శ్రీ శంకరుల లలి(కవి )తా సౌందర్య లహరి –16
41–”త వా దారే మాతే ,సహా సమయ యా లాస్య పరయా –నవాత్మానం మన్యే ,నవ రస మహా తాండవ నటం
ఉభాభ్యా మేతాభ్యా ముదయ విధి ,ముద్దిస్య దయయా –సనాదాభ్యాం జజ్ఞే ,,జనక జననీ ,మజ్జాగదిదం ”
తాత్పర్యం –కౌమారీ !మూలాధారం లో నాట్య రూప నృత్యాన్ని తిల కిస్తు ,సమయ అనే పేరు కలిగి ,ఆనంద భైరవి అనే శక్తి తో కలిసి శృంగారం మొదలైన నవ రసాలతో ,తాండవ నృత్యం చేసే నటుడు అయిన ,నవాత్ముడు అయిన ఆనంద భైరవుని గా తలుస్తాను .దగ్ధ జగత్తు ను మళ్ళీ సృష్టించాలి అంటే ,ఆనంద భైరవీ ,భైరవు ల చేత మాత్రమె చేత నవు తుంది .
విశేషం –శివా శివు లిద్దరికీ ఆధార చక్రమే అధిష్టానం .జగత్తు కోసం జననీ జనకులు ఉన్నారు .అందుకోసమే ఇద్దరూ ప్రయత్నిస్తారు .నృత్యం లో ఇద్దరు ,ఏక రూపాన్ని పొందుతారు .ఇద్దరు అరుణ వర్ణులై ,అవస్థా రూప సామ్యం పొందారు .ఇద్దరు నవాత్మకలే .”తటి త్వంత్య్హం ”అంటే తటిత్తు ,విద్యుత్తూ కల వారు అని అర్ధం .హృదయ కమలం లోని భగ వతి ఐహిక ఫలాలన్నీ ఇస్తుంది .సకల విద్యా దానం చేస్తుంది .స్త్రీ వశీ కరణ శక్తి నిస్తోంది .హృదయ కమలం లో హోమ ,తర్పణాలు చేస్తే ,ఐహిక ఫలాన్నిస్తుంది .కనుక అంతరిక పూజ చేయా లని భావం .
జగత్తు ను ఉత్పత్తి చేయ టానికి లాస్య ,తాండవ పరాయణత్వం వల్ల మాతా ,పితృ భావం కలుగు తుంది .ఆధార చక్రం లో ప్రాణ నిరోధకం కాగా ,యోగి నృత్యం చేస్తాడట .ఆధార చక్రం లోనే విశ్వం అంతా కనీ పిస్తుంది .సృష్టికి ఆధార మైంది ఆధార చక్రం .ఇదే సర్వ వేదాలకు ,దేవతలకు ఉనికి పట్టు .
సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –14-10-12–ఉయ్యూరు .

