శ్రీ శంకరుల లలి (కవి )త సౌందర్య లహరి –21
49—‘’విశాలా కళ్యాణీ స్ఫుట రుచిరయోధ్యా ,కువలయైహ్ –కృపా దారా ,ధారా ,కిమపి ,భోగవతి కా
అవంతీ ,సృష్టిస్తే ,బహునగర ,విస్తార విజయా –ధ్రువం ,తత్తన్నామ వ్యవహరణ యోగ్యా విజయతే ‘’
తాత్పర్యం –విశాలాక్షీ !నీ చూపు విశాలం కనుక ,విశాల అనే నగరం గా వెలసింది .కళ్యాణ ప్రదం కనుక ,కల్యాణి గా ,నల్ల కలవ కాంతి కలది కనుక అయోధ్యా ,కృప అనే అమృత ధారకలది ,కనుక దారా నగరం గా ,అవ్యక్త మధుర మైనది కనుక మధురగా ,సర్వ భోగ భూమి కనుక భోగ వతి గా ,ఆశ్రిత రక్షణం కనుక ,అవంతి గా ,విజయ దృష్టి ఉన్నది కనుక విజయ నగరం గా విల సిల్లింది .
విశేషం –నగరాల పేర్లను శ్రీ దేవి దృష్టు లతో శంకరులు సమన్వయించారు .విశాల దృష్టి అంతర్వికాసం కలది కళ్యాణీ దృష్టి ,విస్మితం తో కూడిన చిరు నవ్వు .అయోధ్య దృష్టి కడ గంటి హాసం .దారా దృష్టి అలసత్వం .మధురా దృష్టి వంకర చూపు భోగవతీ –మెరుపు చూపు .అంటే తళుకు కలది .విజయ దృష్టి కటాక్ష వీక్షణ మైన క్రీగంటి చూపు . కలది అని భావం .అవంతి ముగ్ధ మైనది .అంటే యవ్వన ప్రారంభ కన్యా దృష్టి కలది అని అర్ధం .ఈ ఎనిమిది దృష్టులు సంక్షోభ ,ఆకర్షణ ,ద్రావణ ,ఉన్మాద ,వశ్య ,ఉచ్చాటన ,విద్వేషణ ,మారణ కార్యాలు చేయిస్తాయి .శ్రీ దేవి చూపు లోని విశేష ప్రసారం తో ఆయా నగరనామాలు వర్ధిల్లాయి .అని రామ లింగేశ్వర రావు గారు చక్కని సమన్వయం చేశారు .
50—‘’కవీనాం ,సందర్భ స్తబక ,మకరందైక భరితం –కటాక్ష వ్యాక్షేప ,భ్రమర ,కలభౌ ,కర్ణ యుగళం
అముచంతౌ ,దృష్ట్వా ,తవ ,నవరసాస్వాద ,తరలౌ –అసూయా ,సంసర్గా ,దలిక ,నయనం ,కించి దరుణం ‘’
తాత్పర్యం –సినీ వాలీ !తల్లీ కవీశ్వరులు రస గర్భితం గా రచించిన కావ్య రచనలు అనే ,పూవు లోని తేనెను గ్రోలటం లో ,మక్కువ కల్గిన నీ చెవులను అంటి పెట్టు కొన్నవీ ,నవ రసాలను ఆస్వాదించ టం తో అమిత మైన ఆసక్తి కలవి అయిన ,నీ క్రీ గంటి చూపులు అనే ,నెపం తో ఉన్న తుమ్మెద సమూహాన్ని చూసి ,అసూయతో ,నీ ఫాల నేత్రం కొంచెం యెర్ర బడిందేమో నమ్మా .
విశేషం –ఆమె రెండు కనులు చెవులను తాకి ఉన్నాయి .ఆకర్ణ విశాల నేత్రాలు వాటికి అమృత పానం లభించింది .నొసటి లో ఉన్న మూడవ కన్ను కు ,ఆభాగ్యం కలగ లేదు .అందుకే అసూయ తో యెర్ర బడిందని భావం .లలాట నయనం అగ్ని రూపకమే .
సశేషం —మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ —18-10-12-

