. గురజాడ సర్వస్వమైన ‘’గురు జాడలు ‘’
ఒక రచయిత సాహిత్యాన్ని అంతటిని ఒక చోట చేర్చటం కష్టమైన పనే..అదీ నూట యాభై ఏళ్ళ నాటి రచయిత సాహిత్య సర్వస్వాన్ని ఒకే చోటికి చేర్చి అందించటం భగీరధ ప్రయత్నమే అవుతుంది .అసాధ్యం అని పిస్తుంది .కాని అసాధ్యాన్ని సుసాధ్యం చేసి మహా కవి ,తెలుగు జాతి వైతాళికుడు గురజాడ అప్పా రావు గారి సాహిత్యాన్ని సర్వాంగ సుందరం గా అందించారు’’ మనసు ఫౌండేషన్ ‘’వారు .దీన్ని తగిన సమయం లో అంటే గురజాడ నూట యాభై వ జన్మ దినోత్సవం నాడు అందించి తెలుగు జాతికి మహోప కారం చేశారు .వారి కృషి బహుదా ప్రశంశ నీయం .ఎక్కడా రాజీ పడ కుండా ఎంతో శ్రమ కోర్చి దీన్ని తీర్చి దిద్దారు .’’గురు జాడలు‘’అనే పేరు సార్ధకం చేశారు .’’అడుగు జాడ గురజాడ ‘’అన్న మహా కవి వాక్యానికి సజీవ దర్పణం ఈ గ్రంధం .దీన్ని వెలుగు లోకి తెచ్చిన వారందరూ పేరు పేరునా అభినంద నీయులు .
అయితే ఇందులో సింహ భాగాన్ని పోషించిన వారు స్వర్గీయ పెన్నే పల్లి గోపాల కృష్ణ గారు .నవతరానికి గురజాడ సాహిత్యాన్ని అందు బాటు లోకి తేవాలన్న వారి తపన ఫలించింది .తమ కృషి ఫలితాన్ని రుచి చూడ కుండానే వారు మరణించటం విచారకరం .గురజాడ అధ్యయన కేంద్రాన్ని నెల కొల్పి ,కన్యా శుల్కం పై అనేక వ్యాసాలను రాసి ,’’మధుర వాణి ఊహాత్మక ఆత్మ కద‘’తో కొత్త పుంతలు తొక్కిన గోపాల కృష్ణ గారే ఈ సర్వస్వానికి ప్రధాన సంపాదకులు .వీరికి సహకరించిన వారు శ్రీ కాళిదాసు పురుషోత్తం గారు .శ్యాం నారాయణ గారు ,వెంకట నారాయణ గారు మొదలైన వారి సలహా సంప్రదింపుల తో పుస్తకం సుందరం గా హస్తానికి ఆభరణం గా ఇమిడి పోయేట్లు రూపు దాల్చింది .బాపు చిత్రించిన ముచ్చటైన రంగుల గురజాడ ముఖ చిత్రం అదనపు ఆకర్షణ .ఆయన లోని ఠీవి దర్జా ,మూర్తీభవించి ,సజీవ చిత్రం గా కన్నుల ముందు నిలి చింది .
ఈ సర్వస్వం రూపు దాల్చటం లో పెన్నే పల్లి వారి అనుభవం ఎంతో సహకరించింది .ఆయన ఉదయం దిన పత్రిక కు సంపాదకులు గా పనిచేశారు .గురజాడ పై వచ్చిన విమర్శలను పదు నైన రచనా పాటవం తో త్రిప్పి కొట్టిన ఘనత వారిది .దక్షిణాఫ్రికా జాతీయ పోరాటా నికి భారతీయులు చేసిన కృషిని వివరిస్తూ వారు రచించిన ‘’ఇంద్ర ధనుస్సు ఏడోరంగు ‘’ప్రశంశ నీయమే కాక ,ప్రామాణిక గ్రంధం గా గుర్తింపు తెచ్చుకొన్నది .పరి శోధనకు ,కాల్పనిక సాహిత్యానికి మధ్య ఉన్న సరి హద్దు రేఖ ను చెరిపేసిన వారు గోపాల కృష్ణ గారు .ఆయన ‘’ఫెర్ఫెక్షనిష్టు ‘’గా గుర్తింపు పొందారు కనుకనే ఈ సర్వస్వాన్ని అంత పెర్ఫెక్ట్ గా తీసుకొని రాగలిగారు .
గురజాడ రాసిన అక్షర రాశి ఎక్కడెక్కడో చెల్లా చెదురు గా పడిఉంది .దీని నంతటిని సేకరించటం లో వీరందరూ పడిన శ్రమ అంతా ఇంతా కాదు ‘’.మనసు‘’వారిది మంచి మనసే కాదు అంతకు ముందు రావి శాస్త్రి ,కారా మాస్టారు ,శ్రీ శ్రీ ,బినా దేవి లలభ్య రచన లతో సర్వస్వాల ను అందించిన అనుభవం ఉన్న వారు .కనుక వీరు సంపూర్తిగా సంతృప్తి గా చేయ గలిగారు .గురజాడ డైరీల మీద పూర్వం ఎంతో వివాదం నడి చింది .అందుకని వీరు ఆ డైరీలను యదా తధం గా ఇంగ్లీష్వెర్షన్ తో చేర్చారు .గురజాడ వ్యక్తిత్వానికి ,రచన లకు సంబంధించిన దాన్ని దేన్నీ వదలకుండా చేర్చటం అభినంద నీయం .’’గురజాడ రాసిన దాని కంటే ,ఆయన పై తెలుగు జాతి రాసుకొన్నది ఎక్కువ’’అన్న మాట నిజం .అందులో పదార్ధం ఉండ బట్టే అంతా రాశారు రచయితలు .అంత విమర్శన గా చేశారు విశ్లేషకులు .
