శ్రీ శంకరుల లలి(కవి )తా సౌందర్య లహరి –20
47 — భ్రువౌ భగ్నే కిన్చిద్భువన ,భయ భంగ వ్యసనిని –త్వదీయే ,నేద్త్రాభ్యాం ,మధుకర రుచిభ్యాం ద్రుత గుణం
ధనుర్మన్యే ,సవ్యేతర కర ,గృహీతం ,రతి పథెహ్ –ప్రకోస్తే,,ముష్టౌచ ,స్థగయతి ,నిగూ్dhaanతర ముమే ‘’
తాత్పర్యం –తల్లీ ఉమా దేవీ !జగత్తు లోని భయాన్ని పోగొట్టే దానివి నువ్వు .కొంచెం వంగి ఉండి,తుమ్మెద వరుసల్లాగా ,నీలి రంగుతో సుందరం గా ఉన్న నీ రెండు కండ్ల చేత కట్ట బడిన అల్లే త్రాడు తో కూడి ,ముడి పడ్డ నీ కను బొమల జంట ఎలా ఉందొ విను .రతి భర్త మన్మధుడు ఎడమ చేయి పిడికిలి తో పట్టు కొన్నప్పుడు కనపడ కుండా దాగి ఉన్న విల్లు మధ్య భాగం లా ఉన్న కోదండం అని అని పిస్తుంది .
విశేషం –మన్మధుని చాపానికి అల్లెత్రాడు తుమ్మెదల దండు .కనుబొమలు మన్మధుని ధనుస్సు లా ఉంటె ,కళ్ళు ,మధుర మైన నీలి రంగులో ఉన్నాయి .ఆమె భ్రూమధ్యం మన్మధుని చాప మధ్యమ గా ఉన్నదని భావం .ఆమె నిరంతరం జగత్తును ఉద్ద రించే ప్రయత్నం తోనే ఉంటుంది అని అర్ధం .
48—‘’అహస్యుతే ,సవ్యం ,తవ నాయన ,మార్కాత్మక తయా –త్రియామాం ,వామం ,తే ,సృజతి ,రజనీ ,నాయక తయా
త్రుతీయాతే దృష్టి ర్డ దలి త ,హేమామ్బుజ రుచిహ్ –సమాధత్తే ,సంధ్యాం ,దివస నిశయో రంతర చరీం .’’
తాత్పర్యం –జగద్దాత్రీ !నీ కుడి కన్ను సూర్యుడు అవటం వల్లపగలు కలుగు తోంది .కొంచెం గా వికశించిన ,బంగారు కమలం వంటి దైన ,నీ నొసలు లో ,ఉన్న మూడవ నేత్రం దృష్టి ,దివారాత్రాల మధ్య ఉండే ఉభయ సంధ్యలను ధరిస్తోంది .
విశేషం –ఆమె మూడు కళ్ళు –పగలు ,రాత్రి ,సంధ్యా కాలాలు .అవి కాల ఉత్పత్తి హేతువులు .ఆమె కాలానికి అతీత .పగలు ఉపాసనా కర్మకు ,రాత్రి నిశాకృత్యాలకు ,సంధ్య –అగ్ని హోత్రాదులకు వీలు కల్గిస్తుంది .పగలు జాగ్రత్ స్థితి ,రాత్రి సుషుప్తి ,సంధ్య స్వప్నాన్ని సూచిస్తాయి .జాగృత్ లో జ్ఞానం కలిగి ,సుషుప్తి లో అజ్ఞాన అంధకారం తొలగు తుంది .చంద్రాత్మక నేత్ర కాంతి జ్ఞాన మయ మైన సమాధి స్థితి కన్పిస్తాయి .సంధ్యారూప స్వప్నా వస్త జ్ఞాన భూమికకు సోపానం .జ్ఞాన దృష్టికి ,బ్రహ్మిక్యానికి మధ్యలో ఉండే స్తితే సంధ్య అని భావం .
సశేషం –మీ—గబ్బిట దుర్గా ప్రసాద్ –17-10-12-ఉయ్యూరు

