శ్రీ శంకరుల లలి (కవి )తా సౌందర్య లహరి –15
38–”సమున్మలత్సంవిత్కమల ,మక రందైక రసికం –భజే హంస ద్వంద్వం ,కిమపి ,మహతాం ,మానస చరం
యదా లాపా ,దష్టా ,దశ గుణిత ,విద్యా పరి నతిహ్ –యదా దత్తే ,దోషాద్గుణ ,మఖిల మాధ్యం వయ ఇవ ”
తాత్పర్యం –భావనా గమ్యా -!వికసించే జ్ఞానం అనే కమలం లో ,అంటే అనాహతం లో ,పుష్ప రసాన్ని ఆస్వాదించే ,రసజ్ఞనత ను ,యోగీశ్వరుల మానస సరోవరం లో సంచ రించే ,అనిర్వచనీయ శక్తి గల ,హంసేశ్వర ,హంసేశ్వరీ దేవుల సమ్మిళితం అయిన రాజ హంస జంటను భజిస్తున్నాను .వాని వల్లే ,అష్టా దశ విద్యలూ లభించాయి .హంస పాలను మాత్రమె ఎలా గ్రహిస్తుందో ,ఈ జంట దోషాల నుండి సద్గుణాలను మాత్రమె గ్రహిస్తుంది .
విశేషం –అనాహతం లో అగ్ని జ్వాలారూపు డైన పరమేశ్వరుడు గా ఉన్న వాడిని ”సమయుడు ”అంటారు .అగ్ని జ్వాలా రూపిణి భగవతి ” సమయ” అంటారు .ఆ జంట ,నా హృదయ పద్మం లో నివ సించాలి .సోహం అంటే హంస అని హంస శబ్ద మహా వాక్యార్ధం ప్రబోదిస్తోంది .హ అంటే శివుడు .సహ్ అంటే శక్తి .”భజే హంస ద్వంద్వం ”అని శృతి చెప్పింది .శివ ,శక్తి జంటను భజించమని అర్ధం .అదే జీవాత్మ ,పరమాత్మ ల ద్వంద్వం .దీనినే ఉపనిషత్ ”ద్వా సుపర్ణా ”మంత్రం లో చెప్పింది .
39–”తవ స్వాదిష్టానే ,హుత వహ మధిష్టాయ నిరతం –తమీడే ,సంవర్తం ,జనని మహతీం ,తాంచ సమయం
యదా లోకే ,లోకాన్ దహతి ,మహతి క్రోధ కలితే –దయార్ద్రాయా ద్రుష్టిశ్శిశిర ,ముప చారం ,రచయితి ”
తాత్పర్యం –తేజో వతీ !నీ స్వాధి ష్ఠాన చక్రం లో ,అగ్ని తత్వాన్ని కల్గి ఉన్న ,నిరంతరం ప్రకాశిస్తున్న, ,సంవర్తాగ్ని పేరు తో నిరంతరం వెలిగే పరమేశ్వరుని ప్రార్ధిస్తున్నాను .ఆయనతో అధిష్టాన ,అవస్తాన ,అనుష్టాన అనే పేర్ల తో సమాన సమయవు అయిన నిన్ను స్తుతిస్తున్నాను .సంవర్తాగ్ని స్వరూపు డైన ఆ పర మేశ్వరుని ,అతి కోప వీక్షణం ,లోకా లను దాహిస్తుంటే ,నీ కృపా వీక్షణం తో చల్ల బడి ,ఉప చారం పొందు తోంది .
విశేషం –స్వాధి ష్టానం లో సంవర్తెశ్వర ,సమయాంబ దేవ ,దేవీ యుగాళాన్ని పూజించాలి అని భావం.
