శ్రీ శంకరుల లలి (కవి )తా సౌందర్య లహరి –14
34–”శరీరం త్వం ,శమ్భొహ్ ,శశి మిహిర వక్షో రుహయుగం –తవాత్మానాం మధ్యే ,భగవతి ,నవాత్మాన మనఘం
అతః శేషః శేషీ త్వయ ,ముభయ సాధారణ తయా –స్థితః సంబందోవాం ,సమరస పరానంద పరయొహ్ ”
తాత్పర్యం –మణి పూరాబ్జ నిలయా !జగత్ ఉత్పత్తి, మొదలైన ఆరు విషయాలు తెలిసిన భగవతి వి నువ్వు .ఆనంద భైరవివి .సూర్య చంద్రులు స్థన యుగ్మం గల శరీరం నీది .అయితే ,నవ వ్యూహాత్మకు డైన ఆనంద భైరవుని ,నీ దేహం గా భావిస్తున్నావు .ఈ రెంటి వల్ల నీవు శేషం ,ఆయన శేషి అవుతున్నారు .ఆయన శేషం ,నువ్వు శేషివీ కూడాఅవుతున్నారు .ఈ రకం గా ఆనంద భైరవ ,ఆనంద భైరవీ రూపు లైన మీ ఇద్దరికీ అంటే శివ, శక్తులకు ఇది సాదా రణమే అవుతోంది .
విశేషం –ఆనంద భైరవుడు పరా నంద .భైరవి పరా .వీరిద్దరి తాదాత్మ్యమే నవాత్మకం .అందుకే శేష ,శేషీ భావం .లయ కాలం లో భైరవి ప్రయత్నం వల్ల ,ప్రధానత్వం వల్ల ఆమె శేషి అంటే మిగిలి ఉండేది .ఆనంద భైరవుని అప్రధానం వల్ల ,గుణ భావ శేషత్వం కలుగు తోంది .శరీరం భైరవు ని లో అంతర్భావం కలుగు తోంది .అప్పుడు భైరవునికి శేషిత్వం ,భైరవికి శేషత్వం కల్గు తుంది .ఇద్దరూ కలిస్తే పూర్ణత్వం అవుతుందని భావం .దీనినే కాళి దాసు ”కుమార సంభవం ”కావ్యం లో ప్రారంభ శ్లోకం గా ”వాగార్దా వివ సంపృక్తౌ వాగర్ధ ప్రతి పత్తయే -జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరం ”అని ఆ ఆది దంపతులకు నమస్కరించాడు .
35—”మనస్త్వం ,వ్యోమత్వం ,మరు దపి ,మరుత్సారధి రసి –త్వ మాపస్త్వం ,భూమి స్త్వయి ,పరిణతయాం
త్వమేవ స్వాత్మానం ,పరిణమయితుం ,విశ్వ వపుషా –చిదా నందా కారం ,శివ యువతి ,భావేన భిభ్రుషె ”
తాత్పర్యం –ఛందస్సారా !ఆజ్ఞా చక్రం లోని మనస్తత్వం నీవే .విశుద్ధం లోని ఆకాశ తత్త్వం ,అనాహతం లోని వాయు తత్త్వం ,స్వాధీ ష్టానం లోని అగ్ని తత్త్వం ,నీవే .నీ కంటే వేరైనది ఏదీ లేనే లేదు .నీవే ,నీ స్వ స్వరూపాన్ని ,ప్రపంచం గా ,పరిణమింప జేయ టానికి చిదా నంద శివ తత్వాన్ని ,బ్రహ్మ రూప మైన ఆనంద భై రవ రూపాన్నీ ధరిస్తున్నావు .
విశేషం –భగవతి చిదా నందా కార .శివుని ఆకారమే ఆమె .అందు చేత ‘విశ్వ వపుషా ”అయింది .అన్డాండ ,పిండాండాలు ఒకే రూపం లో శ్రీ దేవి యే.అంతా ,ఆమె ఏక ఆకారమే అని భావం .
