అమెరికా లో జర్మన్ హవా –4
1732లో మేరీ లాండ్ లోని బాక్ లాండ్స్ ను మూడేళ్ళ పాటు ,డబ్బేమీ కట్ట కుండా రెండు వందల ఎకరాలు లభించింది .తర్వాతా ఎకరానికి ఒక్క సెంటు మాత్రమె డబ్బు కట్టాలి .అందరికి భద్రత ఉంటుందని లార్డ్ బాల్టి మొర్ ప్రకటించాడు .ఇక్కడ పొగాకు బాగా పండుతుంది .18 వ శతాబ్దపు యాత్రికుడు ‘’పోగాకే మాకు మాంసం ,పానీయం ,బట్ట ,డబ్బూ‘’అన్నాడు .అయితే జర్మన్లకు ఆహార ధాన్యాల మీద ధ్యాసఎక్కువ. .అందుకని అక్కడ చేర లేదు .1740 లో monocacyనది మీద ‘’అన్నా పోలీస్ ‘’ను కలుపు కొని ,బ్రిడ్జి పడింది .మార్కెట్ కూ అను కూల మైంది .ఫ్రెడరిక్ కౌంటి మంచివ్యవసాయ క్షేత్రమైంది .అక్కడ bachelors delight ఏర్పడింది .చివరికి ఇక్కడికి చేరిన వాడే హేగార్స్ డిలైట్ .న్యు ఇంగ్లాండ్ లో ‘’వాల్డో బార్న్ ‘’లో జర్మన్ కమ్మ్యునిటి ఏర్పడింది .1740 లో మూడు వందల మంది పాల టైన్ లోని లూధరన్లు ,’’మైం’’కు చేరారు .వారికి బూమి ,ఇళ్ళు ,చర్చి వాగ్దానం చేశారు .సామ్యుయాల్ వాల్డో దగ్గర పెద్ద మైదానం లోకి చేరారు .వలస దారుల్ని బోస్టన్ లో కలిసి కొత్త నివాసాలకు చేర్చారు .లాగ్ కాబిన్ లో శీతాకాలం rye తో చేసిన వంటకం తో కాల క్షేపం చేశారు .వీరిపై కెనడియన్ ఇండియన్లు విరుచుకు పడే వారు .భయ పడి కొందరు ‘’నోవా స్కేడియా ‘’కు పారి పోయారు .మిగిలిన వారిని ఇండియన్లు చంపేశారు .అంతా ఖాళీ అయింది .1752 లో ‘’కేన్నెబీ’’నది ఒడ్డున కొందరు జర్మన్లు చేరి ,’’ఫ్రాంక్ ఫర్ట్ టౌన్ ‘’ఏర్పాటు చేసుకొన్నారు .తర్వాత ఇది ‘’dresden‘’తో కలిసి పోయింది .
జర్మన్లు శాంతి కాముకు లవటం ,వ్యవసాయ దారులు కావటం వల్ల రాజకీయాల జోలికి పోలేదు .వాళ్ళు పౌరులు అని పించు కోవటానికి అవరోధాలు చాలా ఉండేవి కూడా .అయితే అమెరికా రివల్యూషన్ ను జర్మన్లు సమర్ధించారు .టెక్సాస్ స్టాంప్ ఆక్ట్ వాళ్ళను రాజకీయాల్లో దిగెట్లు చేసింది .లూధరన్లు ,రిఫార్మర్ మినిస్టేర్లు రివల్యూషన్ ను సమర్ధించారు .కొద్ది మంది మాత్రం బ్రిటిషర్ల ను సమర్దిన్చాల్సి వచ్చింది .దీనికి కారణం యూరప్ లోని జర్మన్ రాజ్యాలను బ్రిటన్ కొనటమే .ముప్ఫై వేల మంది ‘’nercenaries ‘’ను ‘’హేస్సియన్ల’’ను అమెరికా తో యుద్ధం చేయటానికి బ్రిటీష్ ప్రభుత్వం పంపింది .యుద్ధం లో ఓడిపోయినా వారిని జర్మన్ సెటిలర్స్ ఆహ్వానించారు .యుద్ధ ఖైదీ లను ఫ్రెడరిక్ మేరీ లాండ్ లకు పంపి వ్యవసాయ కూలీలుగా పని చేయించారు .మొత్తం మీద చావగా మిగిలిన ఆరు వేల మంది హేస్సియన్లు అమెరికా లో ఉండి పోయారు .1783మార్చి లో యుద్ధం ముగిసిందని తెలియ గానే వీరంతా ఆనందం గా’’ బాండ్ ‘’వాయించారు .
అమెరికా రివల్యూషన్ ,నెపోలియన్ యుద్ధాలు ,1812లో యుద్ధం వల్ల అమెరికా కు వలసలు తగ్గాయి .అమెరికా రిపబ్లిక్ అయిన మొదటి నలభై ఏళ్ళు స్తిరత్వం కోసం కష్ట పడాల్సి వచ్చింది .కాని ,1804 లో జార్జి రాప్ప్ నాయకత్వం లోని ‘’రాప్పులు ‘’మత గ్రంధాల ఆధారం గా జీవితం గడిపే వారు .సంపాదన ను పౌర సేవ కు విని యోగిస్తూ ,1814 లో ఇండియానా చేరి ,’’న్యు హార్మని’’ లో ముప్ఫై వేల ఎకరాలలో స్తిర పడ్డారు .అక్కడి మలేరియా కు తట్టుకో లేక పదేళ్ళ తర్వాతపెన్సిల్వేనియా కు చేరుకొన్నారు .చివరి స్తావరం ఒహాయు నది ఒడ్డున ఎకానమీ .ఇది పిట్స్ బర్గ్ కు ఇరవై కిలో మీటర్ల దూరం .అక్కడ ఆయిల్ ,బొగ్గు గనులు ఏర్పాటు చేసుకొని ఆరేళ్ళ తర్వాతబాగా పున్జుకొన్నారు .
‘’ కామన్ ఓనర్ షిప్ ‘’పేరఏర్పడిన జర్మన్ మత సంస్థలు కొన్ని ,’’జోర్‘’ఒహాయు ‘’లకు1819 లో చేరాయి .1844లో బెతేల్ మిస్సోరీ లకు ,1856లో ‘’ఆరా .ఓరిగాన్ ,అమోనా ,ఐయోవా లకు వచ్చారు .మత కారణాల వల్ల ఈ రకం జర్మన్లు అమెరికాకు రావటం కొత్త విషయం .19 వ శతాబ్దం లో వ్యక్తీ గతం గా కుటుంబాలతో ,సామూహికం గా అమెరికాకు జర్మన్లు చేరారు .రెండొంతుల మంది ఆస్త్రియా ,హంగేరి ,రష్యా లకు వెళ్లారు .1820 లో ఎనిమిది వేల మంది జర్మన్లు అమెరికా వచ్చారు .నెపోలియన్ యుద్ధం వల్ల బ్రిటీష వారు పంపించే ‘’చీప్‘’వస్తువులను చూసి జర్మన్లు ఏవ గిన్చుకొన్నారు .
ఆంద్ర ప్రదేశ్ అవతరణ దినోత్సవ శుభా కాంక్షల తో
సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –1-11-12-ఉయ్యూరు

