సాహిత్యం లో చైనా కు తోలి నోబెల్ సాధించిన మో యాన్
చైనా దేశానికి ఇంత వరకు సాహిత్యం లో నోబెల్ పురస్కారం లభించ లేదు .ఆ కొరతను తీర్చి రికార్డు సృష్టించారు చైనా రచయిత మో యాన్
ఇది చైనా వారికే కాక ఆసియా వారంతా గర్వించ దగిన వార్త .చైనా దేశపు జానపద సాహిత్యానికి లభించిన కీర్తి కిరీటంఇది .జాన పదాన్ని ,భ్రాంతి పూర్వక వాస్తవం తో జోడించిన రచనలను ఆయన చేసినందుకు లభించిన పురస్కారం .దీని తో చైనా ఒక్క సారి గా ప్రపంచ సాహిత్య పటం మీద చోటు దక్కించు కొన్నది .
-ఆయన అసలు పేరు గువాన్ మోయే.అయితే కలం పేరుగా ఆయన” మో యాన్” అనే పేరు ను ఎన్ను కొన్నారు .ఆ మాటకు చైనా లో అర్ధం -”మాట్లాడను(కు) ”అని . మన ”మౌనం ”- అనే మాట కు అది సరైన పదమేమో ?అంతే కాక చైనా లో రచయిత ల,కళా కారులపై పై నిర్బంధం,ఆంక్షలు సెన్సార్లు కూడా కారణం కావచ్చు .అది కావాలని ఎన్నుకొన్నమాట అన్న మాట .
-ఆయన అసలు పేరు గువాన్ మోయే.అయితే కలం పేరుగా ఆయన” మో యాన్” అనే పేరు ను ఎన్ను కొన్నారు .ఆ మాటకు చైనా లో అర్ధం -”మాట్లాడను(కు) ”అని . మన ”మౌనం ”- అనే మాట కు అది సరైన పదమేమో ?అంతే కాక చైనా లో రచయిత ల,కళా కారులపై పై నిర్బంధం,ఆంక్షలు సెన్సార్లు కూడా కారణం కావచ్చు .అది కావాలని ఎన్నుకొన్నమాట అన్న మాట .
చైనా లో షాన్ డాంగ్ కు ఈశాన్య ప్రాంతపు గ్రామీణ వాతా వరణం లో యాన్ చిన్న నాటి జీవితాన్ని ,కల్లోల పరిస్తితులను తన రచన ల లో ప్రతి బిమ్బింప జేశాడు .ఆయన పన్నేండవ ఏటనే స్కూలు జీవితానికి బల వంతం గా స్వస్తి చెప్ప వలసి వచ్చింది .ఆయనేమీ ఆగర్భ శ్రీ మంతుడు కాదు .కటిక దరిద్రాన్ని అనుభ వించిన వాడు .కడుపు నింపు కోవటానికి తిండి దొరక్క పోతే కలుపు మొక్కలను ,చెట్టు బెరడు లను తిని బతికిన వాడు .చిన్న తనం లో గొడ్లను కాసి బతికాడు .బియ్యం ఎలా ఉంటాయో తెలీని దుర్భర దారిద్ర్యాన్ని అనుభ వించాడు .ఆయనకు పన్నెండేళ్ళ వయసు లో మావో గారి సాంస్కృతిక విప్లవం ఆరంభ మైంది .దాని వల్ల గ్రామీణ జీవిత విభాగం ఎంత అల్లా కల్లోలానికి లోను అయిందో ఆయన రచనల లో ఆవిష్క రించాడు .వాటి నన్నిటిని యాన్ తాను రాసిన ”రెడ్ సొర్ఘం ”పుస్తకం లో అద్దం పట్టాడు .అది సినిమా గా వచ్చింది .చైనా దేశపు ప్రఖ్యాత సినీ దర్శకుడు ఝాంగ్ యిమౌవ్ ఆ నవలను అద్భుతం గా తెరకు ఎక్కించాడు .అది అవార్డులను గెల్చుకోన్నది .
యాన్ నవల ల లో ఇరవై వ శతాబ్దపు చైనా లోని కల్లోల పరిస్తులను ,,సాంస్కృతిక విప్లవం తెచ్చిన సంక్షోభాన్ని, బల వంత ,కుటుంబ నియంత్రణ లో చూపిన రాక్షస విధానాలను శక్తి వంత మైన పద జాలం తో ఎండ గట్టాడు .మూడేళ్ళ క్రితం ఆయన రాసిన ”ఫ్రాగ్ ”అనే రచన లో బల వంతపు భ్రూణ హత్యలకు ,వరుస గర్భ స్రావాలకు ప్రోత్సహించ టానికి సాక్షీ భూత మైన ఒక మిడ్ వైఫ్ జీవితాన్ని వర్ణించాడు , .
