శ్రీ శంకరుల లలి(కవి )తా సౌందర్య లహరి -24

 శ్రీ శంకరుల లలి(కవి )తా సౌందర్య లహరి -24

55—‘’నిమేషోన్మేషాభ్యాం ,ప్రళయ ముదయం ,యతి జగతీ –తవే వ్యాహుస్సంతో ,ధరణి ధర రాజన్య తనయే

త్వదన్మేషాజ్జాతం ,జగదిద మశేషం ,ప్రళయతః –పరిత్రాతుం ,శంకే ,పరి హృత ,నిమేషాస్తవ ద్రుశః

తాత్పర్యం –మాతంగ తనయా !నీవు కను రెప్పలు మూస్తే ,జగత్ ప్రళయం సంభ విస్తుంది .కనులు తెరిస్తే ,జగత్తు ప్రభవిస్తుంది .ఇలా నీ కను రెప్పల కదలిక లో ,విశ్వ ఉత్పత్తి ,నాశనం జరుగుతున్నాయని వ్యాస మహర్షి మొదలైన వారు ,చెబుతున్నారు .నీ కనురెప్పల వికసనం వల్ల ,జన్మించిన ఈ సృష్టి అంతా ,నాశనం కాకుండా కాపాడటానికి నీ రెప్పలను మూయ కుండా అని మేష స్థితి లో ఉన్నావు .నీ దయ ఎంత గొప్పదమ్మా!

విశేషం –ఆమె రెప్ప పాటు లేకుండా ,నిరంతరం జగత్తును కాపాడుతోందని భావం .దేవి మహిమ అవాజ్మానగోచరం .

56—‘’తవాపర్నేకర్నె ,జపనయన ,పైశున్య చాకితాః—నిలీయన్తే తోయే ,నియతమ నిమేశాశ్శఫలికాః

ఇయంచ ,శ్రీర్బద్ధ చ్చదపుట ,కవాటం ,కువలయం –జహాతి ,ప్రత్యూషె,నిశిచ ,విఘటయ్యప్రవిశతి ‘’

తాత్పర్యం –అపర్నాదేవీ !నీ చెవుల వరకు వ్యాపించిన నీ రెండు కళ్ళు ,ఆ చెవులకు తమ రహస్యాన్ని వేల్లడిస్తాయేమో ననే భయం తో ,నీ కనుల రెప్ప పాటును దొంగిలించి ,ఆడు బెడిస చేపలు రెప్ప పాటు లేకుండా ,నీటిలో తమ రూపు కంపించ కుండా ,దాక్కున్నాయి .నీ నేత్రాలను చేరిన కాంతి ,అనే సౌభాగ్య లక్ష్మి ,ఉదయం పూట ,మూయ బడిన దొప్పల వంటి రేకులు కల ,నల్లకలువలను వదిలిపెడుతూ ,రాత్రి వేళ ,తలుపుల రూపం లో ఉన్న రేకులను తెరచికొని ,ఆ కలువలను ప్రకాశింప జేస్తోంది .అంటే నీ కనులు ఆకర్ణ విశ్రాన్తాలూ ,అసిత సుందరాలూ .

విశేషం —తమ సౌభాగ్యాన్ని శాఫరికలు అంటే బెడిస చేపలు దొంగిలించాయి అని కళ్ళు చెవులకు చాడీలు చెబుతున్నాయిఅని భావం .ఆడ బెడిస చేపలు నీళ్ళలో ఉండటం రెప్ప పాటు లేక పోవటం వాటి స్వభావ సిద్ధ గుణాలు .శ్రీ దేవి నేత్ర కాంతి ణి రాత్రులలో ,ఆమె నేత్రాలను వదిలి ,నీలోత్పలాల పై ప్రేమతో ,వాటిని కాపాడ టానికి వాటిని చేరుతున్నాయి రాత్రి పూతే కలువలకు వికాసం ఉంటుంది .పగలు ముడుచు కోవటం వాటి లోక రీతి .ఉదయమే ఆ కాంతి మళ్ళీ ఆమె ను చేరుతోందని భావం .అందుకని కలువలు ఉదయం ముడుచుకొంతాయి .

కాంతి లక్ష్మి పగలు ఆమె నేత్రాల్లో ,రాత్రి కాలువల్లో సంచరిస్తోందని అర్ధం .అపర్ణ అంటే శివుని కోసం పార్వతీ దేవి చేసే తపస్సు లో ఆకులను కూడా తిన కుండా ఉన్నది .లేక అపగత రుణ సంబంధం కలది అని అర్ధం .అంటే జగత్తు యొక్క సృష్టి ,స్తితి ,సంహార కర్మ లలో ,ఆలస్య కారణం గా ,యే కొంచే మైనా మిగిలిన కర్మ సమాపనం –అలాంటిది లేక పోతే అపగత రుణ సంబంధం అంటారని విజ్ఞులు తెలియ జేస్తున్నారు .చేపలు –కండ్లు చాడీలు చెబుతున్నాయి అనే భయం తో,శత్రు భయం తో  జలదుర్గం లో దాగాయి అని భావం .

సశేషం –మీ—గబ్బిట దుర్గా ప్రసాద్ –21-10-12-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.