పద చిత్ర రామాయణము –అరణ్య కాండ
తెలుగు కధా సీమలో అలవోక గా విహరించి ,విమర్శ అరణ్యం లో వీర విహారం చేసి ,ఇప్పుడు పద చిత్ర రామాయణం లో సభక్తికం గా విహరిస్తున్న ఆప్తులు శ్రీ విహారి గారికి –మనః పూర్వక ప్రణామాలు .ఉభయ కుశలోపరి –
మేమిద్దరం ఏప్రిల్ మొదటి వారం లో అమెరికా వెళ్లి ,ఆరు నేలలుంది ,అక్టోబర్ మొదటి వారం లో తిరిగి వచ్చాము .వెళ్ళేటప్పుడు మీ ‘’అయోధ్య ‘’నుతాపీగా ఇక్కడ చదివే తీరిక లేనందు వల్ల మాతో అమెరికా తీసుకొని వెళ్లాను .మేము వచ్చేసరికి ‘’అరణ్య కాండ ‘’అందింది .రెండు చది వాను .ముందుగా అయోధ్య కాండ గురించి –అమెరికా లో నాలుగైదు సార్లు చదవ టానికి తీవ్ర ప్రయత్నం చేశాను .కాని కదా భారమో అన్నిటా అందులో వ్యాపించిన దుఃఖ భారమో ,గుండెల్ని పిండి వేసే సన్నివేశాల బరువో ,అందరి మనో భావాలు ఆర్డర మై పోవటం వల్ల గుండె బరువై పోవటమో తెలీదు కాని పద్యం నుంచి ,పద్యానికి కదలటానికి చాలా సమయం పట్టేది ..ఆపి మళ్ళీ చది వే వాడిని .మళ్ళీ అదే స్తితి .కధే అంత .రామ వనవాస ప్రారంభం అందర్నీ శోక సంతప్తులను చేసింది .శోక సంద్రపు కెర తాలు ఈడ్చి ఈడ్చి తనను తున్నాయి .గుడ్ దిటవు చేసుకొంటేనే ముందుకు సాగ గలమని పించింది .మొత్తం మీద అక్కడే అయోధ్య ను పూర్తీ చేశాను .ఏదో మీ తనువు లో ఇవతళించిన ప్రాచీ భావం మిమ్మల్ని ఊపిరి సలప కుండా శ్రీ రామ గాధను రాయిస్తోంది .మీ కవిత్వం లో విశ్వనాధ దర్శనమిస్తాడు .పురాకవుల వైభవం జ్యోతకం అవుతోంది .ప్రతి పద్యం సాన దేరింది .సందర్భానికి తగిన ఛందస్సు నుపయోగించి ,ఆ ఛందస్సుకే సార్ధకత ను చేకూర్చారు .అడుగడుగునా మీ ఆరాధన భావం వేద వేదాంగాల పై పట్టు కానీ పిస్తుంది .చాలా కాలానికి దీని పై రాస్తున్నాను కనుక ఇంత కంటే రాయటం సమర్ధ నీయం కాదని పించి అయోధ్య ను ముగిస్తున్నాను .
మేము వచ్చేసరికి అరణ్య కాండ మా కోసం ఎదురు చూస్తోంది .కాస్త వెసులు బాటు చేసుకొని పది హేను రోజుల క్రితం చదవటం ప్రారంభించి పూర్తీ చేశాను .దాని పై పూర్తిగా రాసే ముందు మీకో విజ్ఞప్తి .. త్వరలో మీరు మిగిలిన రెండు కాండలు పూర్తిచేస్తారు .అప్పుడు వాటికి అను బంధం గా మీరు వాడిన వివిధ ఛందో రీతులు ,వాటి అవసరం అవి సందర్భానికి ఎలా తగి ఉన్నాయి ,కధకు ఏవిధం గా దోహద పడ్డాయి ,శిల్పాన్ని ఎలా పరి పుష్టం చేశాయి ,కదా నిర్వహణ లో అవి ఎంత విలువను సంతరించుకొన్నాయి అన్న విషయాలన్నిటి మీద సాది కారం గా ఛందో నిపుణులు ఎవరి తో నైనా విశ్లేషణాత్మకం గా వివరణాత్మకం గా పరిశీలన ,పరి శోధనా చేయించి రాయిస్తే పరమాద్భుతం గా ఉంటుందని నాకు అని పించింది .ఆ పని తప్పక చేసి,నాబొంట్లకు అందులోని రహస్యాలను అందు బాటు లోకి తీసుకు రావాలని మనవి చేస్తున్నాను .
