శ్రీ శంకరుల లలి (కవి)తా సౌందర్య లహరి –19
45—అరాలైస్వాభావ్యా ,దళికలభస శ్రీ భిరలకైహ్ –పరీతం తే వక్త్రం ,పరి హసతి ,పంకేరుహ రుచిం
దర స్మేరే యస్మిన్ ,దశన రుచి కిన్జిల్క రుచిరే –సుగంధౌమాద్యంతి ,సమర దహన ,చక్షుర్మధులిహః ‘’
తాత్పర్యం –అన్నపూర్ణేశ్వరీ !స్వభావ సిద్ధం గా ,తుమ్మెద రెక్కల నల్ల దనం తో ,కాంతి వంతం గా ఉన్న నీ ముంగురు లచే ,చుట్ట బడిన నీ ముఖం ,తామర పూవు సౌభాగ్యాన్ని పరి హసిస్తోంది .చిరు నవ్వు కల పంటి తళుకులు అనే కేసరాల విలాసం తో ,అందమైన సుగంధం కల ,ఆ ముఖం లో ,మన్మధుని దహించిన శివుని చూపులు అనే తుమ్మెదలు మోహ పడుతున్నాయి .
విశేషం –మన్మధుని దహించిన శివునికి కూడా ఆమె ముఖ సౌందర్యం వికారం పుట్టిస్తోంది .శివుడు ప్రకృతి స్వరూప లావన్యానికి ముగ్దుడౌతున్నాడని భావం .జిత మన్మదునికే అభిలాష కల్పించిన దేవి ముఖం యొక్క లోక ప్రియత్వం సర్వ లోకాతిశయంఅని గ్రహించాలి .
46—‘’లలాటం లావణ్యద్యుతి ,విమల మాభాతి తవయత్ –ద్వితీయం ,తన్మన్యే మకుట ఘటితం చంద్ర శకలం
విపర్యా సన్యాసా దుభయ మపి ,సంభూయచ ,మిదః –సుధా లేపస్యోథిహ్ పరిణమతి రాకా హిమ కరః ‘’
తాత్పర్యం –చిదగ్ని కుండసంభూతా !లావణ్యం అనే వెన్నెల చేత ప్రకాశించే ,నీ లలాటం ,రెండవ చంద్ర ఖండం గా భావిస్తున్నారు .మొదటి చంద్ర ఖండం నీ కిరీటం పైనే ఉంది .ఈ రెండు వ్యత్యస్తం గా ,అర్ధ వలయాలు గా ఉండటం వల్ల ,కలిసి నప్పుడు అమృతం పూత పోసిన పూర్ణిమా చంద్రుడే నేమో నని పిస్తోంది .
విశేషం –భగవతి ని చంద్ర మండలం అనే లలాటం లో నిలిపి ధ్యానిస్తే అమృతత్వ లాభం కలుగు తుందని భావం .
సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –17-10-12-ఉయ్యూరు