40–”తటిత్వంతం శక్త్యా ,తిమిర పరి పంధి ,స్ఫురణయా –స్పురన్నానా రత్నాభరణ ,పరినేద్దేంద్ర ధనుశం
తవ శ్యామం ,మేఘం ,కమపి ,మణి పూరైక శరణం –నిషేవే ,వర్షంతం ,హర మిహిర తప్తం ,త్రిభువనం ”
తాత్పర్యం –మాలినీ !నీ మణి పూరక చక్రమే ముఖ్య మైన గృహం గా ఉండి ,అందులోని అంధ కారానికి శత్రువైన ,మెరుపు యొక్క ప్రకాశ శక్తి కలదీ ,అనేక రత్నా లచే నిర్మింప బడిన, నగల చేత అమర్చ బడిన, ఇంద్ర ధనుస్సు కలది ,శ్యామల వర్ణం కలిగి ఉన్నదీ ,హరుడు అనే మహా సంవర్తాగ్ని అనే ,సూర్యుని ఛే ,కాల్చబడిన ముల్లోకాలను ,తన వర్ష దారల చేత తడిపే ,వర్ణించ టానికి శక్యం కాని దైన మేఘం అనే సదా శివుని అధికం గా సేవిస్తున్నాను .
విశేషం –సూర్య కిరణాగ్ని ఛే మేఘాలు ఏర్పడి జల రూపం లో మణి పూరం లో ,ఆధార ,స్వాధిష్ఠానాల మధ్య ఉండే వాడు .అనాహతం పైన ,స్వాధిష్ఠాన అగ్ని తో కలిసి ,మణి పూరాన్ని చేరి ,జల రూపం పొంది ,ఆ జాలం చేత స్వాదిష్టానాగ్ని దగ్ధ మయ్యే జగత్తును తడుపు తున్నాయి .ఆది ఆగమ రహస్యం.
అరుణ ఉపనిషత్ లో ”యోపాం పుష్పం వేదా ”నుంచి ”ఇమే వై లోకా అప్సు ప్రతిష్ఠితా”వరకు ఉన్న దానిలో రహస్యం కూడా ఇదే నని విజ్ఞుల భావన .ఉదకం నుండి చంద్రుడు ,సూర్యుడు ,అగ్ని రోజులు ,నక్షత్రాలు ఉత్పత్తి అవుతున్నాయని భావం .ఉదకానికి సార భూతు డైన చంద్రుని యోగీశ్వరులు పొందుతారు .సూర్య మండలం లో అమృతం (శుక్రం )అన్ని చోట్లా పూరింప బడుతుంది .చంద్ర మండలం నుండి స్రవించే పీయూష (అమృతం )ధారల వాళ్ళ సూర్యుడు తపన కార్యం చేస్తాడు .మణి పూరకం లో శ్రీ చక్రం ప్రతిష్టితం .
మణి పూరకం లో మేఘేశ్వర ,సౌదామినులు ఉంటారు .అమ్రుతేశ్వర ,అమ్రుతేశ్వరి పేర్లతో పిలుస్తారు .ఇక్కడే104 మంది దేవతలు ,లోపాముద్రాదులు ఉన్నారని సాంప్రదాయం .”మేఘం నిషేవే –నితరాం సేవే భజామి ”అమ్రుతేశ్వర పేరు గల దంపతులను అనవరతం భజిస్తాను అని అర్ధం .
సశేషం –మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –3-10-12-కాంప్–అమెరికా
వీక్షకులు
- 1,107,435 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.1 వ భాగం.22.12.25.
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.3 వ భాగం.22.12.25.
- యాజ్ఞవల్క్య గీతా.8 వ భాగం.22.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.71 వ భాగం.22.12.25
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.2 వ భాగం.21.12.25.
- శ్రీ వసంతరావు వెంకటరావు గారి విజ్ఞాన వాస0త గీతాలు.1 వ చివరి భాగం.21.12.25.
- నోట్ బుక్స్ కోసం చెప్పుల్ని అమ్ముకొన్న ,ఐఫిల్ టవర్ కంటే ప్రపంచం లో ఎత్తైన చీనాబ్ రైల్వే బ్రిడ్జి పయనీర్ , భూసాంకేతిక సలహాదారైన శాస్త్రవేత్త, ‘’ఇండియన్ సైన్స్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్’’–శ్రీమతి గాలి మాధవీ లత
- యాజ్ఞ వల్క్య గీతా.7 వ భాగం.21.12.25. గబ్బిట దుర్గా ప్రసాద్ ప్రసారమైన అంశం సరసభారతి ఉయ్యూరు
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.70 వ భాగం.21.12.25. part -02
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.70 వ భాగం.21.12.25.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,547)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు

