అమెరికా లో జర్మన్ హవా –3

 అమెరికా లో జర్మన్ హవా –3

1756-63 మధ్య ఏడేళ్ళు జర్మన్ యుద్ధం జరిగిన కాలం లో అక్కడి నుంచి వలసలు లేవు .ఈ కాలం లోనే బ్రిటన్ సముద్రాది పత్యాన్ని సాధించిన తర్వాత240ఓడల లో ఫిలడెల్ఫియా చేరారు .అందులో జర్మన్లె ఎక్కువ .1747 లో గవర్నర్ థామస్ రాష్ట్రం లోని రెండు లక్షల జనాభా లో 3/5వంతు మంది జర్మన్లె అని రాశాడు .స్తానికులకు అసూయ పెరిగి ,ఆందోళన కు దిగారు .1753లో అమెరికా స్వాతంత్రోద్యమ నాయకుడు ,శాస్త్ర వేత్త బెంజమిన్ ఫ్రాంక్లిన్ జర్మన్లను సమర్ధించాడు .1750 లో పద మూడు కాలనీలలో ,జర్మన్ల సంఖ్య పెరిగింది .అప్పటికే రెండు లక్షల యాభై వేల మంది జర్మన్లు చేరారు .న్యూయార్క్ ,న్యూ జెర్సి రాష్ట్రాలలో కూడా జర్మన్ల హవా సాగింది .ఇరవై శాతం మంది మేరి లాండ్ ,వర్జీనియా ,కరోలినాస్ ,జార్జియా లకు చేరుకొన్నారు .

          న్యు ఇంగ్లాండ్ అని పిలువ బడే మాసా చూసేత్స్ లో కూడా జర్మన్లు చేరారు .అక్కడ ప్యూరిటన్లు ఎక్కువ .వారు మత వ్యతి రేకుల్ని సహించరు .ఇతర దేశీయులు మొదట చేరిన ప్రదేశం కావటం వల్ల, భూమి తగి నంత భూమి లభ్యం కాలేదనే భావం కూడా కారణం కా వచ్చు .సున్నపు  గనులున్న ప్రాంతాలే తమకు అనుకూలం అని జర్మన్లు భావించారు .దక్షిణ ప్రాంతం లో ప్లాంటేషన్ ఎక్కువ .అమెరికా జర్మన్ల కు బానిసలు లేరు .బానిసత్వానికి వ్యతిరేకులు కూడా .ఫ్రాన్సిస్ పాస్తోరియాస్ ,డచ్, జర్మన్ క్వేకర్లు 1688 లోనే బానిసత్వానికి వ్యతి రేకం గా ప్రచారం చేశారు .ఫిలడెల్ఫియా లో గొప్ప బహిరంగ సభ నిర్వ హించారు .

          ఒక మేన్నో నైట్ రైతు తన స్నేహితుడు బానిసలను క్రూరం గా హింసించ టాన్ని చూసి ,వారింట్లో నిద్ర కూడా పోకుండా బయటే పొలం లో పడుకోన్నాడట .జర్మన్లు కాలనీలు మారారు .1709 లో పలా ట నైట్ లపై ఫ్రెంచి సైన్యం దాడి చేసింది .దానితో పద మూడు వేల మంది  శరనార్ధులుమెయిన్ ,నేక్కార్ ,రాయి రెయిన్ రివర్  ల గుండా ,లండన్ చేరారు .జ్వరాలు పీడించాయి .అప్పుడు ప్రోటేస్తంట్ అయిన ‘’క్వీన్ అన్నే ‘’వారి లోని రోమన్ కాధలిక్కు లను అయిర్ లాండ్ కు పంపించింది .ఆరు వేల ఆరు వంద ల మంది సెటి లర్సు ను నార్త్ కరోలినా పంపించింది .వీరు న్యు బార్న్ లో చేరారు .అక్కడి టెక్సా రోమా ఇండియన్లు చేసే దాడులను తప్పించు కోవా టానికి రాణి ఆజ్ఞా తో రెండు వేల ఎనిమిది వందల పద్నాలుగు మంది ను హడ్సన్ వాలీ ప్రాంతానికి పంపారు .అక్కడ తారు ,టర్పన్ టైన్ ,తయారీ లో సాయం చేశారు .వీరికి సరి హద్దు లను కాపాడే బాధ్యత ను అప్ప గించారు .

