బిస్మార్క్ 1871 లో జర్మనీ ఐక్యత ను సాధించాడు .అతన్ని ‘’ఐరన్ చాన్సెలర్ ‘’అంటారు .మన సర్దార్ పటేల్ సంస్థానాలను రద్దు రద్దు చేసిన పుడు ఆయన్ను ‘’బిస్మార్క్ ఆఫ్ ఇండియా ‘’అని ,ఉక్కు మనిషి అని అన్నారు .బిస్మార్క్ ప్రష్యా దేశాస్తుడు .సైన్యం లో జేర్మన్లను తీసుకొన్నాడు .అమెరికా లోని జర్మన్ల ఆరాధ నీయుడైనాడు .అందుకని వారు జర్మనీ ఐక్య త సాదింప గలిగి నప్పుడు ,జర్మని అమెరికన్ల ఐక్యత ను ఎందుకు సాధించ లేము అని ఆలోచించారు .కొందరు మాత్రం బాక్ టు పెవిలియన్ లా,జర్మని వైపు దృష్టి సారించారు .ఇక్కడి భాష ,పద్ధతులకు నెమ్మదిగా అలవాటు పడ్డారు .ఒకరికొకరు సాయం చేసుకోవాలని భావించారు .ఇంతలో immigration restriction ,American protective association అనే సంస్తలేర్పడ్డాయి .జర్మని అమెరికన్లు ఇంగ్లీష్ మాట్లా డాలనే ఆందోళన పెరిగింది .దీన్ని జర్మన్లు వ్యతి రేకించారు .
1907 లో’’german American national alliance ‘’ అనేది అమెరికా లో పుట్టిన జర్మన్ ఇంజినీర్ charles J.hexamer నాయకత్వం లో ఫిలడెల్ఫియా లో ఏర్పడింది .ఇది కూడా ‘’pan greeman league లాంటిదే .జర్మని నాయకుడు Kaiser whelem 1890 లో అధికారానికి వచ్చి మిలిటరి డామినిజాన్ని పెంచాడు .ఈ పరిస్తితి లో ఇలాంటి సంస్థ ఏర్పడితే ,అనుమానాలు పెరుగుతాయని జర్మన్లు పునరాలోచన లో పడి పోయారు .అమెరికా లో ఉడ్రో విల్సన్ ప్రెసిడెంట్ అయి .’’set the nation on a course of neutrality using that Americans be ,impartial in thought and well as in action ,neutral in fact aswell as in name ‘’అని ప్రకటించాడు .యుద్ధం ఒక నెల జరగ గానే జర్మన్ల మారణ కాండ, లోవెన్ లైబ్రరి దహనం ,లూసియాన అనే బ్రిటీష నౌక పై బాంబు దాడి ,పన్నెండు వందల మంది ప్రయాణీకుల్లో నూట ఇరవై మంది అమెరికన్లు దుర్మరణం చెందటం వల్ల తటస్థ వైఖరి మీద విల్సన్ తీవ్రం గా మాట్లాడ వలసి వచ్చింది .
జర్మన్ అమెరికన్ పేపర్లు తనకు వ్యతి రేకం గా రాయటం విల్సన్ ను బాధించింది .’’మన దేశ రక్త నాళాల్లో విషం నింపిన వారిని నిర్దాక్షిణ్యం గా అణచి వేస్తాం ‘’అన్నాడు ఉడ్రో -కాంగ్రేస్ లో .’’the right is more precious than peace ‘’అంటూ ప్రజాస్వామ్య అవసరాన్ని నొక్కి చెప్పాడు .క్రమంగా యూరప్ లో జర్మన్ వ్యతిరేకతా పెరిగి పోయింది .1918 లో యాంటి జేర్మనిజం ‘’అమెరికా లో ఎక్కువై పోయింది .జర్మన్ లను అను మానించారు .జర్మన్ల తోయుద్ధానికి సహాయం కోసం ‘’లిబర్టి బాండ్స్ ‘’కొని పించారు .యుద్ధానికి వ్యతి రేకం గ మాట్లాడితే శిక్షించారు .అమెరికా జండాను ముద్దు పెట్టుకోమన్నారు .స్కూళ్ళు ,ఇళ్ళునిర్జనాలై పోయాయి .1917-1950 కాలం లో పది హేను వందల మంది మిన్నో నైట్లు అమెరికా నుంచి కెనడా పారిపోయారు .