అరణ్య కాండ
ముఖ చిత్రమే మహా ముచ్చట గా ఉంది.’’వెడలెను కోదండ పాణి ‘’కి అనుగుణం గా ఉండటం తగినది .తపోధను లైన మహర్షులను వర్ణించి చెబుతూ ‘’చిరుత నవ్వుల నిసువు –ససి ,మిస –నొసలు ‘’అనటం కొత్తదనం .శ్రీ రామ సోదరులను చూచినా వర ముని బృందం ‘’గాలి పటంబుల గాంచుచు కేరేడు బాలల పగిదిన్ ‘’అని పించటం అడవిలో గాలి పటాలను ఎగరేసి చూపించి నట్లుంది .భావుకత కు జోహార్లు .ఆ రెండు పద్యాలను ‘’మధుర గతి ‘’చందం లో రాయటం వారి మనసు మాధుర్యాన్ని వ్యక్తం చేసింది అది అమృత కాంక్షే మునులకు .అక్కడి ప్రాకృతిక అందాన్ని వర్ణించే ముందు ‘’కమల గీతి ‘’లో చెప్పిన కోమల భావం బాగుంది .సమగీతి ,పవడ గీతి పద్యాలలో వాతావరణ ప్రశాంతత గోచరించింది .’’రామ రామాభ్యుదయ హితా రామ సోమ ‘’అనే పద్యం లో పాదాలన్నీ ఆమ్రేడితాలై సొగసు కూర్చాయి .మునుల ఆనంద పార వశ్యం కన్పించింది .తాపసీ లలనల దర్శనాన్ని ‘’సుమంగలి’’పద్యం లో జోడించటం ఔచిత్యానికి పరమో దాహరణ
రెండే పాదాలతో సాగే ‘’కలియుగ మంజరి ‘’ప్రకృతి చిత్ర పటాన్ని ఆవిష్కరింప జేసింది .అంతే కాక గమనాన్ని సూచిందని పించింది ‘’సకల మెరిగిన వారు సాక్షులై నిలువ ,–వికల్పము నొందె నడవి తనంత తాను ‘’అన్న మాట సొగసు గా ఉంది.విరాధ కధలో రాముని స్తితిని రామానుజుడు ‘’నీరు రామియున్ ,సారము లేక తీలు బడు సస్యములో తల వంపు ‘’గా ఉందని గొప్ప సామ్యం గా రైతు భాష గా చెప్పారు .వాడి మదాన్ని ‘’మత్త క్రీడ‘’లో వర్ణించటం బాగు బాగు .అగస్త్య మహర్షి రాముని తో రామ ధర్మ పత్నిని ‘’ఈ ధరాజ ,నీ మనసు ధార లోని సిరి ,మానిత వర్తిని భాగ్య రాశియున్ ‘’అని చెప్పటం లో సీతా సాధ్వి వేద శిఖా మణి అని గుర్తు చేయటమే .శూర్పణఖ చేసిన పనిని ‘’పెరగాయ పని ‘’అనటం కొత్త మాటే .సోదరుడు రావణుని తో శూర్పణఖ సీతా దేవి గురించి ‘’సుధ్యుపాస్య –సౌందర్యమున కామే నిర్వచనము ‘’అన్న మాటలలో మొదటిది ప్రాచీ నతకు ,రెండోది ఆధునిక భావా విష్కరణకు నిదర్శనం .
మారీచాశ్రమం లో రావణుని తొందర పాటు ను వర్ణించేందుకు వాడుకొన్న ద్రుత విలంబితం ,అశ్వ గతి సందర్భోచితం గా ఉన్నాయి .మాయ లేడి ని చూసి సీత వ్యామోహ పడటానికి ‘’మధురాక్కర ‘’పద్యం మధురం గా అక్కర తీర్చింది .త్రిపదలు ‘’త్రిపధల్లా ‘’శోభించాయి .సీతను రావణుడు తర లించటానికి ,తరళాన్ని,అల్ప మైన మనసు తెలియ పరచటానికి ‘’అల్పాక్కర ‘’ ఉపయోగ పడ్డాయి .సీతను లంకకు చేర్చటానికి ‘’వియోగిని ‘’ఛందస్సు బాగా తోడ్పడింది
శబరి రాముని రాక కై ఎదురు చూస్తూ పూల చెట్లను సరి చేసే పద్యం ‘’ఓపిక జేసి కొంచు’’కృష్ణ శాస్త్రి గారి రచనా అని పించింది సుమా .’’వియతి చందం ‘’లో ఆమె మనో వేదన ఆరాధనా చక్కగా ఆవిశారైంచారు .’’ఆలస గతి ‘’లో ఆమె రాముని ‘’ఆలస గతి నీ రెరుగు డైన దయ చేతన్ ‘’ అని చెప్పించటం అరుదైన విషయం .సందర్భో చితం పరమ ఔచితీ వంతం .అరణ్య కాండ ముగింపు లో ఆ కాండాన్ని ‘’సత్య ధర్మ పరాక్రమ సత్వ వివ్రుతి –యుదిత సుఖ దుఃఖ మిశ్ర భావోప పత్తి –సమాధిక పద చిత్ర రచనా శ్వాస సమితి ‘’అని మొత్తం సారాన్ని పిండి చెప్పారు .
ఇంత కవితా విహారం, కదా కదన.శిల్ప విహారం మీరు చేసినా వినమ్రం గా ‘’రధియై శ్రీ రఘు రాముడు–కధనము నడిపెను ,మదీయ కరములు వ్రాసెన్ –విదియు ,విధానము నతనివే –ప్రదిత కు నేనెట్లు తగుదు–పలుకుల వెలదీ ‘’అని సరస్వతీ దేవికి నివేదించటం మీ వినయానికి ,ప్రదితకు ,మహా సంస్కారానికి ప్రతీక .
మీ– గబ్బిట దుర్గా ప్రసాద్ –5-11-12—ఉయ్యూరు
—
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

