శ్రీ శంకరుల లలి (కవి )తా సౌందర్య లహరి –30
67—‘’కరాగ్రే ణస్పృష్టం తుహిన గిరిణావత్సలతయా –గిరీశేనో దంతం ,ముహురధర ,పానా కులతయా
కర గ్రాహ్యం శంభోర్ముఖ ముకుర వ్రుంతం ,గిరి సుతే –కదం కారం ,బ్రూమస్త వ చుబుక మౌపామ్య రహితం .
తాత్పర్యం –అమ్మా విష్ణు సోదరీ !నీ తండ్రి హిమ వంతుడు నీ మీద మిక్కిలి పుత్రికా వాత్సల్యం తో నీ చుబుకాన్ని పునుకు తాడు .నీ పతి పశు పతి నీ క్రింది పెదవి మాధుర్యాన్ని చవి చూసే సందర్భం లో మాటి మాటికీ నీ ముఖాన్ని పైకెత్తు తు ,శంభుని చేతి తో తీసుకోన దాగిన ముఖం అనే అద్దానికి పిడిని వర్ణించ టానికి తగిన వస్తువే లేక పోయింది .అలాంటి నీ చుబుకాన్ని ఎంతని వర్ణించాను ?
విశేషం –శివుడు శ్రీ దేవి చుబుకాన్ని చేత్తో పట్టుకొంటున్నాడు .కారణం –ఆమె ముకుర వ్రుంత కనుక ఆ ముఖ దర్పణానికి చుబుకం పిడి అవటం వల్ల పట్టుకొని ,ఆ అద్దం లో తన ప్రతి బింబాన్ని చూసు కొంటున్నాడు అని భావం .శృంగార సమయం లో స్త్రీలు తల వంచుకొని ఉంటారు .ఆ ముఖాన్ని పైకి ఎత్తితేనే ‘’సు చుంబనం ‘’అవు తుంది .అంటే చక్కని ముద్దు సాధ్యం అవుతుంది .సమగ్ర లావణ్యం కలిగింది కనుక చుబుకాన్ని పోల్చా టానికి ఏ వస్తువూ లేదు .అనుపమమైనది అని అర్ధం .
68 –‘’భుజా శ్లేషాన్నిత్యం ,పుర దమయిథుహ్ కంటక వతీ –తవ గ్రీవా ధత్తే ,ముఖ కమల నాళశ్రియ మియం
స్వతః శ్వేతా కాల గురు బహుళ జంబాల మలినా –మ్రుణాలీ లాలిత్యం వహతి ,యదదో హార లతికా ‘’
తాత్పర్యం –మూల మంత్రాత్మికా !సహజం గా స్వచ్చ మైనదీ ,కృష్ణా గరు చేత నల్లనైనదీ ,ముత్యాల సరాలున్న తీగలు కలది ,అయిన నీ కం థనాళం ,కలువ తూడు లాలిత్యాన్ని ,పొంది ,త్రిపుర మదనుడైన ఈశ్వరుని బాహువు లచే ,ఆలింగనం తో ,నిత్యం రోమాన్చాలనం కలది ముఖ పద్మనాళ శోభ తో విరాజిల్లు తోంది .
విశేషం –ముఖం పద్మం .నాళం –కమల నాళం .పరమ శివాలింగానం తో కలిగిన రోమాన్చలం కలిగిన నాళం అందులోని కంటకాలు అంటే ముళ్ళు కంథం కింద పూయ బడిన క్రిష్ణాగరు గంధపు బురద ..ముత్యాల హారాల ,తామర తూళ్ళు .
సశేషం –మీ– గబ్బిట దుర్గా ప్రసాద్ –27-10-12-ఉయ్యూరు
—
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

