అమెరికా లో జర్మన్ హవా –6

       అమెరికా లో జర్మన్ హవా –6

1852-54 కాలం లో అయిదు లక్షల మంది జర్మన్లు అమెరికా చేరారు .వాలందఱు అమెరికా పద్ధతుల్ని ఒంట బట్టించుకొని ‘’tranformed  them selves complete yankee ‘’అని పించుకొన్నారు మాత్ర్రు భాషను మాత్రం కాపాడుకొన్నారు .జాతీయతను నిల బెట్టుకొన్నారు .1836లో సెయింట్ లూయీస్ లో జర్మన్ భాషా విద్యా లయాన్ని ఏర్పాటు చేసుకొన్నారు .ఇవి 1860 కి 38 అయాయి .మరో నాలుగేళ్ల లో జర్మన్ భాషను కర్రిక్యులం లో చేర్చి బోధించాలని ప్రభుత్వం విధాన ప్రకటన చేసింది 1850లో అమెరికన్లు జర్మనీ భాష ను నేర్చారు .అప్పుడు మిల్వాకీ లో ఏడు జర్మన్ ‘’బ్రూవేరీలు ‘’ఉన్నాయి .పదేళ్ళ తర్వాతా ఇవి 19 కు పెరిగాయి .బీర్ గార్డెన్ల ను పెంచారు .జర్మన్ బీర్ కు ప్రత్యేకత పెరిగింది .జర్మన్ సంగీతానికి ప్రాధాన్యత వచ్చింది .ఒపెరాలు పెరిగాయి .జిమ్నాస్టిక్ క్లబ్బులు ,వెలిశాయి .శిక్షణా విద్యా లయాలు వెలిశాయి .ఇప్పటికి టర్నర్లు జిమ్నాస్టిక్ ప్రాక్టీస్ చేస్తున్నారు .వ్యాయామ విద్య నేర్పారు .యార్క్ విల్ అనే  న్యూయార్క్ లోని అతి పెద్ద భాగం లో జర్మన్లు ఎక్కువ గా ఉన్నారు .

      అమెరికా లో కిండర్ గార్టెన్ స్కూళ్ళు జర్మన్ల వల్లనే ఏర్పడ్డాయి .’’రోసరీ ‘’అనే స్త్రీ ‘’ది సిస్టర్స్ ఆఫ్ చారిటీ ‘’సంక్షేమ సంస్థ ను బాల్టి మోర్ లో ఏర్పరచి ఆర్ధిక సాయం అందించింది .ఆమెయే మొదటి హాస్పిటల్ ను 1846 లో ఏర్పరచింది .జర్మన్ యూదులకు ,ప్రోటేస్తంట్ లకు వేర్వేరు సంస్థ లున్నాయి .

                        ఫార్టీ యైటర్లు

    1848 లో నాలుగు నుంచి పది వేల దాకా జర్మన్లు జెర్మనీ  రివల్యూషన్ లో ఇమడ లేక అమెరికా వచ్చేశారు .వీ రినే‘’ఫార్టీ యైటర్స్ ‘’ అంటారు .వీరంతా జర్మన్ అమెరికన్ సంస్కృతిని చాలా గొప్ప గా పెంచటానికి కృషి చేశారు .1835లో‘’know nothing party ‘’అనే anti foreign feeling ‘’ఏర్పడింది .ఇంకో పదిహేనేళ్ళ లో నేటివిజం పెరిగి వీరికి బలం పెరిగింది .ఇమ్మిగ్రంట్స్మీద ఆంక్షలు విధించాలని కోరారు .అమెరికా చేరిన వారి హక్కులు కత్తి రించాలని ఒత్తిడి చేశారు .జర్మన్లు ‘’సాబాత్ ‘’అనే పండుగ ను చేసుకొంటారు .ఆ పండుగ రోజున సారా త్రాగటం వారి సంప్రదాయం .దీన్ని అమెరికన్లు వ్యతిరేకించారు .డాన్సులు ,తాగుడు ,బౌలింగ్ ఆది వారం నాడు ఇక్కడ నిషేధం .జర్మన్లు దీన్ని వ్యతిరేకించారు .1861లో జర్మన్ సినిమా హాల్ యజమాని ఆదివారం నాడు సినిమా హాలు మూసెయ్య టానికి ఒప్పుకో లేదు .నలభై మంది ఆఫీసర్లు హాల్లోకి జనం రాకుండా అడ్డు పడ్డారు .1855 లో కక్షలు బాగా పెరిగాయి .కాద లిక్కులు బాగా దెబ్బ తిన్నారు .సివిల్ వార్లో బానిసత్వ వ్యతిరేకులకూ ఇదే గతి ‘’.48 గాళ్ళు ‘’బానిసత్వానికి వ్యతి రేకులు .వీరిలోcarl shulz రిపబ్లికన్ పార్టీ లో చేరాడు .ఈ పార్టి 1854 లో ఏర్పడింది .ఈ  పార్టి ‘’నో నతింగ్ ‘’గాళ్ళ కు వ్యతి రేకం .దీనితో జర్మన్ల రొట్టె విరిగి నేతి లో పడింది .

