సాహితీ బంధువులకు -శుభ కామనలు –ఏప్రిల్ నుంచి ఆరు నెలలు అమెరికా లో మా అమ్మాయి కుటుంబం తో సంతోషం గా గడిపి ,ఈ రోజే అక్టోబర్ అయిదు శుక్రవారం ఉదయం హైదరా బాద్ కులాసాగా చేరాం .భగవంతుని ఆశీస్సుల వల్ల ,మీ అందరి శుభా కాంక్షల వల్ల అంతా సవ్యం గా ఆనందం గా గడిచింది .ఈ ఆరు నెలలు అనునిత్యం ,సరస భారతి మిమ్మల్ని పలకరిస్తూనే ఉంది .మీ స్పందనను గమనిస్తూనే ఉంది .. మీ లాంటి వీక్షకులు ఉండటం సరస భారతి అదృష్టం .మీ నిండు ఆశీర్వచనాలు కలకాలం సరస భారతికి లభించాలని కోరు కొంటు
సాహితీ బంధువులకు శుభ వార్త –ఆకాశ వాణీ విజయ వాడ కేంద్రం వారి కోరిక పై ‘ఆలోచనా లోచనం ”శీర్షిక కునేను రాసిన వ్యాస పరంపరను ఆర్ష భారతీ వికాస పరిషత్ -గన్నవరం వారు పుస్తక రూపం లో తీసు కు వస్తున్నట్లు తెలియ జేశారు .త్వరలోనే పుస్తకం వెలువడు తుందని తెలియ జేయ టానికి సంతోషిస్తున్నాను .ఇది ”సరస భారతి ”కి లభించిన గౌరవం గా భావిస్తున్నాను మీ–దుర్గా ప్రసాద్


namaste welcome back ponnada sa pra rao
LikeLike