నేటి సమాజానికి గురజాడ అవసరం ఏమిటో చాలా విపులం గా చిత్రించారు వి.వి.నమూర్తి గారు .గురజాడ ‘’స్టాండ్’’ఏమిటో తెలియ జేశారు .’’మతము లన్నియు మాసి పోవును ,జ్ఞాన మొక్కటే నిలిచి వెలుగును ‘’అన్న గురజాడ ఆకాంక్ష సమస్త మాన వాళిఆకాంక్ష గా గుర్తించ టానికి ఈ సర్వస్వం దోహద పడాలని ఆకాంక్షించారు .నిజం గా నే వారి ప్రయత్నం సఫల మైందని భావించ వచ్చు .
ఈ సర్వస్వం లో గురజాడ జీవితం లో ప్రధాన సంఘటనలను సంవత్సర వారీగా చూపించారు .తరువాత గురజాడ కవితలను చేర్చి ,కన్యా శుల్క నాటకం తో ప్రారంభించి ,బిల్హణీయం ,కొండు భట్టీయం వేశారు .తొలి ఆధునిక కద గా గుర్తింపు బడ్డ ‘’దిద్దు బాటు ‘’కదానిక తో ప్రారంభించి కధలను చేర్చారు .తరువాతి స్థానం వ్యాస పరంపరకు లభించింది .మాటా మంతీ తో ప్రారంభించి ,కన్నడ వ్యాకరణాలకు సంబంధించిన భట్ట కలంకుడు తో పూర్తీ చేశారు తరువాత గురజాడ డైరీ లను .ఆయన ఆంగ్లం లో రాసిన myown thoughts ,correspondence ,ను చేర్చి చివరగా అందరు ఎదురు చూసే minute of descent తో సర్వస్వానికి మంగళ మహాశ్రీ పాడారు .
ఇంత విలువైన సమాచారాన్ని మనోహరం గా సుమారు పది హీను వందల పేజీలగ్రంధాన్ని సర్వాంగ సుందరం గా ,సంతృప్తి గా అతి తక్కువ వెలకు అంటే మూడొందల డెబ్భై అయిదు రూపాయలకే అంద జేయటం సాహసమే .దీనికి ప్రత్యెక అభి నందనాలు అంద జేయాల్సిందే.ఏమీ లేకుండానే పేజీలు నింపుకొన్న రచనలు అయిదొందల నుండి ఎనిమిది వందల రూపాయల వరకు అమ్ముతున్న ఈ రోజుల్లో ఇంత కనీస వెలకు ఇంతటి సర్వస్వాన్ని అందించి నందుకు ‘’మనసు ఫౌండేషన్‘’వారి విశాల మనసు కు బహుదా అభి నంద నలు .లాభా పేక్ష కాకుండా సాహితీ సేవా దృక్పధం లో చేసిన మహాత్తర కృషీ,కానుక ఇది . .ఈ అక్షర యజ్ఞం లో పాల్గొన్న వారందరినీ అభి నంద నీయులు ..
ఒక విన్నపం –దాదాపు పదేళ్ళ క్రితం నేను అమెరికా కు మొదటి సారి గా వెళ్ళిన సందర్భం లో లైబ్రరి లో అమెరికా కు చెందినప్రసిద్ధ కవి ,రచయిత సాహిత్య మార్గ దర్శకుడు ,సాహితీ విమర్శకుడు ‘’ఎడ్గార్ అల్లాన్ పో ‘’సాహిత్య సర్వస్వాన్ని చూశా ను ,చదివా.ను .అందులో ఆయన రచనలే కాక ,ఆయన తో పరిచయం ఉన్న వారందరి తో ఆయన తీయిన్చుకొన్న ఫోటోలను కూడా చేర్చారు .చాలా గొప్పగా ముద్రించారు .ముచ్చట గా నూ ఉంది .’’పో ‘’గురించి ఇంక ఎక్కడా వెతకాల్సిన పని లేకుండా చేశారు .అలాంటి సమగ్ర సర్వస్వం మనప్రశిద్ధ కవులు ,రచయితలు అయిన వీరేశ లింగం గురజాడ విశ్వ నాద శ్రీ శ్రీ మొదలైన వారి పై వస్తే బాగుండును అని ఆశ గా ఉండేది .గురజాడ సర్వస్వం ఆ లోపాన్ని దాదాపు పూర్తీ చేసింది .ఫోటోలు చేర్చటం నా అత్యాశ ఏమో కాని ఇక పై సర్వస్వాలు ప్రచురించే వారు ఈ విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలని మనవి .
‘’గురుజాడలు ‘’పేరుతో గురజాడ సర్వస్వాన్ని ఆంద్ర జనులకు అందించిన మనసు ఫౌండేషన్ వారికి ,ఈ విషయాన్ని నేనుఇటీవల అమెరికా లో ఉండగానే ముందుగా తెలియ జేసిన శ్యాం నారయన్ గారికి అందులో ఆయన పోషించిన పాత్రకూ అభి నందనాలు .సాహిత్యాభి మాను లందరూ కొని,చదివి ,దాచు కో వలసినవిలువైన పుస్తకం గురజాడ సర్వస్వంఅయిన” గురుజాడ లు ”
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –18-10-12–ఉయ్యూరు

