అమెరికా పశ్చిమ సరి హద్దు దళ పతి –విట్ ఏర్ప్
నిత్య యాత్రికుడు ,చిక్కడు దొరకదు అని పించుకొన్న వాడు ,తనను తాను ఆవష్కరించు కొన్న వాడు ,అనేక ఉద్యోగాల చేసిన ఘనా పాథీ,సంఘర్షణ జీవి ,తల వంచని వీరుడు అని పించు కొన్న వాడు ,హాస్యం అంటే ఆమడ దూరం లో ఉండే వాడు ,డిప్యూటీ లామాన్ ,నేరస్తులకు సింహ స్వప్నమైన వాడు ఎనభై ఏళ్ళ వయసులో ఆరేళ్ళు మాత్రమె ఉద్యోగం చేసినా ,ఇప్పటికీ అతని పేరు నే స్మరించెంత గుర్తింపున్న వాడు విట్ ఏర్ప్.
విట్ పాత పశ్చిమం లో లా మాన్ ఉద్యోగం చేశాడు .అదేమీ ఫుల్ టైంజాబెమీ కాదు .పశువుల పట్నాలలో ,వాటిని వాగన్ ల దగ్గరకు తోలుకొని వచ్చే కౌ బాయ్ లతో గడిపే వాడు .ఒకలా హామా ,కాన్సాస్ ,టెక్సాస్ లకు పశువులను చేర్చటం ,వాటిని రైళ్ళలో తూర్పు ప్రాంతాలకు చేరచె తప్పుడు గుర్రాల దొంగ తనాలు ,తాగుడు ,విపరీతం గా ఉండేవి .పశువులను అమ్మిన డబ్బు చేతి నిండా ఉండటం తో జూదం ,తాగుడు వ్యభిచారం చేసే వారు కౌ బాయ్స్ .అందుకని వారి కందరికీ చేతిలో తుపాకి తప్పని సరిగా ఉండేది .వాళ్ళల్లో వాళ్ళు కలహించు కోవతమూ ఎక్కువే .ఆత్మా రక్షణ కోసం వారి కి తుపాకి అవసరమే .అందరి దగ్గరా ఆయుధాలు ఉంటె హింసే హింస .సాదా రణం గా మామూలు రోజుల్లో ప్రశాంతం గా ఉన్న టోన్లు ,వీళ్ళ రాకతో సందడే సందడి గా ఉండేవి .ఆ సమయాలలో నేరాల సంఖ్యవిపరీతం గా ఒక్క సారి పెరిగి పోయేవి .అందుకని శాంతి భద్రత కోసం ‘’పీస్ ఆఫీసర్లు ‘’ను నియమించే వారు .ఇది సీజనల్ జాబ్ .సంవత్సరం అంతా డేప్యూటీలు ,మార్శల్సు ,షరీఫు లకు ఉద్యోగం ఉండదు .అందుకని ఇంకో వ్యాపకం లో వారు ఆదాయం పొందుతారు .వ్యవసాయం ,రాన్చింగ్ ,ప్రాస్పెక్తింగ్ ,జూదం మొదలైన వి చేసి పొట్ట పోసుకొంటారు .
పైన చెప్పిన ఈ ఉద్యోగాలు చట్ట సమ్మత మైన వేమీ కాదు .అందుకొని వీరు ఒక్కో సారి చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొంటే కాని పరిస్థితులు చక్క బడేవి కావు .విట్ ఎర్ప్ ఒక్కో సారి చట్టానికి అతీతం గా వ్యవహరించాడు .దాని తో చిక్కుల్లో పడే వాడు .ఆ ఉద్యోగం ఒక చిన్న ప్రాంతానికి తప్ప మిగిలిన ప్రాంతానికి తెలీని వాడు గా ఉండేది .చాలా మొరటు మనుష్యుల తో వ్యవహరించాల్సి వచ్చేది .అతని పూర్తీ పేరు wytt Berry Stapp Earp .1848 march 19 న ఇలినాయిస్ లోని మాన్ మౌత్ అనే చోట పుట్టాడు .అతని ఇల్లు పదహారు ఎకరాల ఫారం హౌస్ .ఇది మెక్సికన్ అమెరికన్ యుద్ధం లో పని చేసి నందుకు ప్రభుత్వం ఇచ్చిన భూమి .ఎన్నో ‘’గన్ షాట్ల ‘’నుండి తప్పించుకొని బ్రతికాడు .విపరీత మైన ఒర్పున్న వాడు .టూమ్బ్ టౌన్ లో వ్యవ సాయం చేశాడు .మాంచి ‘’బఫెలో హంటర్ ‘’గా ప్రఖ్యాతి పొందాడు .చాలా నిశ్చయ బుద్ధి తో ఉండే వాడు .’’డాడ్జి సిటీ ‘’లో లా మాన్ గా పని చేశాడు .గనుల వ్యాపారమూ చేశాడు .కార్డ్ డీలర్ గా ఉన్నాడు .దీనికి తోడు స్టేజి కోచ్ డ్రైవర్ గా కూడా పని చేశాడు .పెద్ద పెద్ద సెలూన్ ళ అది పతి అయాడు .
ప్రభుత్వం అతనికి ‘’shot gun riffle ‘’ను నేటివ్ ఇండియన్ల నుండి ప్రాణ రక్షణ కోసం ఇచ్చింది ‘’.six gun ‘’ను పొంది పేల్చటం నేర్చు కొన్నాడు .గొప్ప గురి ఉన్న మొనగాడనిపించుకొన్నాడు .కాలిఫోర్నియా లో రైల్ రోడ్ వర్కర్ గా కూడా వెలగ బెట్టాడు .మళ్ళీ తూర్పు కు వెళ్లి బఫెలో హంటర్ గా మారాడు .”’wagon train scout ‘’గా కూడా పని చేశాడు .ఇరవై రెండేళ్ళ వయసులో యూరిల్లా సండ ర్లాండ్ తో పెళ్లి జరిగింది .ఒక్క ఏడాదే ఆమె బతికింది .
ఒక్ల హామా అని పిలువ బడే ఇండియన్ టేరిటరి కి వెళ్లాడు .మళ్ళీ బఫెలో హంటింగ్ లో కాలక్షేపం చేశాడు .అతడు రేసు గుర్రాలను దొంగిలించే వాడని అభి యోగం వచ్చింది . బెయిల్ పొంది ,.కాన్సాస్ కు చేరుకొన్నాడు .’’Dedliest pistol shot ‘’గా ,’’great courageous person ‘’గా ఖ్యాతి పొందాడు .’’లెజెండ్ ‘’అనిపించుకొన్నాడు .కౌ బాయ్స్ ల ఆట కట్టించి ,దుండగులను గుర్తించటం లో దిట్ట అని పించుకొన్నాడు విట్ ఏర్ప్ .
సశేషం
మరిన్ని విశేషాలు ఈ సారి –
విజయ దశమి శుభాకాంక్షల తో –
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –24-10-12—ఉయ్యూరు


That’s Why Swami Vivekananda Says “Hey…This Western people are true Kshtriyas in nature…People with Lion’s Heart.With the strength in Body….A strong mind will evolve..”.
LikeLike