నోబెల్ పురస్కార ప్రకటన విన్న యాన్ ను పత్రికా విలేకరులు చుట్టు ముట్టి ప్రశ్నల పరంపర కురిపించారు .దానికి ఆయన చెప్పిన సమాధానం ఆయన వినయాన్ని తెలియ జేస్తుంది .”నా కంటే గొప్ప, మంచి , రచయితలు ఎందరో చైనా లో ఉన్నారు .వారంతా నాకంటే పెద్ద వారు .వారితో సమాన మైన సాహిత్య స్థాయి నాకు లేదు .అయినా నన్ను ఈ పురస్కారం వరించటం నాకు అమితాశ్చర్యం గా ఉంది ”అన్నాడు .ఆయన రచనలకు నేపధ్యం ఆయన స్వగ్రామమైన గోమి గ్రామమే .తనకు చైనా దేశమన్నా ,దాని గ్రామీణ జీవన మన్నా ,అక్కడి ప్రజలన్నా ,వారి జాన పద కధలన్నా వారి ఆచార వ్యవహారాలన్నా అమిత మైన ఇష్టం అన్నాడు యాన్ .అవన్నీ తన రచన లలో చోటు చేసుకొన్నాయని చెప్పాడు .తాను కలం పట్టి సాహిత్య సృష్టి ప్రారంభించిన నాటి నుండి జాన పద సంస్కృతికి సంబంధించిన మూల విషయాలకే ప్రాధాన్య మిస్తున్నానని చెప్పాడు .
1987 లో ఆయన సృష్టించిన ”రెడ్ సొర్గం ”.నవలా కధలో చైనా ను జపాన్ దేశం ఆక్రమించిన నాటి కాలం లో ఒక యువ తి జీవితాన్ని చిత్రించాడు .దీని తో ఒక్క సారి గా ఆయన ప్రసిద్ద రచయిత గా గుర్తింపు పొందాడు .ఆయన రచన లలో నాటకీయతకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది . అప్పటి నుంచి చైనా లోని విపత్కర పరిస్తితులను కళ్ళకు కట్టేట్లు రాస్తూనే ఉన్నాడు .సామాజిక జీవితాలను ఆదర్శ వంతం గా గడపాలన్న పూర్తీ నమ్మకం ఉన్న రచయిత యాన్ .అందుకే 1992 లో ”రిపబ్లిక్ ఆఫ్ వైన్ ”అనే రచన లో చైనా లోని తాగుడు సంస్కృతి ని,దాని తో ప్రభుత్వం లోఅన్ని స్తాయిలలో పెరిగిన అవినీతి ని ఎత్తి చూపించాడు .2004ఆయన రాసిన ”బిగ్ బ్రేస్త్స్ అండ్ వైడ్ హిప్స్ ”రచన లో క్వింగ్ రాజ వంశ పతన కాలం నేపధ్యం గా ఒక తల్లి, ఏడుగురు కూతుళ్ళ జీవితా లను చిత్రించాడు . .
మో యాన్ కు సాహిత్యం లో నోబెల్ పురస్కారం రావటం అక్కడ కొందరికి కంట గింపు గానే ఉన్నట్లు సమాచారం .అక్కడి రాజకీయం సాహిత్యం ఒకే గాడిన లేవని అంటున్నారు .చైనా రాజ కీయానికి వ్యతి రేకం గా రాసినందుకే బహుమతి వచ్చింది కాని ,ఆయన సాహిత్య ప్రతిభకు గుర్తింపు నిచ్చి కాదు అని అక్కడ చెవులు కోరుక్కున్తున్నారట .ఇది మామూలే .ఏమైనా సృజనాత్మక జాన పద సాహిత్యాన్ని పరి పుష్టి చేసిన రచయిత గా ,ప్రభుత్వ ప్రజా వ్యతి రేక కార్య కలాపాలను ప్రజల దృష్టికి తెచ్చిన ప్రజా రచయిత గా మో యాన్ గుర్తింపు పొందాడు .,ఆ ఘన విజయాన్ని తన దేశానికి మొదటి సారిగాలభింప జేసి ,తాను ఆ పురస్కారాన్ని దక్కించుకొని ,చరిత్రను సృష్టించిన రచయిత మో యాన్ కు అభి నందనాలు .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ — 12-10-12-కాంప్–హైదరా బాద్


