తత్పరులు ,చింతా మణు లతో కూడిన అక్ష మాలలను చేతిలో ధరించి ,త్రికోణ రూప మైన బైందవ స్తానం లో ,శివాగ్ని లో అంటే స్వాదిష్టానం లో కామ ధేనువు యొక్క ,సహస్ర నేతి ధారలతోనిన్ను హృదయ కమలం లో ఉంచుకొని ,హోమం చేస్తూ ,నిన్ను సేవిస్తున్నారు .
కాముడైనా ,మహేశ్వరుడైనా ,మానసిక హోమాలు చేయాలి .ఆమె జపం లోనే సర్వ కామాలు తీరు తాయి
సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ — 1-10-12-కాంప్ –అమెరికా

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.