శ్రీ శంకరుల లలి (కవి)తా సౌందర్య లహరి –34
77—‘’యతే తత్కాళిందీ,తను తర తరంగాక్రుతి శివే –కృశేమధ్యే ,కిన్చిజ్జనని తవ యద్భాతి సుధియాం
విమర్దా దంన్యోన్యం ,కుఛ కలశయో ,రంతర గతం –తనూభూతం ,వ్యోమ ప్రవిశదివ నాభిం ,కుహరిణీం‘’
తాత్పర్యం –హరు సామ్రాజ్నీ !కృశించిన నీ నడుము లో ముందుగా ఎదురుగా కన్పిస్తూ ,యమునా నది యొక్క చిన్న చిన్న తరంగం లాగ ,నల్లగా ఉన్న నీ నూగారు ఎలా ఉందీ అంటే –నీ కుఛ కుంభాలు రెండు ఒరుసుకోవటం వల్ల ,వాటి మధ్య ఉన్న ఆ కాశం ,ఆ ఒరిపిడికి ఆగ లేక నలిగి పోయి ,నల్లగా మారి ,సన్నగా నాభి వరకు కిందికి లక్క జారి నట్లు జారినది గా భావిస్తున్నాను .
విశేషం –భగవతి రోమ రాజి ,ఇతరులకు కన్పించాడు .గిరీశుడైన శివునికే కన్పిస్తుంది .ఆమె స్తనాలు పరి పుష్టాలు .అదే భాగ్య లక్షణం .రోమావళిఅతి సూక్ష్మం .ప్రకాశామానం గా ఉంటుంది .ఆకాశం నుంచి వాయువు దాని నుంచి అగ్ని ,దాని నుండి జాలం ,దాని నుండి భూమి జన్మించాయి .ఉరాసి స్తానం లో అనాహత చక్రం ,దాని పై విశుద్ధ చక్రం ఉంటాయి .అది ఆకాశ తత్వానికి గుర్తు .విశుద్ధ స్తానం లో ఉన్న ఆకాశ తత్త్వం నలిగి ,సన్నగా కిందికి జారుతోందని భావం .
హృదయం సూర్య మండలం .యమున సూర్య తనయ .నాభి నుంచి జారే ఆకాశ తత్త్వం సూర్య మండలం నుంచి కిందికి జారుతోంది .కనుక యమునా నదితో పోల్చారు .ఇడా,పింగళా సుషుమ్నా నాడులే గంగా ,యమునా ,సరస్వతి నదులు .పింగళ అంటే యమున యే .ప్రాణ వాయువు వల్ల షట్చక్ర భేదం ,గ్రంధి త్రయ భేదనం జరుగుతుందని అర్ధం .కాళిం దీనామ ,యమునా నామం గల పింగళా నాడీగత ప్రాణ క్రియను వివరించటమే శ్రీ శంకరులు చేసిన ప్రయత్నం .
78—‘’స్తిరో గంగా వర్త స్స్థన ముకుర రోమావళి లతా –కలావాలం ,కుండం ,కుసుమ శర తేజో హుత భుజః
రతేర్లీలా గారం ,కిమపి ,తవ నాభిర్గిరి సుతే –బిలద్వారం ,సిద్దేర్గిరిశ,నయనానాం,విజయతే ‘’
తాత్పర్యం –త్రిపుర సుందరీ !నీ నాభి స్తిరమై ,వినాశం లేని గంగా నది .పాలిండ్లు అనే పూల మొగ్గలు పూసిన ,రోమ రాజి అనే ,తీగ పాదు,మన్మధ తేజస్సు అనే అగ్నికి హోమ గుండం గా ఉంది .అది రతీ దేవికి విహార గృహం .ఈశ్వర నేత్ర తపస్సిద్ధికి గుహాముఖం .వర్ణించ టానికి వీలు కాని చెలువం అంటే శోభ కలది .
విశేషం –శివుడి కన్నుల ఫలం ఏమిటి ?మంచి దృశ్యా లను చూడటం .ఆమె నాభియే ,ఆయన చూపులకు ఫలసిద్ధి .శివుని మూడో నేత్రం చూపు వల్ల దానికేమీ భయం లేదు .కారణం అది ఇది వరకే అగ్ని గుండం కనుక .నాభి దగ్గర స్వాధిష్ఠాన చక్రం ఉంది.అక్కడే భగవతిని ఉపాశించాలి .నాభి బిల ద్వారమే కాని బిలం కాదు .బిలం –స్వాధిష్ఠాన చక్రం .అక్కడ మన్మధుడు దేవిని ఉపాసిస్తున్నాడు .శివుని తపస్సు కూడా అక్కడే ఫలిస్తుందని అర్ధం .ఆమె నాభి ,బిలద్వారం గిరీశనయనాలకు తపస్సిద్ధి కల్గిస్తుంది .ఇతరు లెవరు దానిని చూడ లేరు .
నవంబర్ ఒకటి గురువారం ‘’ఆంధ్ర ప్రదేశ్ అవతరణ ‘’దినోత్సవ సందర్భం గా శుభా కాంక్షలు .
సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –31-10-12-ఉయ్యూరు
—
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

