అమెరికా పశ్చిమ సరి హద్దు దళ పతి విట్ ఏర్ప్-2
విట్ చిన్నతనం లో అతని తండ్రి కుటుంబాన్ని ‘’మిడ్ వెస్ట్‘’నుంచి కాలి ఫోర్నియా కు మార్చాడు .అందరు చిన్న వాగన్ ట్రైన్ ఎక్కారు .దాన్ని ఇరవై కి పైగా గుర్రాలు లాగే బండ్ల తో నడిచింది .వాళ్ళను వాళ్ళు రక్షించు కోవటం ,పరస్పర సహకారానికి అలా ప్రయాణం చేసే వారు .దారిలో బఫెలో హంట్ చేసే వారు .అప్పుడు జిం బ్రిద్జేర్ అనే అతను బఫెలో హంట్ లో ఎక్స్పెర్ట్ .దారిలో నేటివ్ ఇండియన్స్ తో పోరాడా వలసి వచ్చేది .
కాలి ఫోర్నియా లో సాన్బెర్నాన్దినో లో ఉన్నారు .అప్పుడు అక్కడ జనాభా రెండు వేలు మాత్రమె .అది ‘’గోల్డ్ రష్‘’కాలం .ఎర్పి పది హేడేల్ల వయసు లో స్టేజ్ కోచ్ డ్రైవర్ గా పని చేశాడు .అతడికి అప్పుడు గుర్రాలంటే మహా సరదా గా ఉండేది .ప్రయాణం అంటే బలే సంతోషం .ఇక్కడే మొదటి సారి విస్కీ తాగాడు .తర్వాతా ఇరవై ఏళ్లలో మందు తాగనే లేదు .బఫెలో హంట్ చేసినా ,పీస్ ఆఫీసర్ గా పని చేసినా మద్యం జోలికి వెళ్ళక పోవటం ఆశ్చర్యం వేస్తుంది .రైల్రోడ్ నిర్మాణానికి సరుకులు చేర వేసే వాడు దీన్నే ‘’స్టీం స్టార్ ‘’అంటారు .దీనితో అతని ప్రయాణం సరదా బాగా తీరింది .ఎప్పుడూ తీరిక లేకుండా గుర్ర బ్బండీ లో సామాన్లు చేర వేసే వాడు .ఈ పని అతను కాలి ఫోర్నియా నుంచి అరిజోనా వరకు చేసే వాడు .దీన్ని ఎక్కువ కాలం చేయలేదు .తండ్రి కుటుంబాన్ని మళ్ళీ మిడ్ వెస్ట్కు మార్చాడు .
తండ్రి లా గానే ఎర్ప్ కూడా లా ఆఫీసర్ అయ్యాడు .1869 లో తండ్రి ఉద్యోగం ఇతనికి వచ్చింది .తండ్రి శాంతి నిర్వహణ న్యా యాది పతి గా నియమింప బడ్డాడు .కొడుకు ‘’షరీఫ్ ‘’అయాడు .ఆ ఊళ్ళో న్యాయాన్నీ ,చట్టాన్నే అమలు పరచే బాధ్యత వీరిద్దరిదే .చట్టాన్ని అతిక్ర మించే వారి గుండెల్లో రైళ్ళు పరి గేత్తించారుచాతండ్రీ కొడుకూ.