          లండన్ నుంచి న్యు యార్క్ కు ఓడ లో రావటానికి ఆరు నెలలు పట్టేది .పంపించిన ప్లానటినేర్స్ లో నాలుగో వంతు మంది దారిలోనే చని పోయారు .న్యూ యార్క్ చేరిన వారికి తగిన ఏర్పాట్లు కూడా చేయ లేదు .గుడారాల లోనే కాపురాలుండా వలసి వచ్చింది .జబ్బుల పాలైనారు .

మళ్ళీ క్వీన్ అన్నే కల్పించుకొని భూమిని కేటా ఇంచింది .కాని రాబర్ట్ లివింగ్ స్టేన్ అనే ఆయన ఆ భూమి అంతా తనదే నని ,వాళ్ళ తో  హెమ్ప్ పంట కు వారిని వాడు కొన్నాడు .ఇంటి అద్దె ,రవాణా ఖర్చులు వసూలు చేశాడు .1713 లో దీన్ని సహించ లేక ‘’జాన్ కాన్రాడ్ వీసర్ ‘’అనే ఇమ్మిగ్రంట్ ఎదురు తిరిగాడు .కాని ఫలించ లేదు .స్ప్రింగ్ సీజన్ లో నూట యాభై కుటుంబాలు నలభై మిల్ల దూరం లోని schohairieకు చేరారు .పరిస్థితులు అను కూలించాయి .పంటలు బాగా పండాయి .ధాన్యం మిల్లు వచ్చింది .

            లివింగ్ స్టేన్ తో సహా ఏడుగురు మళ్ళీ అడ్డు కొన్నారు .అద్దె కట్టమంటే కట్టం పొమ్మని ఎదిరించారు .వీజర్ ,రాణి దగ్గర కు వెళ్లి ఫిర్యాదు చేద్దా మంటే ,ఆమె చని పోయిందని ,తెలిసింది అక్కడివారు వీళ్ళను ఆదరించ లేదు జర్మని చేరి,బానిస జీవితమే గడిపారు .అరవై కుటుంబాలు వీజర్ తో బాటు పెన్సిల్వేనియా లోని బెర్క్స్ కౌంటీ చేరారు కొందరు అక్కడి నుండి న్యు జెర్సి వచ్చారు .ఇవాన్జికల్ ప్రోటేస్తంట్లు అయిన మొరేవింలు పారిటాన్ నది ఒడ్డున ‘’హోప్‘’అనే సెటిల్ మెంట్ ఏర్పాటు చేసుకొన్నారు అయితే 1808కి అది పూర్తిగా నీరు కారి పోయింది .

          లూసియానా లో ‘’జాన్ లా‘’అనే వాడు గొప్ప వ్యవసాయం చేయ దలచి జర్మన్లను కూలీలుగా కుదుర్చు కొందామను కొన్నాడు .వాళ్ళు వచ్చిన తర్వాతా పట్టించుకోలేదు .వాళ్లంత జర్మన్ కోస్ట్ఆఫ్ లూసియానా చేరారు .దక్షిణాన ఎబెనేజేర్ ,జార్జియా లకు కొందరు చేరారు .సౌత్ కరోలినా కు యూరప్ నుండి చార్ల్స్తాన్ పోర్ట్ గుండా సరాసరి వచ్చారు జర్మన్లు .నార్త్ కరోలినా ‘’ఆరంజి బెర్గ్ ‘’లో ,మొదటి కాలని ఏర్పడింది .ఇక్కడి నుంచి ,ఇప్పటి లెక్సింగ్ తన కౌంటి వరకు విస్తా రించారు .రిచ్ లాండ్ ,ఫెయిర్ లాండ్ లు ఆ ఊరి పేర్లే .

       వర్జీనియా లో ఎత్తైన ప్రదేశాలకు చేరారు .పెన్సిల్వేనియా లో భూమి దొరక లేదు .అక్కడి ఇండియన్ల దగ్గర కొనాలి .అదీ సరి హద్దు ప్రదేశాలలోనే .అక్కడ అను కూలం కాని వాతా వరణం .1732 లో ‘’జోస్ట్ హైడ్ ‘’అనే జర్మన్ పద హారు కుటుంబా లతో పోతామిక్ రివర్ దాటి ,వర్జీనియా లోని shennadoahకు చేరాడు .విన్చేస్తర్ వద్ద సెటిల్ అయారు .కొందరు ‘’స్ట్రాస్ బర్గ్ ‘’చేరారు .’’శన్నడోవా ‘’లోయ నంతా జర్మన్లు ఆక్రమిన్చేశారు .

            సశేషం –మీ– గబ్బిట దుర్గా ప్రసాద్ –31-10-12-ఉయ్యూరు 


గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.