శ్రీ శంకరుల లలి (కవి )తా సౌందర్య లహరి –41
92—‘’గతాస్తే మంచత్వం ద్రుహిణగిరి రుద్రేశ్వర భ్రుతః –శివ స్వచ్చ ,చ్చాయా ఘటిత కపట ప్రచ్చ దపటః
త్వదీయానాం భాసాంప్రతి ఫలానా రాగారుణతయా –శరీరే శృంగారో ,రస ఇవ దృశాం దోగ్ది కుతుకం
తాత్పర్యం –అమ్మా చిత్కళా నంద కలికా !బ్రహ్మ ,విష్ణు ,రుద్రా ,ఈశ్వర అనే నలుగురు సేవకులు నీ మంచం కోళ్ళు గా మారి మంచం రూపం పొందారు .వారు కామ రూపం తో నీ మంచానికి నాలుగు కోళ్ళు అయి,నీ సమీపం లో ఉన్నారు .పైన కప్పుకొనే వస్త్రం లా ఉన్న సదాశివత్వం ,తెల్లని కాంతులతో ,నీ అరుణ కాంతులు వ్యాపించగా శృంగార రసం రూపు దాల్చిందేమో అన్నట్లు ,నీ కండ్ల కు ఆనందం కల్గిస్తోంది .
విశేషం –సదాశివునికి -భగవతి యెర్రని కాంతి మీద పడి ,ఆయనకు సహజం గా ఉన్న తెల్లని దేహం అరుణ కాంతిని పొంది ,శృంగార రస శరీరం గా కనీ పిస్తోంది .అంటే శృంగారమే శరీరం లాగా ఉన్నాడు సదా శివుడు .’’పంచ ప్రేతాసనా సీనా ,పంచ బ్రహ్మ స్వరూపిణీ ‘’అని లలితా సహస్ర నామం లో ఉంది.’’రుద్ర మళ యాళం’’లో
‘’బ్రహ్మ విష్ణు రుద్రశ్చ ,ఈశ్వరశ్చ ,సదా శివః –ఏతే పంచ మహా ప్రేతా భూతాది పతయో మాతః –చత్వారో మంచ చరణః పంచమః ప్రచ్చదః పటః –సాక్షీ ప్రకాశ రూపేణ ,శివేనా భిన్న విగ్రహే –తత్రాసనే సమాసీనా ,నిర్భరానంద రూపిణీ ‘’అని ఉన్నవిషయం శ్రీ శంకరులు చక్కని శ్లోకం లో అందం గా ,శృంగార భరితం గా చెప్పారు .
పచ్చడమే –ఘటిత కపటం అంటే మాయా రూపం ‘’ప్రచ్చాడ కపటసం కశిపుహ్ –కశి పుశ్చ సదా శివః –కశి పూర్వక స్వదేహ కాంతి చే కల్పిత మైన ఉపరి వస్త్రం అని భావం .
93—‘’అరాళాకేశేషు ,ప్రక్రుత సరళా ,మంద హసితే –శిరీషాభా చిత్తేదృష ద్రుపల శోభా ,కుఛ తటే
భ్రుశం తన్వీ మధ్యే ప్రుదురురసి జారోహ విషయే –జగత్రాతుం శంభోర్జయతి ,కరుణా, కాంచి దరుణా ‘’
తాత్పర్యం –చారుహాసా మణీ !నీ కేశ పాశం నొక్కులు నొక్కులు గ ఉండటం వల్ల ,వక్రత ఉంది . .మరెక్కడా నీ శరీరం లో వక్రత లేదు ..స్వభావ సిద్ధ మైన నీ చిరు నవ్వు ,అందం గా ,మెత్తగా ఉంది.స్తన యుగ్మం సన్నికల్లు లాగా బలుపు ,చెలువదనం కలిగి ఉంది.సన్నని నడుము ,స్తన యుగ్మం లో పిరుదుల వద్ద స్తూలత్వం పొందింది .అనిర్వచ నీయ మైన శంభుని కరుణా స్వరూపమైన అరుణ అనే శక్తి జగత్తును రక్షించటం లో నిపుణ యై ,సర్వత్రా ఉత్కర్ష తో ,ప్రకాశిస్తోంది .చిరునవ్వు లో స్వభావ సిద్ధ మైన సరళ ఆసక్తి ఉండి మనసులో దిరిసెన పువ్వు లాంటి మహా మెత్తని శక్తి ప్రకాశిస్తోంది .స్తనాల్లో సన్ని కల్లు వంటి శక్తి ఉంది .నడుము లో తన్వీ శక్తి ఉంది .కుఛ ,నితంబం లలో స్తూల శక్తి ఉంది .జగద్రక్షణకు అరుణ శక్తి ,కరుణా శక్తి ఉన్నాయి .
విశేషం –శ్రీ శంకరా చార్యులు అమ్మ వారిని కిరీటం నుంచి ,పాదాంతం వరకు వర్ణించారు ‘’మౌళి తో మానవా,దేవాస్చారనః పునః ‘’అని కావ్య లతా అనే అలంకార శాస్త్రం చెబు తోంది .మానవులను శిరసు నుంచి ,దేవత లను చరణం నుంచి పైకి వర్ణించాలి అని శాస్త్రం .అయితే శ్రీ లలితా సహస్ర నామాలలో దేవిని కిరీటం నుండి పాదాంత వర్ణన చేయటం . .దానినే భగవత్పాదులు అనుసరించారు వ్యాస మహర్షి పద్ధతి కూడా ఇంతే .ఈ శ్లోకం లో కూడా కేశం నుంచి నితంబం వరకు శంకరా చార్య వర్ణించారు .
పరమేశ్వరుని జగద్రక్షణా శక్తి యేఅరుణ శక్తి .శక్తికి శక్తి వంతునికి భేదం లేదు .అందుకే వారి ఐక్యత కే ‘’క కార‘’ప్రయోగం చేశారు ఆచార్యుల వారు అంటే శివునికి అభిన్న ఐన చిచ్చక్తి మూర్తి రూపం ధరించి జగద్రక్షణ కు ప్రసన్ను రాలు అయింది అని భావం .
భగవతి అరుణ .ఆమె లో శంభుని కరుణ మూర్తి కట్టింది .కరుణ కు కుటిలత్వ ,మందత్వ ,శీర్నత్వ ,కథోరత్వ ,,హిమ్సత్వ ,క్షీణత్వాలు పనికి రావు .అందుకే ఆమె కేశాలకే కుటిలత్వం ఉంది ,ఇంకెక్కడా లేదన్నారు .ఆ కేశాలనూ వెనక్కి తోసేసింది .మందత్వం చిరు నవ్వు లో ఉంచింది .కుటిలత్వం కేశ శోభ ను వృద్ధి చెందిస్తుంటే ,మందత్వం చిరు నవ్వు కు సొగసు తెస్తోంది .క్రుశించింది నడుమే కాని ఆమె కరుణ కాదని స్పష్టం చేశారు .ఆ క్రుశిత్వాన్ని కప్పి వేయ టానికి స్తూలత్వం ఉంది ,స్తిరత్వం ఉంది .
సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –7-11-12—ఉయ్యూరు
—
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com