లా మార్ అనే చోట లా ఆఫీసర్ ఉద్యోగం హాయిగా ఉంది .పెద్దగా నేరాలు ,ఘోరాలు లేవు .1870 లో స్వంత ఇల్లు కొనుక్కొని ఉరిల్లా ను పెళ్లి చేసుకొని ఒక ఇంటి వాడయ్యాడు .ఏడాది లోపే ఆమె చని పోయింది .అతనికి వ్యతి రేకం గా కేసు పెట్టారు .రిజైన్ చేసే శాడు .డబ్బు దుర్విని యోగం చేశాడని ,లైసెన్సుల కోసం ఇచ్చిన డబ్బు ను జమ చేయ లేదని అతని పై అభి యోగం .ఇల్లు అమ్మేశాడు ఈ నాడు ఒక్లహామా అని పిలువాబడే ఇండియన్ టేరిటేరి చేరాడు .ఇక్కడ గుర్రాలను దొంగి లించటం ఆ నాడు పెద్ద నేరం .అలా చేశాడని మళ్ళీ అభి యోగం .అరెస్ట్ వారంట్ వస్తే ,అక్కడి నుంచి నెమ్మది గా జారుకొన్నాడు .ఎవరికి కానీ పించాకుండా తిరిగాడు .చివరికి ఇలినాయిస్ లోని పియోరియా చేరాడు .వ్యభి చార గృహం లో ఉన్నట్లు పోలీస్ రికార్డుల్లో ఉంది .ఇక్కడి రివర్ బోట్లో బ్రోతల్ హౌస్ నిర్వ హించాడు .ఇదంతా జులాయి తిరుగుడే .బఫెలో హంటర్ గా కూడా ఉన్నాడు .మాంచి వేట కాడని మహా గొప్ప పేరు .రోజుకు రెండు వందల అడవి దున్న పోతుల్ని వేటాడ గలడు అని గుర్తింపు పొందాడు .ఈ ప్రాంతాల్లో వీటి సంఖ్యా మిలియన్ల లో ఉండేది .బఫెలో మాంసం అంటే సైనికులు రోట్టలేసుకొని తింటారు .అంత ఇష్టం వారికి .వేట గాల్ల బారి పడివేల సంఖ్య లో మిగిలాయి .ఇప్పుడు అపురూపం అయి ,అంత రించే స్తితి లో ఉన్నాయి .ఈ సరి హద్దు ప్రాంతాల్లో వెండి ,బంగారు గనులున్నాయి .గొడ్లపెంపకం ఎక్కువ .గనుల వల్ల టౌన్లు బాగా పెరిగి పోయాయి .రైల్ రోడ్ కూడా జనాభా పెరగటానికి కారణం అయింది .
వంటి మీద కు ఇరవై ఏళ్ళు వచ్చే సరికి ఎర్ప్ హంటింగ్ మానేశాడు .బఫెలో గన్ అమ్మేసి కాన్సాస్ లోని’’ విచిటా’’చేరాడు .టెక్సాస్ నుంచి వచ్చే కాటిల్ డ్రైవర్స్ తో బాగా రద్దీ గా ఉండే ప్రదేశం ఇది .అక్కంసన్ నదీ తీరం కూడా .అందమైన లాండ్ స్కేప్ .ఇక్కడ అన్నీ చెల్లు బాటు అవుతాయి .కౌ బాయ్స్ కు విహార భూమి .కనుక తగాదాలు ,గొడవలు ఎక్కువ .’’లా మాన్ ‘’అవసరం చాలా ఉండేది .వారంతా తాగితే మనుష్యలు గా ప్రవర్తించరు .అక్కడ అమాయకుల పాలిటి మరణ మ్రుదంగమే .ఈ డ్రోవర్స్ వల్ల పెద్ద ఆదాయం వస్తుందక్కడ .అందుకని అక్కడి వర్తకులు ఆగడాలను సహించి ఊరు కోవలసి వస్తోంది .ఈ కౌ టౌన్ లో శాంతి భద్రతలు నెల కొల్పటం సున్నిత మైన వ్యవహారమే .సమర్ధు డైన ‘’లా మాన్‘’కావాలని అందరి అభిప్రాయం .ఈ వాతా వరణానికి తానే తగిన లా మాన్ అని అనుకొన్నాడు విట్ ఎర్ప్ .కొట్లాటలంటే భయం లేదు .పైగా బలిష్టుడు .ధైర్య శాలి .స్వచ్చంద మార్షల్ గా చేరాడు .పై రాబడి బాగానే ఉండేది .1875లో జీతం తో డిప్యూటీ గాఉద్యోగం ఇచ్చారు .బారుల్లో వచ్చే తగాదాలు కూడా తీర్చాల్సి వచ్చేది .అతని మొరటు పద్ధతికి తగిన ఉద్యోగమే .