36—”త్వమాజ్నా చక్రస్త్వం ,తపన ,శశి కోటి ద్యుతి ధరం –పరం ,శంభుం ,వందే ,పరి మిళిత పార్శ్వం ,పర చితా
యమా రాధ్యన్ ,భక్త్యా ,రవి ,శశిహ్ ,శుచీనామ విషయే –నిరాలోకే లోకే ,నివ సతి ,హి ,భాలోక భువనే ”
తాత్పర్యం –నిఖిలేశ్వరీ !సూర్య ,చంద్ర ,అగ్నులకు కంపించ కుండా ,జనం లేని చంద్ర లోకం లో అంటే సహస్రారం లో ,నీ సాయుజ్యం పొంది ,(నీ భ్రూ మాధ్యమ లోని శ్రీ చక్రం లోని )ఆజ్ఞా చక్రం లోని చంద్ర కాంతిని ధరించి ,”సర” అనే చిత్ చేత ఆవ రింప బడిన శంభుని గూర్చి నమస్క రిస్తున్నాను .
37–”విశుద్దే తె ,శుద్ధ స్పటిక విశదం ,వ్యోమ జనకం ,–శివం సేవే ,దేవీ మపి ,శివ సమాన వ్యవస్తితాం
యయొహ్ ,కాన్త్యా,యాన్త్యాహ్ ,శశి కిరణ సారూప్య సరణే –విధూతాం తర్ధ్వాంతా ,విలసతి చకోరీవ జగతే ”
తాత్పర్యం –శివ జ్ఞాన ప్రదాయినీ !నీ విశుద్ధ చక్రం లో ,స్పటిక మణి లాగా నిర్మలుడు ,ఆకాశ వ్యుత్పత్తికి హేతు వైన శివుని ,ఆయనతో సమాన మైన దేవి వగు నిన్ను ,నేను ఉపాసిస్తున్నాను .శివా శివు లైన మీ నుండి వచ్చే ,చంద్ర కిరణా లతో సాటి వచ్చే వైభవం గల కాంతులతో ,మూడు లోకాల్లో ,అజ్నానాంధ కారాన్ని పార ద్రోలి ,వెన్నెలను ,తాగే చకోర పక్షి లాగా ,సంతుష్ట మైన అంత రంగం తో ,విశుద్ధం లో ధ్యానింప బడే శివా శివుల చంద్ర కాంతి ఛే ,లోపలి అజ్ఞానం తొలగి ,సాధకులు సంతుష్టులవు తున్నారు .
మహాత్మా గాంధీజీ జన్మ దిన శుభా కాంక్ష లతో
సశేషం –మీ–గబ్బిట దుర్గా ప్రసాద్ –2-10-12-కాంప్–అమెరికా
వీక్షకులు
- 1,120,886 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- పంచ సహస్రావధాని బ్రహ్మ శ్రీ జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు.7 వ భాగం.8.2.26.
- విద్వాన్ బులుసు వే0క టేశ్వర్లు గారి మన ప్రాచీన మహర్షులు.24 వ భాగం.8.2.26.
- పద్మ పురాణా0తర్గత శ్రీ మాఘ మాహాత్మ్యం.19 వ భాగం.8.2.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.1112 వ భాగం.8.2.26.
- పంచ సహస్రావధాని బ్రహ్మ శ్రీ జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు.5 వ భాగం.7.2.26.
- విద్వాన్ బులుసు వే0క టేశ్వర్లు గారి మన ప్రాచీన మహర్షులు.23 వ భాగం.7.2.26.
- పద్మ పురాణా0తర్గత శ్రీ మాఘ మాహాత్మ్యం.18 వ భాగం.7.2.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.111 వ భాగం.7.2.26
- పంచ సహస్రావధాని బ్రహ్మ శ్రీ జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు.5 వ భాగం.6.2.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.110 వ భాగం.6.2.26.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,729)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