           1860 లో ‘’minute men ‘’అనే దక్షిణ సోల్జర్ల అనుకూల సంస్థ ఏర్పడింది .వీరిని అడ్డుకొన్న వాళ్ళు జర్మన్ వాలన్తీర్లె . దీనితో మిసోరి యునియన్ లో ఉండి పోయి, జర్మని అమెరికన్ల కు రాజ కీయ విజయం లభించింది .పెన్సివేనియా నుండి కొలరాడో దాకా ఉన్న జర్మ యువకులందరూ సివిల్ వార్ లో పాల్గొన్నారు .henry A.kircher అనే మొదటి తరం అమెరికన్ సివిల్ వార్ గురించి విస్తృతం గా రాసి జర్మని కి పంపాడు .ఈయన ఇలినాయిస్ లోని బెల్ విల్ కు చెందిన వాడు .ఈయన కూడా యుద్ధం లో పాల్గొన్నాడు .వేలాది జర్మన్లు ఈ యుద్ధం లో చని పోయారు .1865లో సివిల్ వార్ముగిసింది .జర్మన్ల దేశ భక్తీ అనన్యం అని రుజు వింది .

              పారిశ్రామీకరణ –యుద్ధాలు

         1880 లో 1,445,181మంది జర్మన్లు అమెరికా చేరారు .ఇంకో రెండేళ్ళ తరువాత రెండు లక్షల యాభై వేల మంది వచ్చారు .వీరంతా గ్రేట్ ప్లైన్స్ అంటే కెనడా లోని ‘’సస్కాచేరాన్ ‘’నుంచి నార్త్ ,సౌత్ డకోటా, నెబ్రాస్కా ,కేంసాస్ వరకు చేరుకొన్నారు .ఇక్కడ వర్ష పతం తక్కువే .అయితే 1872 -1920 కాలం లో రష్యన్ జర్మన్లు లక్షా ఇరవై వేల మంది వచ్చారు .ఈ ప్రయరీలు వాళ్లకు ‘’స్తేప్పీలు ‘’అని పించాయి .ఇక్కడ చేరి వ్యవసాయం చేసి 1920 నాటికి సస్య శ్యామలం చేసి ‘’granary of the world ‘’గా మార్చేశారు .ఇప్పటికి నాలుగు లక్షల ఇరవై వేల మంది జర్మన్లు అయారు .ఎన్నో రకాల ధాన్యాలను పండించారు .వీరే ఇక్కడ మొదటి సారిగా ‘’యెర్ర గోధుమ ‘’పంట పండించిన వారు .ఈ విత్తనాన్ని టర్కీ నుంచి తెచ్చారట .దీన్నే వీళ్ళ భాష లో ‘’red hard winter wheat ‘’అన్నారు .పైన చెప్పిన ప్రదేశా లన్నిటిలో గోధుమ విరగ పండింది .క్రమం గ సాగు భూమి తగ్గింది .

   Verbote  అనే జర్మన్ వార్తా పత్రిక 188౦ లో ఓట్ల భాగవాతాన్ని ప్రచురించింది .మరో నాలుగేళ్ల లో కూలీలలు గడ్డు కాలం దాపురించింది .ఇంకో రెండేళ్లలో చికాగో లోని కార్మికుల సంఖ్య లో మూడో వంతుజర్మన్లె అయారు .నేటివ్ అమెరికన్లు బాగా తగ్గి పోయారు .

                సశేషం —మీ గబ్బిట దుర్గా ప్రసాద్ –4-11-12—ఉయ్యూరు 


గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in అమెరికా లో and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.