జర్మన్ సంగీత కళాశాల పై దాడి చేశారు .జర్మనీ సంగీత ఉజ్జ్వల కెరటం సింఫనీ మహా విద్వాంసుడు బీథోవెన్ ను పిట్స్ బెర్గ్ లో అడుగు పెట్ట నివ్వ లేదు .తత్వ వేత్త ,మహా జర్మన్ నాటక కర్త ,విఖ్యాత జర్మన్ రచయితా అయిన’’ గోధే’’విగ్రహాన్ని కూల గొట్టారు ..స్కూల్ కర్రిక్యులం లో జర్మన్ భాషను ఎత్తేశారు .జర్మన్ స్కూళ్ళు మూత పడ్డాయి .జర్మన్ పేపర్లను నిషేధించారు .ఒక రకం గా చెప్పా లంటే జర్మని ని తుడిచి పెట్టె సర్వ ప్రయత్నాలు చేశారు .’’de germanaize ‘’జరిగింది .మిన్నే సోటా లోని సెయింట్ పాల్ లో జర్మన్ లైఫ్ ఇన్సురెన్స్ బిల్డింగ్ మీద ఉన్న‘’జేర్మీనియా ‘’దేవత విగ్రహాన్ని కూడా పడ గొట్టారు .ఆ బిల్డింగ్ పేరు ను గార్డియన్ బిల్డింగ్ గా మార్చారు ..వీధులు ,స్కూళ్ళు టౌన్ ల పేర్లన్నీ మార్చి పారేశారు . ‘’హం బర్జేర్ ‘’ను ‘’లిబర్టి స్టేక్ ‘’అని పిల్చారు .sawerkrant ను లిబర్టి కాలేజి అన్నారు .నెబ్రాస్కా లోని జర్మన్ టౌన్ –గార్లాండ్ అయింది .అయోవా లోని బెర్లిన్ ను లింకన్ అని పిలిచారు .జర్మన్ మీసిల్స్ ను లిబర్టి మీజిల్స్ అన్నారు .డాక్టర్లు .
1918 జర్మన్ అమెరికన్ నేషనల్ అలయన్సు కను మరు గైంది. జర్మన్ భాష మాట్లాడటం మానేశారు .ఇంట్లో కూడా జర్మన్ భాష మాట్లాడటం లేదు పేర్లను మార్చుకొన్నారు .జార్జి వాషింగ్ ట న్ వొచ్ ఆఫ్ ఫిల డేల్ఫియా తన పేరు చివర ‘’వోక్స్ ‘’అని తగి లించుకొన్నాడు మతాన్ని బాగా అభిమానించే జర్మన్లు ఇంకా ఎక్కువ గా ఆచరించటం మొదలెట్టారు .అదే ఏడాది నవంబర్ లో ఈ చర్చి గ్రూపులు జర్మని లో పునరావాస కార్య క్రమాలు చేబట్టి ఇక్కడి అమెరికన్ లకు కారం రాశారు .మళ్ళీ జాతీయ భావాలు పెరిగాయి .జర్మన్ అమెరికన్లు జర్మనీ కి అన్ని విధాలా సాయం చేసి పునర్వైభవానికి సహకరించారు
1919 లో న్యు యార్క్ లో ‘’స్టీన్ బెన్ సొసైటీ ‘’ఏర్పడింది అది రాజకీయ ఐక్యత కోసం మంచి కృషి చేసింది .అప్పటికే జర్మన్లు ఇంగ్లీష నేర్చుకోవటం ,అనేక వృత్తుల్లో చేరటం జరిగింది .ఇరవై శతాబ్దం వచ్చే సరికి జర్మన్ భాష మాట్లాడటం దాదాపు మర్చి పోయారు .యుద్ధానంతరం జర్మన్లు ‘’cultural amnesia ‘’లో పడి పోయారు .మొదటి తరం వారు తమ మూలాలను వదిలేస్తే ,తరువాతి వారికి అసలు ఆ సంప్రదాయమే కరు వై పోయింది .
సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –6-11-12-ఉయ్యూరు
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com