డిప్యూటీ మార్షల్ గా బాగా పరిణతి చెందాడు .వీలైనప్పుడల్లా దొరికిన పని చేసే వాడు .వ్యక్తిత్వం పెంచుకొన్నాడు .శక్తి ,విధేయత ,ఆత్మ విశ్వాసం ,గౌరవం పెరిగాయి .విచిటాకు తగిన ఆఫీసర్ అని పించుకొన్నాడు .ఒక సారి ఒక తాగు బోత ఫుల్ గా మందుకొట్టి రోడ్డు మీద పడి పోయాడు .వాడి దగ్గర అయిదు వందల డాలర్లు ఉన్నాయి .అతన్ని నెమ్మది గా లేపి ,ఆ డబ్బుతో వాడిని ఇంటికి చేర్చాడు .ఈ వార్త వార్తా పత్రికలలో కధలు ,గాధలుగా వచ్చింది .అతను ఎంత గొప్ప ఆఫీసారో రుజువు చేసే సంఘటన ఇది .అరుదైన వ్యక్తీ అన్నారందరూ .
విలియం బాట్ అనే అతని తో స్నేహం చేసి జూదం ఆడే వాడు .పీస్ ఆఫీసరు గా పని చేస్తూ ,గుర్రపు దొంగల్ని పట్టిస్తూ మంచి పేరు తెచ్చుకొన్నాడు .ఈ ఉద్యోగమూ ఒక్క ఏడాదే .స్మిత్ అనే వాడితో తగాదా పడి వాడిని చావ చితక్కోట్టాడు .ఉద్యోగం హుళక్కి .పని లేక పోతే ,అతనికి పిచ్చులూ ,వేర్రులూ ఎత్తెది .క్రమంగా శాంతి భద్రతలు మెరుగై నాగరకత ఆ ప్రాంతమంతా విచ్చుకోంది .ఇదంతా విట్ ఎర్ప్ పుణ్యమే .
అక్కడి నుంచి ఇంకో బూమింగ్ సిటీ ‘’డాడ్జి సిటి ‘’కి చేరాడు .ఇది కేంసాస్ లో ఉండి .అది ఒకప్పుడు బఫెలో కాంప్.పెద్ద కౌ టౌన్ గా పెరిగి పోయింది .అన్నే అనే బ్రోతల్ తో ఇక్కడికి చేరాడు .కొన్నేళ్ళు భార్యా భార్తల్లా జీవించారు వారిద్దరూ .ఈ సిటీ చాలా మురికి కూపం గా ఉండేది .సౌకర్యాలు లేవు .గోల ,గుర్రబ్బగ్గీల రద్దీ .డ్రోవర్సు ,పశువులు కొనే వాళ్ళు ,సోల్ జర్లు ,బఫెలో హంటర్లు ,రైల్వె వర్కర్ల తో మహా సందడి గా ఉండేది .అందుకే దాడ్జి సిటి ‘’క్వీన్ ఆఫ్ ది కౌ టౌన్స్ ‘’అని పేరొందింది .దీనితో అసాంఘిక కార్యాలకు అడ్డా అయింది .వేశ్యలు ,హంతకులు ,జూద గాళ్ళు ,గుర్రం దొంగలు అంతా అక్కడే ఉండే వారు .తాగుడు ,వ్యభిచారాల తో హోరెత్తి పోతోంది .ఎర్ప్ కు ‘’లా మాన్’’ గా పని చేయాలనే కోరిక మళ్ళీ కలిగింది .డిప్యూటీ మార్షల్ (హైరేడ్ )గా పోలీసులు అద్దెకు అంటే హైర్ చేసుకొన్నారు ఎర్ప్ ను .
సశేషం –ముగింపు ఈ సారి
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –25-10-12-ఉయ్యురు

