శ్రీ శంకరుల లలి (కవి )తా సౌందర్య లహరి –28
63—‘’స్మిత జ్యోత్స్నా జాలం ,తవ వదన చంద్రాస్య పిబతాం –చకోరాణా మాసి దతి రసతయా ,చంచు జడిమాఅతస్తే ,శీతాంశో రమృతలహరీ రామ్ల రుచయః –పిబన్తి స్వచ్చందం ,నిశి ,నిశి ,భ్రుశం కాంచి కధీయా ‘’
తాత్పర్యం –చండికా !నీ ముఖ చంద్రుడి చిరు నవ్వు అనే వెన్నెలను త్రాగే చకోర పక్షులకు ,త్రాగి ,త్రాగి ,అతి మాధుర్యం వల్ల అరుచి కలిగింది .అందుకే అవి పులుపు మీద ఇష్టం తో చంద్రుని అమృత కిరణాల పొంగునే బియ్యం కడుగు గా భావించి ,ఇష్టం వచ్చి నంత వెన్నెల రాత్రులలో తృప్తి గా తాగుతున్నాయి .
శ్రీ దేవి ముఖచంద్ర మంద హాస కాంతులు చంద్ర కిరణ మాధుర్యం కంటే గొప్పవి అని భావం .
64—‘’అవిశ్రాంతం ,పత్యుర్గున గణ కదా మరేద ణ జపా –జపా పుష్పచ్చాయా ,తవ జనని ,జిహ్వా జయతి సా
యదగ్రాసీనాయాఃస్పటిక ద్రుషదచ్చచ్చ విమయీ –సరస్వత్యా మూర్థిహ్ పరిణ మతి ,మాణిక్య వపుషా ‘’
తాత్పర్యం –కదంబ వన వాసినీ !నీ జిహ్వాగ్రం మీద ఆసీన అయిన సరస్వతీ దేవి యొక్క శుద్ధ స్పటిక మణి కాంతి చేత ప్రసిద్ధ మైన స్వరూపం ,పద్మ రాగ మణి ఎరుపు రంగుగా మారుతోంది .ఎందు కంటే ఆమె కు ఆశ్రయ మైన నీ నాలుక నిరంతరం ,నీ భర్త అయిన శివుని గుణ గణ కద ను ,జపం లాగా విని ,విని ,జపా పుష్పం యొక్క కాంతి వంటి కాంతి కలదై ,యెర్రని రంగు కలదై ప్రకాశిస్తోంది .
విశేషం –శ్రీ దేవి జిహ్వ తాను ఎరుపు రంగు తో ఉండటం మాత్రమె కాదు ,తటస్తు లైన వారిని కూడా ఎరుపు రంగు కల వారిని గా చేస్తోందని భావం .శ్రీ దేవి నాలుక మీద నిత్య నివాసి అయిన సరస్వతి దేవి ‘’మాణిక్య వపుష ‘’గా పరిణ మిస్తోందని అర్ధం .
సశేషం –మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –25-10-12-

