శ్రీ శంకరుల లలి (కవి )తా సౌందర్య లహరి -26

 శ్రీ శంకరుల లలి (కవి )తా సౌందర్య లహరి -26

 

59—‘’స్పురద్గండా భోగ ప్రతి ఫలిత ,తాటంక యుగళం –చతుశ్చక్రం మన్యే ,తవ ముఖ మిదం మన్మధ రధం

 యమారుహ్య ద్రుహ్యత్సవని ,రధా మర్కెందు చరణం –మహా వీరో మారః ,ప్రమద పతి సజ్జిత వతో ‘’

తాత్పర్యం –ఆర్యా దేవీ !అద్దాల లాగా నిగనిగప్రకాశించే ,నీ చెక్కిళ్ళ పై ,ప్రతి ఫలిస్తున్న ,నీ కమ్మల జంటలు కల నీ ముఖం ఎలా ఉందొ తెలుసా ?/మొక్క వోని ప్రతాపం గల మన్మధుడు ఎక్కిన నాల్గు చక్రాల రధం లా ఉంది.ఆ చక్రాల రదం ఎక్కి ,,అతి లోక వీరుడైన మన్మధుడు సూర్య ,చంద్రులు అనే రెండే రెండు చక్రాలు గల భూమి అనే రధం ఎక్కి ,యుద్ధానికి వచ్చే ,త్రిపురాన్తకుడైన శివుని నే ఎదిరించ టానికి సిద్ధం గా ఉన్నాడు .ఇదంతా నీ కంటి చలువే .లేక పోతే మన్మధునికి అంత ప్రతాపం ఎక్కడిది ?

విశేషం –శ్రీ దేవి ముఖ లక్షణం అనే రధాన్ని ఎక్కి నందు వల్లనే ,మన్మధుడు మహా వీరుడై ,శివుని పై కాలు దువ్వుతున్నాడు అని భావం .రెండు చక్రాల రధం కంటే నాలుగు చక్రాల రధం బాగా నడుస్తుంది .బలం కూడా ఎక్కువ గా ఉంటుంది .అందుకే మన్మధుడు మహా శివుని ఎదిరించ గలిగాడు అనే భావం .మహాదేవుని కామ మోహిత చిత్త వృత్తీ ,ఆ మొహం ద్వారా లభించిన రసికతా ,భగవతి వదనార వింద శృంగార రసార్ద్ర భావం పుష్కలం గా ఉన్నాయి .ఆమే  లావణ్య కాంతి విశిష్టమైనదీ ,లోకోత్తర మైనదీ కూడా .

 60—‘’సరస్వత్యా సూక్తీ రంరుత లహరీ ,కౌశాలహరేహ్ –పిబంత్యా శ్శర్వానీ ,శ్రావణ చులుకాభ్యామవిరాలం

చమత్కార శ్లాఘా ,చలిత శిరసః కుండల గనో—ఝనత్కారై స్తారైహ్ ,ప్రతి వచన సమా చష్ట ఇవతే ‘’

తాత్పర్యం –శార్వానీ !అమృత ప్రవాహం లో ఉన్న మాధుర్యాన్ని ,,మార్దావాన్ని ,మించి పోయే తేనె పలుకులతో ,మధుర పద గుమ్ఫనతో ,నిన్ను సరస్వతీ దేవి స్తుతిస్తుంటే ,చెవులు అనే దోసిళ్ళ తో చక్కగా తాగుతున్నావు .ఆ స్తోత్రం లోని చమత్కారాన్ని శ్లాఘించ టానికి ,నీ శిరస్సు కది లిస్తుంటే ,నీ కర్ణ భూషణాలు అతి చక్కని ఝణత్కారం చేస్తూ ,ఆ స్తోత్రానికి తెల్పే ఆమోదం లాగా అని పిస్తోంది .      విశేషం –‘’తార ‘’అంటే ఓంకారం .పూర్వం అనుజ్న ఇవ్వ టానికి ఓం అనే వారు .బాగా ఉంది అనటానికి కూడా ఓం అనే అలవాటు ఉంది .సరస్వతీ దేవి చేసే ప్రార్ధనకు ,పార్వతీ దేవి మెచ్చి కోలుగా తల ఊపి నప్పుడల్లా ,కుండలాలు ‘’ఓం ‘’అనే నాదం తో అనుజ్న ను ప్రకటిస్తున్నాయట .శ్రీ శారదా దేవి యొక్క వాక్ అనే అమృతాన్ని చెవులు తాగుతున్నాయి .జిహ్వా పాణం కాదు కనుక చెవులే సమాధానం చెప్పాలి .అవి మాట్లాడ లేవు కదా .అందుకే కర్ణాభరణ ఝణత్కార రూపం లో ప్రణవ నాద మైన ఓంకార ధ్వని తో ప్రశంసిస్తోంది 

సశేషం —  

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

1 Response to శ్రీ శంకరుల లలి (కవి )తా సౌందర్య లహరి -26

  1. sunnA's avatar sunnA says:

    గురువుగారూ
    ఇటువంటి సాహిత్యం రాయాలంటే మానవమాత్రులవల్ల సాధ్యం కాదు. భవగత్కృప లేకపోతే ఇలాంటివి రాయడం సాధ్యమా? పోతన భాగవతం కూడా ఇలాగే ఉంటుంది. ఏమంటారు?

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.